ఏపీలోని ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆదివారం పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.;

By :  Admin
Update: 2025-03-16 13:56 GMT

మార్చి 17 సోమవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు మండలాల్లో వడగాల్పులు వీచనున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో 8 మండలాలు, విజయనగరం జిల్లాలో 15 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 12 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. అలాగే సోమవారం 167 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 16 మండలాలు, విజయనగరం జిల్లాలో 10, పార్వతీపురం మన్యం జిల్లాలో 3, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 9, విశాఖపట్నం జిల్లాలో 2, అనకాపల్లిలో 16, కాకినాడలో 15, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరిలో 3, ఏలూరులో 13, కృష్ణాలో 10, ఎన్టీఆర్‌ జిల్లాలో 8, గుంటూరు జిల్లాలో 14, బాపట్ల జిల్లాలో 1, పల్నాడు జిల్లాలో19 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపనున్నట్లు తెలిపారు. 

మంగళవారం కూడా ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఈ వడగాల్పులు వీచనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 89 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో భానుడు భగ్గు మంటున్నాడు. ఆదివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1డిగ్రీలు, నంద్యాల జిల్లా రుద్రవరం, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.8డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, కర్నూలు జిల్లా లద్దగిరిలో 41.4డిగ్రీలు, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట, అప్పయ్యపేటలో 41డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు. అలాగే 14 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 56 మండలాల్లో వడగాల్పులు వీచాయన్నారు.
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్‌ వంటి దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి కూర్మనాథ్‌ సూచించారు.
Tags:    

Similar News