అసెంబ్లీకి వెళ్లి నా తప్పు లేదని చెప్పండి జగనన్నా!

మద్యం కుంభకోణంపై ఆగ్రహం – విచారణకు సవాల్;

Update: 2025-05-22 12:21 GMT
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం కుంభకోణంపై రాజకీయ వివాదం ముదిరిన నేపథ్యంలో, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన సోదరుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మీ తప్పులేదు అంటున్నారుగా… అయితే అసెంబ్లీకి వెళ్లి తేల్చుకోండి జగన్ అన్నా!’’ అంటూ సలహా ఇచ్చారు.

ప్రతిపక్ష హోదా ఇచ్చేంత వరకు అసెంబ్లీకి వెళ్లనని వైఎస్ జగన్ భీష్మించిన నేపథ్యంలో ఆమె ఈ మాట చెప్పారు.
‘‘లిక్కర్ మాఫియా’’పై విచారణకు డిమాండ్
‘‘లిక్కర్ స్కాంలో అవినీతి లేదని నిజంగానే నమ్ముతున్నారా? అయితే అసెంబ్లీ సాక్షిగా విచారణ వేయమని డిమాండ్ చేయండి. దమ్ముంటే ACB లేదా CBIతో విచారణ కోరండి’’ అంటూ షర్మిల సవాల్ విసిరారు. డిజిటల్ పేమెంట్లు లేకుండా నగదు చెల్లింపులు జరగడం వల్లే అవినీతి జరిగిందని ఆరోపించారు.
‘లిక్కర్ థ్రిల్లర్ సిరీస్’తో వైసీపీకి భయం పట్టుకుంది!
వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం మాఫియాపై రోజూ ఒక థ్రిల్లర్ సిరీస్‌లా కథనాలు వస్తున్నాయని షర్మిల ఎద్దేవా చేశారు. ‘ఇది లిక్కర్ మాఫియా థ్రిల్లర్. రోజుకో ట్విస్ట్, రోజుకో పాత్ర బయటకు వస్తోంది. దీంతో అసలేం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది’ అని వ్యాఖ్యానించారు.
పోలీసుల బట్టలు ఊడదీస్తావా? అదేనా పాలన?
జగన్ గతంలో "పోలీసుల బట్టలూ ఊడదీస్తాం" అని చేసిన వ్యాఖ్యలపై కూడా షర్మిల మండిపడ్డారు. ‘‘ఒక ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడో చూడండి! పోలీసులను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు. రఘురామ కృష్ణ రాజు , నటి జెత్వానీ వంటి వారిని వేధించిన తీరు ఇప్పటికీ ప్రజలకు గుర్తుంది’’ అని పేర్కొన్నారు.
మీ తప్పు లేనప్పుడు విచారణ ఎందుకు భయం?
‘తప్పులేదు అంటున్నారు… కానీ విచారణకు ముందుకు మీరు రావడం లేదంటే సందేహాలే మిగులుతున్నాయి. వైఎస్‌ హయాంలో ఆయనే చెప్పేవారు – తప్పు చేస్తే విచారణకు సిద్ధంగా ఉండాలి. కానీ జగన్ మాత్రం విచారణను తేలిగ్గా తీసుకుంటున్నారు. ఎందుకు?’’ అని షర్మిల ప్రశ్నించారు.
డిజిటల్ పేమెంట్లు లేకపోవడమే అవినీతికి మూలం!
‘‘మీ హయాంలో మద్యం కొనుగోలుకు డిజిటల్‌ పేమెంట్లు లేవు. ఎందుకు లేవు? ప్రజాధనం ఖర్చవుతున్న వ్యవహారంలో పారదర్శకత అవసరం లేదు అంటే ఎలా?’’ అని షర్మిల నిలదీశారు. గత ప్రభుత్వం నగదు చెల్లింపుల ద్వారా భారీ అవినీతి జరిపిందని ఆమె ఆరోపించారు.
Tags:    

Similar News