హిజ్రాలు దాడి–మహిళ ఆత్మహత్య

కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు.;

Update: 2025-09-13 13:01 GMT

హిజ్రాలు దాడి చేశారని మస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. విజయవాడ నగరంలోని గిరిపురంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చిన హిజ్రాలు యువకుడి ఇంటిపైన దాడికిపాల్పడటంతో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ గిరిపురానికి చెందిన గోపీచంద్‌ అనే యువకుడు అదే గిరిపురం ప్రాంతానికి చెందిన మంజుల అనే యువతిని గత మూడేళ్లు ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో హిజ్రాలు ఈ నెల 11న యువతి తరపున ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 20 మంది హిజ్రాలు కలిసి గిరిపురంలోని గోపీచంద్‌ ఇంటిపై మాకుమ్మడి దాడికి పాల్పడ్డారు. గోపీచంద్‌తో పాటు అతని తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారిని వదల్లేదు. ముగ్గురిపైన హిజ్రాలు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో హిజ్రాల దాడికి యువకుడు గోపీచంద్‌ తల్లి కుమారి మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వాళ్లు కుమారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల నుంచి అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆగ్రహానికి గురైన కుమారి కుటుంబ సభ్యులు, బంధువులు మాచవరం పోలీసు స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన హిజ్రాలను కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను డిమాండ్‌ చేశారు.
Tags:    

Similar News