ఆచూకీ చెబితే బహుమతి.. స్వామీజీలపైనా బీజేపీ నేత ఫైర్

టీటీడీ ఇద్దరు మాజీ అధికారులు నోరు విప్పితే వాస్తవాలు తెలుస్తాయి. ఆగమ పండితులు, పీఠ, మఠాధిపతులు, ఆలయ జీయర్ స్వామీజీలపై బీజేపీ నేత నవీన్ ఎలా ఫైర్ అయ్యారంటే..

Update: 2024-09-28 14:37 GMT

తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీడియా, సోషల్ మీడియాలో హోరెత్తుతోంది. టీటీడీ ఈఓలుగా పనిచేసిన వారు స్పందిస్తున్నారు. గత పాలకమండలి చైర్మన్లు, వారిని సీఎం కూడా వివరణ ఇస్తున్నారు.

"పదవీ విరమణ చేసిన టీటీడీ మాజీ అధికారులు జవహర్ రెడ్డి, ధర్మారెడ్డి మాత్రం ఎక్కడ దాక్కున్నారు" అని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. "వారు కనపడకపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వారిద్దరినీ విచారిస్తే నిజాలు వెలుగులోకి వస్తాయి. సమస్యకు పరిష్కారం లభిస్తుంది" అని నవీన కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.


టీటీడీలో ఐదేళ్లు సకల శాఖల అధికారిగా పెత్తనం చెలాయించిన ఏవీ. అధర్మారెడ్డి ఎన్డీఏ కూటమి ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆచూకీ తెలిపిన వారికి రూ. 1116 బహుమానం ఇస్తామని నవీన్ ప్రకటించారు.

ధర్మారెడ్డి ఇంటిలో గతంలో దురదృష్టవశాత్తు ఓ దుర్ఘటన జరిగితే "అంటు" తీరకముందే 11 రోజులకే ఆలయంలోకి ప్రవేశించేందుకు అనుమతులు ఇచ్చిన పెద్దజీయర్, చిన్న జీయర్, ప్రధానార్చకులు ఇప్పుడు పార్టీ ఫిరాయించి లడ్డూ అపవిత్రంపై హోమాలు చేయడం భగవంతుడు, భక్తులను మోసం చేయడం కాదా మీకు మీరు ఆత్మవంచన చేసుకోవడం కాదా అని నవీన్ ప్రశ్నించారు!
"తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి నాడు మాత్రమే ఆలయంలోని వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. భక్తులుగా గత పాలకులను మేము ప్రశ్నించాం. ఆనాడు ప్రధానార్చకులతో సహా ఆగమ సలహా మండలి మఠాధిపతులు, పీఠాధిపతులు ఆచారాలను తుంగలో తొక్కారు" నాటి అధికార పార్టీ నాయకులకు వంతపాడుతూ పది రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచినప్పుడు ఆగమశాస్త్రం ఆచారాలు ఏమైందని నవీన్ ప్రశ్నించారు!

"తిరుమలలో అపచారాలకు మూలకారకులు కొంతమంది ఆలయ అర్చకులు, ఆగమశాస్త్ర పండితులే. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ" హిందూ సనాతన ధర్మాన్ని తాకట్టుపెట్టడం మహా ఆపచారమని నవీన్ వ్యాఖ్యానించారు. ఇకనైనా ఆలయ సాంప్రదాయాలను గౌరవించాలని ప్రధాన అర్చకులను, జీయర్లను కోరారు.

తిరుమల లడ్డు అపవిత్రంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు వేగవంతం చేసి లడ్డు పై ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి కలుగుతున్న అనుమానాలకు,చర్చలకు పుల్ స్టాప్ పెట్టాలని ఆయన కోరారు.
Tags:    

Similar News