శ్రీశైలం డ్యామ్‌కు ప్రస్తుతం వరద నీటి ప్రవాహం తగ్గింది. ఎగువ ప్రాంతపు వరద నీటి ప్రవాహం అధికంగా ఉండటం వల్ల గత కొద్ది రోజులుగా శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున ఫ్లడ్ వాటర్ వచ్చి చేరింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల్లో వరద ప్రభావం తగ్గడం వల్ల శ్రీశైలం డ్యామ్‌కు వరద నీటి ప్రవాహం తగ్గింది. గత రెండు రోజులతో పోల్చితే బుధవారం మరింతగా తగ్గింది. తెలంగాణ ప్రాంతంలోని జూరాల, సుంకేసుల ప్రాజెక్టు నుంచి 64,562 క్యూసెక్కుల నీరు శ్రీశైలంలోకి వచ్చి చేరుతోంది. దీని వల్ల ప్రస్తుతం శ్రీశైలం ఓట్ ఫ్లో 1,01,131 క్యూసెక్కులుగా ఉంది.
ఇక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేరటరీ నుంచి మరో 35వేల క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం నుంచి మరో 5,315 క్యూసెక్కులు, కుడిగట్టు విద్యుత్ కేంద్రం నుంచి 30,816 క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే ప్రస్తుతం అది 881 అడుగులకు చేరింది. దీంతో పాటుగా శ్రీశైలం జలాశయం పూర్థియి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 193.40 టీఎంసీలుగా నీటి నిల్వ సామర్థ్యం కొనసాగుతోంది.