Alluarjun Video|థియేటర్ దగ్గర పుష్ప వీడియో చూశారా ?(వీడియో)

అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పరిస్ధితి ఎలాగ మారిందనే 9 నిముషాల వీడియో సోషల్ మీడియా(Social media)లో బాగా వైరల్ అవుతోంది

Update: 2024-12-22 08:44 GMT

పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాట గురించి హీరో అల్లు అర్జున్(Allu Arjun) చెప్పిందంతా అబద్ధమేనా ? అవుననే అనిపిస్తోంది ఒక వీడియో చూసిన తర్వాత. థియేటర్ దగ్గర సినిమా మొదలుకావటానికి ముందు పరిస్ధితి ఎలాగుంది, అల్లు అర్జున్ వచ్చిన తర్వాత పరిస్ధితి ఎలాగ మారిందనే 9 నిముషాల వీడియో సోషల్ మీడియా(Social media)లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూస్తే శనివారం రాత్రి మీడియాసమావేశంలో అల్లుఅర్జున్ చెప్పిందంతా అబద్ధమే అని అర్ధమైపోతోంది. మీడియా సమావేశంలో అల్లుఅర్జున్ ఏమిచెప్పారంటే పోలీసుల అనుమతి ఉందికాబట్టే తాను థియేటర్ కు వెళ్ళానని. తాను ర్యాలీగా, రోడ్డుషో గా వెళ్ళానని చెప్పింది అబద్ధమని. థియేటర్లో తొక్కిసలాట జరిగి ఒకమహిళ చనిపోయిన విషయం మరుసటిరోజున మాత్రమే తనకు తెలిసిందని.

తొక్కిసలాట జరిగిందని, మహిళ మరణించిందన్న విషయాన్ని సినిమా చూస్తున్నపుడు తనకు ఎవరూ చెప్పలేదని. పోలీసులు చెప్పినా తాను సినిమా చూసిన తర్వాతే వెళతానని అన్నట్లుగా జరుగుతున్న ప్రచారం తప్పని. తొక్కిసలాట జరుగుతోందని చెప్పగానే తాను థియేటర్లో నుండి వెళ్ళిపోయినట్లు చెప్పాడు. కాని వీడియోలో ఏమో తొక్కిసలాట జరిగిన చాలాసేపటికి అదికూడా పోలీసులు గట్టిగా చెప్పిన తర్వాతే అర్జున్ థియేటర్ నుండి బయటకు వెళ్ళినట్లుగా కనబడుతోంది. టీవీ5లో వచ్చిన వీడియోను ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ దాసరి శ్రీనివాస్ తన ట్విట్టర్(Twitter) ఖాతాలో పోస్టుచేశారు. తాను పోస్టుచేసిన 9 నిముషాల వీడియో ఒకే బిట్టా లేకపోతే విడివిడిగా ఉన్న బిట్లను ఒకటిగా కూర్చి 9 నిమిషాల నిడివితో వీడియో తయారుచేశారో తెలీదు. ఏ విధంగా వీడియోను రూపొందించినా ఇపుడది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


వీడియో ప్రకారమైతే అల్లుఅర్జున్ వచ్చేముందు మామగారు కంచర్ల చంద్రశేఖరరెడ్డి ఒక కారులో ధియేటర్లోకి చేరుకున్నారు. కొద్దిసేపటితర్వాత రెండో కారులో అల్లుఅర్జున్ కొడుకు చేరుకున్నాడు. మూడోకారులో అల్లుఅర్జున్ ముషీరాబాద్ మెయిల్ రోడ్డులో ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మెట్రో స్టేషన్ వైపునుండి సంధ్యా ధియేటర్(Sandhya Theatre) దగ్గరకు రోడ్డుషో, ర్యాలీ చేసినట్లు స్పష్టంగా కనబడుతోంది. తానసలు రోడ్డు షో, ర్యాలీ చేయలేదని అర్జున్ మీడియాతో చెప్పింది తప్పని అర్ధమైంది. అల్లుఅర్జున్ థియేటర్లోకి ప్రవేశించేముందు ప్రశాంతంగా ఉన్న థియేటర్లోపల ఒక్కసారిగా అభిమానుల తాకిడి పెరిగిపోయింది. బన్నీని చూడటానికి అభిమానులు ఎగబడటం సహజమేకదా. ఆ తొక్కిసలాటలోనే థియేటర్లో ఒక పక్కగా ఉన్న రేవతి, ఆమె కొడుకు శ్రీతేజ కిందపడిపోయినట్లున్నారు. తొక్కిసలాట జరిగిన దృశ్యాలు వీడియోలో కనబడ్డాయి కాని రేవతి, శ్రీతేజ ఎక్కడా వీడియోలో కనబడలేదు. అయితే అదే వీడియోలో పోలీసులు తేజను తీసుకొచ్చి సీపీఆర్ ద్వారా ప్రాధమిక చికిత్స చేయిస్తున్న దృశ్యాలు మాత్రం కనపించాయి.



ఇక అల్లుఅర్జున్ థియేటర్లోకి ప్రవేశించి మెట్లెక్కి అప్పర్ బాల్కనీలోకి వెళుతున్న దృశ్యాలు, లోయర్ బాల్కనీలో జనాలు పుష్పను చూడటానికి ఎగబడిన దృశ్యాలున్నాయి. అదే వీడియోలో పుష్ప(Pushpa Movie) అప్పర్ బాల్కనీలోకి వెళ్ళగానే బౌన్సర్లు గేట్లు మూసేయటం, తర్వాత కొంతసేపటికి పుష్ప మళ్ళీ కిందకి వచ్చేసి రోడ్డుమీదకు వచ్చి తన కారులో కూర్చున్న దృశ్యాలన్నీ కనబడ్డాయి. కారులోకి ఎక్కిన తర్వాత అర్జున్ మళ్ళీ కారు టాపు ఓపెన్ చేసుకుని పైకి లేచి అభిమానులకు అభివాదాలు చేస్తు, ఫ్లయింగ్ కిస్సులు ఇస్తున్న దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనబడుతున్నాయి. తొక్కిసలాట జరిగిన విషయాన్ని ఏసీపీ అల్లుఅర్జున్ తో గట్టిగా చెప్పి బయటకు వెళ్ళిపోవాల్సిందే అని చెప్పిన తర్వాత బయటకు వెళ్ళిన పుష్ప కారులో నుండి పైకి లేచినట్లు కనబడుతోంది. మరి అర్జున్ ఏమో తనకు మహిళ చనిపోయిన విషయం తెలియదని చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది.

Tags:    

Similar News