పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రికి పవన్‌ శంకుస్థాపన

తొమ్మిది నెలల కాలంలో పిఠాపురంలో 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.;

Update: 2025-04-25 11:56 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ పిఠాపురంలో 100 పడకల ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పిఠాపురంలో 30 పడకల కమ్యూనిటీ ఆసుపత్రి ఉంది. ఎన్నికల సమయంలో దీనిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేస్తామని ఇచ్చిన హామీ మేరకు దీనిని 100 పడకల ఆసుపత్రిగా డెవలప్‌ చేసేందుకు శంకుస్థాపన చేశారు. రూ. 34 కోట్ల అంచనా వ్యయంతో దీనిని నిర్మించనున్నారు.

కొత్తగా నిర్మించే ఈ ఆసుపత్రిలో రెండు కొత్త బ్లాకులు, ఓపీ వార్డు, మార్చురీ వారు, డయాలసిస్‌ సెంటర్, బ్లడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుతో పాటు వైద్య పరీక్షల కోసం అధునాతన మెషీన్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆసుపత్రి నిర్మాణం కంప్లీటయ్యి అందుబాటులోకి వస్తే.. పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని 3లోల మంది ప్రజలతో పాటు ఆరు చుట్టు పక్కల మండలాల ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించే సౌకర్యం ఉంటుంది.

ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన 9 నెలల కాలంలోనే పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గంలో రూ. 100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. అంతేకాకుండా పిఠాపురం అసెంబ్లీ నియోజక వర్గం యుకొత్తపల్లిలో టీటీడీ కళ్యాణ మండపానికి, చేబ్రోలులో శ్రీ సీతారామ స్వామి ఆలయ రథశాల, మండపంకు పవన్‌ కల్యాణ్‌ శంకుస్థాపనలు చేశారు.
Tags:    

Similar News