ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ముప్పు, రేపంతా వర్షమే

ఇప్పటి నుంచి అక్టోబర్ 1వ తేదీ అర్థరాత్రి వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది

Update: 2025-09-30 12:42 GMT
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇప్పటి నుంచి అక్టోబర్ 1వ తేదీ అర్థరాత్రి వరకు భారీ వర్షం పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. దీని ప్రభావంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణం కేంద్రం మంగళవారం ప్రకటించింది. రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వివరించింది.
ఇక ఉత్తర అండమాన్ పరిసర ప్రాంతాలలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. అక్టోబర్ 1వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని స్పష్టం చేసింది. 2వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించి.. అది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. ఇది 3వ తేదీ నాటి దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో అల్లూరి, పార్వతీపురం, కాకినాడ, యానాం, ఉభయ గోదావరి జిల్లాలతోపాటు నెల్లూరు, తిరుపతి జిల్లాలలో రానున్న 24 గంటల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మరో వైపు.. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నివారణ సంస్థ అప్రమత్తమైంది.
Tags:    

Similar News