హ్యాపీ ఫాదర్స్‌డే నాన్నా..జగన్ ఎమోషనల్ ట్వీట్
నాన్నా మీరే స్పూర్తి అంటూ ఫాదర్స్‌డే సందర్భంగా జగన్ భావోద్వేగానికి గురయ్యారు.;
By : The Federal
Update: 2025-06-15 07:15 GMT
నాన్నా.. మీరే స్పూర్తి. నాన్నా.. నా ప్రతి అడుగులోనూ మీరే ఇన్‌స్పిరేషన్ అంటూ తన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుంటూ ఫాదర్స్‌డే సందర్భంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఫాదర్స్‌డే సందర్భంగా లేని తండ్రిని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్‌ఆర్‌తో కలిసి దిగిన ఫొటోను కూడా షేర్ చేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో ఇప్పడు చక్కర్లు కొడుతోంది.
జగన్ ఏమన్నారంటే..
‘నాన్నా.. మీరు ఎప్పుడూ నాకు స్పూర్తి.. మీరే నా రోల్ మోడల్. నా ప్రతి అడుగులోనూ మీరే నాకు స్పూర్తి. చారిత్రాత్మకమైన మీ పాదయాత్ర ముగింపు రోజును ఈ రోజు మరో సారి గుర్తు చేసుకుంటున్నాను. హ్యాపీ ఫాదర్స్‌డే నాన్న’ అని తన తండ్రి వైఎస్‌ఆర్‌ను తలచుకుంటూ జగన్ భావోద్వేగానికి గురయ్యారు. ఫాదర్స్ డే సందర్భంగా ఆదివారం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తన తండ్రి వైఎస్‌ఆర్‌తో దిగిన ఫొటోను ట్వీట్‌కు జత చేశారు.