యూరియాను అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుంది
యూరియా వాడని రైతులకు బస్తాకు రూ. 800 ప్రొత్సాహకం ఇస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.;
యూరియాను ఎక్కువుగా వాడటం వల్ల క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ప్రారంభమైన కలెక్టర్స్ కాన్ఫరెన్స్‌లో యూరియా సరఫరాపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యూరియా వాడకటంపై రైతులలో చైతన్యం తీసుకొని రావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం క్యాన్సర్ అనేది రోగాల జాబితాలో టాప్–5లో ఉందని, యూరియా వాడకటం ఇలానే కొనసాగితే క్యాన్సర్‌లో ఏపీ నంబర్ వన్ స్థానానికి చేరుకుటుందన్నారు. ఈ ప్రమాదాన్ని గుర్తంచి వచ్చే ఏడాది నుంచి అవసరమైన మేరకే యూరియాను వినియోగించే విధంగా రైతుల్లో అవగాహన కల్పించాలన్నారు. యూరియా ఎక్కువుగా వాడితే పంట దిగుబడి పెరుగుతుందని అనుకోవడం మంచిది కాదని, యూరియాకి బదులుగా మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్స్ కింద ఇవ్వాలన్నారు. ఈ విధానంపై పంజాబ్‌ను కేస్ స్టడీగా చూడాలని సూచించారు.