తిరుమల శ్రీవారి సేవకు... అదనపు ఈఓగా కేంద్రం అధికారే

తిరుమల అదనపు ఈఓగా కేంద్ర సర్వీసుల్లోని అధికారికి ప్రాధాన్యం ఇచ్చింది. ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరిని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలో బాధ్యతలు స్వీకరించనున్న నాన్ ఐఏఎస్ అధికారుల్లో వెంకయ్య రెండో అధికారి.

Update: 2024-07-25 14:24 GMT

టీటీడీ తిరుమల అదనపు ఈఓగా ఐఆర్ఎస్ 2005- బ్యాచ్ అధికారి సీహెచ్. వెంకయ్యచౌదరిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (24న) ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడలో కమిషనర్ గా ఉన్న ఆయనను మూడేళ్ల కాలపరిమితితో డిప్యూటేషన్ పై తీసుకు వచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి ఆయన విధుల్లో ఉండే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్లువుల్లో పేర్కొన్నది. తిరుమలలోశనివారం ఆయన బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు టీటీడీ అధికారుల ద్వారా తెలిసింది. గతంలో ఆయన ఏపీ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్, ఎండీగా కూడా పనిచేశారు.

వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తరహాలోనే టీడీపీ కూటమి కూడా తిరుమలలో ఐఏఎస్ కు సమానమైన ఐఆర్ఎస్ అధికారిని అదనపు ఈఓగా నియమించింది. ఇందుకు మాజీ అదనపు ఈఓ ఏవీ. ధర్మారెడ్డి అర్హతపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పు ను కూటమి ప్రభుత్వం కూడా ఉపయోగించుకున్నట్లు కనిపిస్తోంది.

గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం అస్మదీయుడైన ఢిల్లీ అధికారిని నియమించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. తిరుమల జేఈఓగా కేంద్ర రక్షణ శాఖకు చెందిన ఏవీ. ధర్మారెడ్డిని కూడా డిప్యూటేషన్ పై తీసుకుని వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా .. మూడేళ్ల పాటు వెంకయ్య చౌదరి సేవలను డిప్యూటేషన్ పై వినియోగించుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది. కాగా,
ప్రమాణస్వీకారం అనంతరం సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు మొదట తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారిని దర్శంచుకున్నారు.
"తిరుమల పవిత్రత కాపాడుతా. పాలనలో ప్రక్షాళన ఇక్కడి నుంచే ప్రారంభిస్తా" అని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఆ తరువాత టీటీడీ జేఈఓగా సీనియర్ ఐఏఎస్ అధికారి జే. శ్యామలరావును నియమించారు. ఆయన టీటీడీలో ప్రధానంగా తిరుమలలో ప్రక్షాళన దిశగా సమీక్షలతో నిత్యం బిజీగా ఉంటున్నారు.

"సామన్య యాత్రకులకు ఇబ్బంది లేకుండా చేస్తానంటూ" ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ఇదిలావుండగా, తిరుమల అదనపు ఈఓ" గా తన సామాజికవర్గానికి చెందిన అధికారి వెంకయ్య నాయుడుని నియమించడానికే" సీఎం ఎన్. చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది.

గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వ కాలంలో తిరుమలలో రక్షణ శాఖలో పనిచేస్తున్న కర్నూలు జిల్లాకు చెందిన ఏవీ. ధర్మారెడ్డిని ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆ తరువాత అదనపు ఈఓగా పనిచేసిన కాలంలో శ్రీవాణి ట్రస్ట్, సివిల్ పనులకు భారీగా నిధుల కేటాయించడానికి చేసిన తీర్మానాలకు ఏకపక్షంగా తలఊపడం, సేవా టికెట్ల మంజూరులో పక్షపాతం చూపించడం, మంత్రులు, వైఎస్ఆర్ సీపీ నేతలకు మాత్రమే మంజూరు చేయడం వంటి అంశాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారంలో లేనప్పుడు టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు ఆరోపించారు. ఆ పార్టీ నేతలే కాకుండా, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు కూడా అనేక ఆరోపణలు చేశారు. ఆ వ్యవహారం ఇంకా తిరుమలలో రేకెత్తిన మంటలు ఇంకా ఆరలేదు. రాష్ర్టంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని రాష్ర్ట ప్రభుత్వం ఆదేశాలతో విజిలెన్స్ విచారణ సాగుతోంది.
అనుకూలించిన తీర్పు
ఇదిలాండగా, ఐఏఎస్ హోదా లేని అధికారులను నియమించే ప్రక్రియకు మాజీ అదనపు ఈఓ ఏవీ. ధర్మారెడ్డి వల్ల మార్గం సుగుమం అయినట్లు కనిపిస్తోంది. "ఏవీ. ధర్మారెడ్డి నియామకాన్నితిరుపతికి చెందిన నవీన్ కుమార్ రెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. 1991 బ్యాచ్ సివిల్ సర్వీసెస్ ఐడీఈఎస్ అధికారి అయిన ధర్మారెడ్డి కేంద్ర ప్రభుత్వ హోం శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. ఇది ఏపీలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాతో సమానమని కోర్టుకు వివరించారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ చట్టం 107 ప్రకారం ఏపీలో జిల్లా కలెక్టర్ లేదా ఆ హోదాకు సమానమైన వారు అర్హులనే వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం పిటీషన్ కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. దీంతో ధర్మారెడ్డి నియామకానికి క్లీన్ చిట్ లభించింది. శనివారం బాధ్యతలు స్వీకరించనున్న వెంకయ్య చౌదరి తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యం, ప్రక్షాళన దిశగా అడుగులు వేయడానికి ఎలా వ్యవహరిస్తారనేది వేచిచూడాలి.
Tags:    

Similar News