ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి.;

Update: 2025-04-13 05:14 GMT

ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీ సత్యసాయి జిల్లా పరిగి మండలం ధనపురం క్రాస్‌ వద్ద ఆదివారం ఈ దుర్ఘటన జరిగింది. కొంత మంది వ్యక్తులు ప్రయాణిస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడగా, మరో ఆరుగురు వ్యక్తుల క్షతగాత్రులయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురు వ్యక్తులను హిందూపురం ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన ముగ్గురు మహిళలను గుర్తించారు. మృతులను అలివేలమ్మ(45), ఆదిలక్ష్మమ్మ(65), శాకమ్మ(60)లుగా పోలీసులు గుర్తించారు.

ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గురైన ఆటోలో 14 మంది వ్యక్తులు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితులంతా ఒకే గ్రామానికి చెందిన వారు. శ్రీ సత్యసాయి జిల్లా రొడ్డం మండలం, దొడగట్ట గ్రామానికి చెందిన వారు. హిందూపూరం రూరల్‌ మండలం కోటిపి చౌడేశ్వరి జాతరకు వెళ్లి వస్తుండగా హిందూపురం హైవే మీద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృత్యువాత పడటంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.
Tags:    

Similar News