ఏపీలో 4 న్యూస్‌ చానల్స్‌ బ్లాక్‌ చేసిన ఆపరేటర్లు

ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు న్యూస్‌ ఛానల్స్‌ ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్స్‌ బ్లాక్‌ చేశారు. దీంతో ఆ నాలుగు ఛానళ్ల ప్రసారాలు ఆగిపోయాయి.

Update: 2024-06-14 11:33 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో సాక్షి టీవీ, టీవీ9, ఎన్‌టీవీ, 10టీవీ ప్రసారాలు పూర్తిగా నిలిపి వేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పార్టీలకు అనుకూలంగా ఉన్న టీవీ చానల్స్‌ ఆపివేయడం పరిపాటిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో ఉన్న కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ వారు ఈ చర్యలకు పాల్పడుతున్నారు. ఎందుకు ఆపారని ప్రశ్నిస్తే మా ఇష్టం ఆపేశాము, మీకు ఇష్టం లేకుంటే కేబుల్‌ కనెక్షన్‌ ఆపేయండి అంటూ సమాధానం చెబుతున్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ ఫోన్‌ నెంబరు పనిచేయకుండా చేస్తున్నారు. కేబుల్‌ టీవీలో పనిచేసే ఉద్యోగులను ప్రశ్నిస్తే మాకు ఏమీ తెలియదని, ఆపరేటర్‌ చెప్పినట్లు చేస్తామని సమాధానం ఇస్తున్నారు.

ఏపీలో ఏపీ కేబుల్‌ టీవీ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ బ్లాక్‌ చేసిన న్యూస్‌ ఛానల్స్‌ విషయంలో జోక్యం చేసుకోవాలని ట్రాయ్‌ చైర్మన్‌కు వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్‌ నిరంజన్‌రెడ్డి లేఖ రాశారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఆదేశాల మేరకు కేబుల్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌ అక్రమంగా ఈ నిర్ణయం తీసుకుందని లేఖలో ఫిర్యాదు చేశారు. ఏపీలో టీవీ9, ఎన్టీవీ, 10 టీవీ, సాక్షి టీవీలను పూర్తిగా నిలిపివేశారని లేఖలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గతంలో సుప్రీంకోర్టు ఓ కేసులో ఇచ్చిన తీర్పును నిరంజన్‌రెడ్డి ప్రస్తావించారు. ‘ఏ ఛానెల్‌ను అయినా, ప్రసారాలనైనా వీక్షించే సంపూర్ణ హక్కు ప్రతి పౌరుడికి ఉంది. ప్రముఖ మీడియా సంస్థల నుంచి వచ్చే ప్రసారాలను తమకు నచ్చిన విధంగా ప్రజలు ఎంపిక చేసుకొని చూడవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలు వీటిపై ఆంక్షలు విధించవచ్చు. కానీ, పూర్తిగా ఛానళ్లు రాకుండా నిలిపివేయడం నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది’. అన్నారు.
‘కేబుల్‌ ఆపరేటర్లు ఏపీలో నిలిపివేసిన న్యూస్‌ ఛానెళ్ల విషయంలో కేబుల్‌ ఆపరేటర్ల అసోసియేషన్‌పై సమగ్రమైన విచారణ జరపాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోండి. ప్రభుత్వాల జోక్యం మీడియాపై ఉండకుండా ఆయా సంస్థలు స్వేచ్ఛగా తమ ప్రసారాలు చేసుకొనేలా వీలు కల్పించండి’ అని నిరంజన్‌ రెడ్డి ట్రాయ్‌ చైర్మన్‌కు కోరారు.
2024 జూన్‌ 11న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంట్‌ సభ్యుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా చైర్‌పర్సన్‌కు రాసిన లేఖ నిషేధంపై ఆందోళన వ్యక్తం చేసింది. కమిటీ టు ప్రొటెక్ట్స్‌ జర్నలిస్ట్స్, (సీపీజె)చే సమీక్షించిన తన లేఖలో.. ఇటువంటి చర్య టెలికమ్యూనికేషన్‌ (బ్రాడ్‌ కాస్టింగ్, కేబుల్‌) సర్వీసెస్‌ ఇంటర్‌ కనెక్షన్‌ (అడ్రస్‌ చేయగల సిస్టమ్స్‌) నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తుందో హైలైట్‌ చేసింది. ఇది సర్వీస్‌ ప్రొవైడర్ల మధ్య న్యాయమైన, వివక్షత లేని ఇంటర్‌ కనెక్షన్‌ ఏర్పాట్లను నిర్ధారిస్తుంది. నిరంజన్‌రెడ్డి ఈ లేఖలో పత్రికా స్వేచ్ఛ, ప్రజల సమాచార హక్కుపై కూడా ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కేబుల్‌ ఆపరేటర్లు సాక్షి టీవీ, టీవీ9, ఎన్‌టీవీ, 10టీవీల ప్రసారాలను పునరుద్ధరించాలి. అన్ని ప్రసారాలను సెన్సార్‌షిప్‌ లేకుండా ప్రసారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ఇండియా జర్నలిస్టుల రక్షణ కమిటీ గురువారం కోరింది.
ఆంధ్రప్రదేశ్‌లోని పలు పత్రికలు, వార్త సంస్థలు ప్రచురించిన వార్తల ప్రకారం వైఎస్సార్‌సీపీని ఓడించిన తెలుగుదేశం పార్టీ (టిడిపి)పై విమర్శనాత్మక రిపోర్టింగ్‌ చేసినందుకు నాలుగు టీవీ న్యూస్‌ ఛానల్స్‌ ప్రసారాలను కేబుల్‌ ఆపరేటర్లు జూన్‌ 6 నుంచి బ్లాక్‌ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం స్వేచ్ఛా, స్వతంత్ర పత్రికా సూత్రాలను సమర్థించడం చాలా అవసరం. బ్రాడ్‌ కాస్టర్‌లందరూ ఎంతటి విమర్శనాత్మకమైనప్పటికీ, జోక్యం లేదా సెన్సార్‌షిప్‌ లేకుండా పనిచేయగలరని ఆసిస్తున్నట్లు కమిటీ టు ప్రొటెక్ట్‌ జర్నలిస్ట్స్‌ (సీపీజె) భారతదేశ ప్రతినిధి కునాల్‌ మజుందార్‌ పేర్కొన్నారు. ‘విభిన్న సమాచార వనరులను పొందే ప్రజల హక్కు ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి ప్రాథమికమైనదని, మీడియా నోరు మూయంచడానికి చేసే ప్రయత్నాలను సరిదిద్దేందుకు ప్రయత్నించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
జూన్‌ 12న రాష్ట్ర ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అధికార కూటమిలో టీడీపీ భాగస్వామి.
Tags:    

Similar News