జగన్ కి ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?

వైసీపీ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. పరస్పరం విమర్శలు, ఆరోపణలతో విసిగిపోయిన ప్రజలకు ఈ ప్రకటన కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. అదేమిటంటే..

Update: 2024-05-11 08:27 GMT

వైఎస్సార్ సీపీ మే 11న విడుదల చేసిన ఓ ప్రకటన ప్రస్తుతం వైరల్ గా మారింది. పరస్పరం విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో నిండి ఉండే ప్రసంగాలతో విసిగిపోయిన ప్రజలకు ఈ ప్రకటన కాస్తంత ఉపశమనం కలిగిస్తోంది. అదే సమయంలో ప్రతిపక్షం లేవనెత్తే అనేక సందేహాలకు ఇందులో సమాధానాలు ఉన్నాయి. అందుకున్న కారణాలేమిటో కూడా వివరిస్తుంది. అదే ప్రకటనను మరో కోణంలో చూస్తే ఇవన్నీ అధికార పక్షం చేసిన తప్పులే కదా అని ప్రతిపక్షాలు ఊరట పడే అవకాశమూ ఉంది. తనపై ఆరోపణలకు అధికార పక్షం ఇస్తున్న జవాబా అనిపిస్తోంది. వైఎస్సార్ సీపీని ఎందుకు గెలిపించాలనే దానిలోనే ఎందుకు ఓడించకూడదో వివరించే సమాధానాలూ ఉన్నాయంటున్నారు విశ్లేషకులు.ఇంతకీ వైఎస్సార్ సీపీ ప్రకటనలో ఏముందంటే...

1. చదువుల మాఫియా...
బాబు ఏనాడూ ప్రభుత్వ బడులను బాగు చెయ్యలేదు. చదువు మొత్తం తన అనుయాయులు అయిన నారాయణ, చైతన్య లకు అప్పజెప్పారు. ఇంక ప్రైవేట్ బడులు నడుపుతున్న వాళ్లు అంతా అయనకు శత్రువులే. ఐబీ అంటే ఇంటర్నేషల్ బ్యాకలోరియెట్ అని అర్థం. ఇది ఒక నాన్ ఫ్రాఫిట్ ఫౌండేషన్. పిల్లలపై పరీక్షలు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు 1960ల్లో స్విట్టర్జ్‌లాండ్‌కు చెందిన కొంత మంది టీచర్స్ తయారు చేసిన ప్రత్యేకమైన విద్యావ్యవస్థ ఇది. ఐబీ సిలబస్ లక్షలు పోసి చదువుతున్నారు కార్పొరేట్ బడిలో. మరి అది పేదల పిల్లలకు ఉచితంగా ఇస్తే మండదా వాళ్లకు?
2. ఆరోగ్య మాఫియా..
బాబు తన 14 ఏళ్ల పాలన లో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కట్టలేదు. ఒక్క ప్రభుత్వ వైద్యశాల కట్టలేదు. మరి ప్రైవేట్ ఆసుపత్రులు నడుపుతున్న కొంత మందికి, అలాగే వాటిని నడుపుతున్న కార్పొరేట్ ఆసుపత్రులకు నష్టం కదా. వాళ్లకు ఆయన శత్రువే మరి. ఒకేసారి రాష్ట్ర చరిత్రలో ఎవరు చేయని విధంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు కట్టాడు కదా. ముందుగానే రోగాలు భారిన పడకుండా ప్రేవెంటివ్ కేర్ తీసుకోవడం కోసం ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ అని మొదలు పెడితే మాఫియా వ్యాపారాలు ఏమ్ కావాలి. 16 హెల్త్ హబ్ లు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లు కడితే మా ఆదాయాలు ఏమ్ కావాలి.పేదవాడు అయినా ధనవంతుడు అయినా రోగాలు రావాలి, ఆసుపత్రికి రావాలి మేము దోపిడీ చెయ్యాలి.
మరి పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా ప్రభుత్వంలోనే కల్పిస్తే మండదా వాళ్లకు? (అంటే టీడీపీ వాళ్లకు)
3. వ్యవసాయ మాఫియా..
కల్తీ విత్తనాలు, ఎరువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్న వాళ్ళ పొట్ట కొట్టాడు, రైతు భరోసా కేంద్రాలు పెట్టాడు. అన్ని అక్కడే వాళ్లకు తక్కువ ధరకు ఇస్తున్నాడు. మరి మాకు ఆయన శత్రువు నే కదా.
4. అమరావతి మాఫియా...
పేదల భూములు రైతుల భూములు తక్కువ ధరకే కొట్టేసిన బాబు ఆయన బినామీలకు ఆయన శత్రువే.
మేము ఆ రాజధాని పేరు చెప్పి కోట్లు అక్కడ పెట్టీ లక్షల కోట్లు సంపాదించాలి, అని ప్లాన్ చేస్తే అది జరగకుండా చేశాడు. మరి మాకు కడుపు మండదా.?
5. అగ్రకులాల అసూయ ద్వేషం:
అవును అందరినీ సమానంగా చూస్తున్నాడు జగన్. అదే బాబు గారి పాలన లో అయితే మా కులపోల్ల పెత్తనం నడిచేది. ఈ రోజు పేదవాడు కూడా బాగుపడ్డాడు. మరి మా పనులు చేసేది ఎవరు.
మేము వాళ్ళు ఒక్కటే నా? వాళ్ళ పిల్లలు అంత చక్కగా మంచి డ్రెస్ వేసుకొని స్కూల్ కి పోతున్నారు, వాళ్లకు పథకాల ద్వారా డబ్బు వస్తుంది. మరి ఇలా అయితే మా కంటే వాళ్ళు కూడా అన్నిట్లో బాగుపడతారు కదా.
కాబట్టి మాకు శత్రువే.
6. మీడియా మాఫియా...

బాబు లాగా జగన్ డబ్బులు ఇచ్చి మీడియా పెద్దలను మేపడు కదా. బాబు అంటే మీడియా డార్లింగ్ అని పేరు. కాబట్టి మేము రోజు విషం కక్కుతాం. మాకు నీ వల్ల ఏమీ డబ్బు రాదు కదా. కాబట్టి మాకు శత్రువే.
7. పారిశ్రామిక వేత్తలు...
లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చాడు. అలా దేశం లో ఉన్న పెద్ద పెద్ద కంపనీ లు ఇక్కడికి వస్తె, మా వ్యాపారాలు ఎలా జరగాలి, మా వాళ్ళు ఎలా బాగుపడాలి. కాబట్టీ అస్సలు ఏమ్ జరగలేదు, కంపెనీలు ల
రాలేదు అని చిన్న చితక పారిశ్రామిక వేత్తలు అని చెప్పుకొనే వాళ్ళతో తిట్టించాలి. కాబట్టి వాళ్లకు, జనాలకు శత్రువు నే.
8. బందువులు: సొంత కుటుంబంలో వున్న వ్యక్తులకు శత్రువు నే. ఎందుకు అంటే అధికారం అడ్డుపెట్టుకుని దోపిడీ చెయ్యాలి, సంపాదించాలి అని అంటే ఒప్పుకోడు కదా.
9. ప్రతి పక్షపార్టీలు: ప్రతిపక్షం వాళ్ళను చావు దెబ్బ కొట్టాడు 2019 ఎలక్షన్ లో కొలుకోకుండా. వాళ్ళు జీవితం లో అంత ఓటమి చూడలేదు. కాబట్టి వాళ్లకు శత్రువు నే.
కాబట్టి పేద ప్రజలను, ముసలి వాళ్ళను, చిన్న పిల్లలను, వికలాంగులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కంటికి రెప్పలాగా చిత్తశుద్ధితో, తపన తో కరోనా లాంటి ఎన్ని విపత్తులు వచ్చినా సంక్షేమం-- అభివృద్ధి లను రెండు కళ్ళు లాగా చూసుకుంటూ శ్రమిస్తున్న వైఎస్ జగన్ ను స్వార్థంతో, అన్యాయం గా, దుర్భుద్ధితో విమర్శిస్తూ, విషం కక్కుతున్న ఇంత మంది విద్రోహలనుంచి మన రాష్ట్ర ప్రజలందరూ ఏకతాటిపై నిలబడి గెలిపించుకోవాలి. రాష్ట్రాభివృద్ధికి జగన్ నాటిన విత్తనాల ఫలాలన్నీ మనందరికి అందాలంటే ఖచ్చితంగా ఆయనకు మరొక్క అవకాశం ఇవ్వాలి.
ఇది వైసీపీ వారి వాదన. దీన్ని అదేస్థాయిలో టీడీపీ వాళ్లు కూడా తిప్పికొట్టారు.
టీడీపీ వాళ్లు ఏమన్నారంటే...
జగన్ చేసిన తప్పులేమిటో, కుంభకోణాలేమిటో సూక్ష్మంగా చెప్పారు. ఈ పథకాల పేరిట జరిగిన దోపిడిని బయటపెట్టిందునే విపక్షాలపై ప్రత్యేకించి టీడీపీపై జగన్ పార్టీ తప్పుడు ప్రచారానికి పూనుకున్నారు. సంక్షేమం పేరిట జరిగిన దోపిడీని ప్రశ్నించినందుకే జగన్ కు తమపై కోపం అంటున్నారు టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి. జగన్ పెట్టిన ప్రతి స్కీమూ కుంభకోణమేనన్నది టీడీపీ వాదన. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీయే వైసీపీ పాలన మాఫియాల మయం అన్నారని, వాళ్ల ఆట కట్టిస్తామని మోదీ ఎందుకు అన్నారో తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కుటుంబాలను చీల్చిన ఘనత జగన్ ది కాదా అంటూ కేశినేని నానీ, చిన్నీ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో కులాల కుంపటి పెట్టిందే జగన్ అంటున్నారు. మీడియా మాఫీయా అనే జగన్... అసలు మీడియా మాఫీయాను క్రియేట్ చేసిందే జగన్ అండ్ కో కాదా అని ఎదురుదాడి చేస్తున్నారు. వైసీపీ ప్రకటనలోని ప్రతి అంశం వాళ్లకు వర్తించేవేనని, అందుకే జగన్ ను ఓడించాల్సిన అవసరం ఏర్పడిందన్నది టీడీపీ వాళ్ల వాదన. ఈ వాదనలలో ఏవి సబబో నిర్ణయించుకోవాల్సింది ప్రజలే.
Tags:    

Similar News