ఏపీలో పెన్షన్‌కు ఎలా అప్లై చేసుకోవాలంటే!

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్‌కు ఎలా అప్లై చేయాలి? దేశం డిజిటల్ వైపు పరుగులు పెడుతున్నా పింఛన్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిందేనా..?

Update: 2024-07-01 09:28 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌టీఆర్ భరోసా పింఛన్ల జోరుగా సాగుతోంది. హామీ ఇచ్చినట్లే జూలై ఒకటో తేదీనే ప్రతి లబ్దిదారుకు ఇంటి దగ్గరే పింఛన్‌ను అందించారు. ఏప్రిల్ నెల నుంచి అమలు కావాల్సిన అదనపు మొత్తాన్ని కూడా అందించారు. పింఛన్ల పంపిణీని ఎమ్మెల్యేలు, మంత్రులు దగ్గరుండి పర్యవేక్షించారు. ఇందులో సీఎం చంద్రబాబు కూడా పాల్గొన్నారు. వాలంటీర్ల సహాయం లేకుండా ఒక్కరోజులోనే వంద శాతం పింఛన్ల పంపిణీ సాధించాలన్న లక్ష్యంతో టీడీపీ ముందుకు సాగుతోంది. ఇందుకోసం టీడీపీ.. సచివాలయ ఉద్యోగులను రంగంలోకి దించింది. ఒక్కో ఉద్యోగి 50 మంది లబ్దిదారులకు పింఛన్ అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏవైనా అనివార్య కారణాల వల్ల ఎవరైనా తొలిరోజు పింఛన్ అందుకోకుంటే వారికి రెండో రోజు సచివాలయ సిబ్బంది ఇంటికి వెళ్లి అందింస్తారు అని అధికారులు చెప్పారు. ఇదంతా బాగుంది.. కానీ కొత్తగా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎలా? పింఛన్‌ దరఖాస్తు కోసం కూడా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిందేనా? ఎలా అప్లై చేసుకోవాలి? ఇలాంటి అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా పింఛన్‌ కోసం అప్లై చేసుకోవాలంటే ఎలానో తెలుసుకుందాం..

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్‌కు అప్లై చేసుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయి. అవి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్. ఇంటర్నెట్, ఆన్‌లైన్‌ గురించి పెద్దగా తెలియని వారికి ఆఫ్‌లైన్ పద్దతి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. పింఛన్ దరఖాస్తు కోసం సదరు లబ్దిదారుడు తన ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్, తెల్ల రేషన్ కార్డు లేదా ఆదాయ ధృవీకరణ పత్రాలను జమ చేసుకోవాలి.

ఆఫ్‌లైన్ పద్దతి

ఆఫ్‌లైన్‌లో పింఛన్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే.. ముందుగా అందుకోసం ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://sspensions.ap.gov.in/SSP/Home/Index ను విజిట్ చేయాలి. అందులో లాగిన్ అయిన తర్వాత ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ యోజన అని స్కీమ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి దరఖాస్తు ఫామ్‌ను ప్రింట్ తీయించుకోవాలి. అందులో అడిగిన వివరాలను, ఆ ఫామ్‌కు మన ధృవీకరణ పత్రాలను జోడించి వాటిని గ్రామ పంచాయతీ ఆఫీసులో సంబంధిత అధికారికి అందించాలి. వాటిని సదరు అధికారి పరిశీలించిన తర్వాత మనకు పింఛన్ ఖరారు అవుతుంది.

ఆన్‌లైన్‌ పద్దతి

ఈ పద్దతిలో కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయాలి. స్క్రీన్ కుడివైపున ఎగువన ఉన్న లాగిన్ ఆప్షన్ ఎంచుకోండి. క్రెడెన్షియల్లను నమోదు తర్వాత.. మీ యూజర్ నేమ్, పాస్ వర్డ్ ఇవ్వండి. ఆ తర్వాత గెట్ OTP ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆపై మీ రిజిస్టర్డ్ చేసుకున్న మొబైల్ నంబర్కు వచ్చిన OTPని అక్కడ ఎంటర్ చేయండి. అనంతరం మీరు ఫిల్ చేయాల్సిన పేజీ అక్కడ వస్తుంది. ఆ సూచనలు బట్టి ఆ ఫామ్ నింపండి. పెన్షన్ల సంబంధించి మీకు ఇంకా సాయం, సమాచారం కావాలంటే.. 0866 - 2410017 కాల్ చేసి వివరాలు పొందవచ్చు. ఈ పద్దతిలో కూడా మన ధృవీకరణ పత్రాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News