ఏపీలో ప్రతి మంగళవారం 'పరిశ్రమ దినోత్సవం'
పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్. రూ.10.06 లక్షల కోట్లు, ఐదు డిఫెన్స్ క్లస్టర్లు.. ఆర్థిక వృద్ధి రంగంలో కొత్త ఊపు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టుబడిదారుల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ప్రతి మంగళవారం 'పరిశ్రమ దినోత్సవం'గా పాటించాలని నిర్ణయించింది. ఇది సోమవారం జరిగే ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమాన్ని అనుసరించి, పారిశ్రామిక రంగానికి ప్రత్యేక దృష్టి పెట్టిన చొరవ. జూన్ 2024లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రం రూ.10.06 లక్షల కోట్ల విలువైన 122 ప్రాజెక్టులను ఆమోదించి, లక్ష ఎకరాలకు పైగా భూమిని కేటాయించింది. ఐదు ప్రధాన రక్షణ క్లస్టర్ల ప్రకటనతో పాటు ఈ కార్యక్రమం పారిశ్రామిక వృద్ధి, ఉద్యోగ సృష్టిని ఊపందుకునేలా చేస్తుందా? లేదా ఇది కేవలం ప్రతిష్టాత్మక ప్రకటనలా మిగిలి పోతుందా?
పరిష్కారాలకు 'వీక్లీ ఫిక్స్'
పరిశ్రమల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ ప్రకారం ఈ చొరవ పెట్టుబడిదారులు ఎదుర్కొంటున్న క్షేత్ర స్థాయి సమస్యలకు (భూసేకరణ, అనుమతులు, డిలేలు) త్వరిత పరిష్కారం అందిస్తుంది. "పరిశ్రమల రంగం రాష్ట్ర GSDPలో 44 శాతం వాటాతో ఉంది. భూమి కేటాయింపు అత్యంత కీలకమైన అంశం," అని ఆయన నొక్కి చెప్పారు. ప్రతి మంగళవారం జిల్లా స్థాయిలో ఈ దినోత్సవం జరిగి పెట్టుబడిదారులు నేరుగా అధికారులతో కలిసి సమస్యలు చర్చించవచ్చు. ఇది డిజిటల్ గవర్నెన్స్ మోడల్‌తో (వాట్సాప్ గవర్నెన్స్ లాగా) లింక్ అయి, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్'ను మరింత మెరుగు పరుస్తుంది.
'వీక్లీ ఫిక్స్' పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకెళ్తుంది. గతంలో (YSR పొలిటికల్ టెన్యూర్‌లో) పెట్టుబడులు 30-40 శాతం మాత్రమే గ్రౌండ్‌లో అమలయ్యాయి. ఎందుకంటే భూమి సమస్యలు, అనుమతి ఆలస్యాలు ఎక్కువ. ఇప్పుడు, ఈ దినోత్సవం డిలేలను 50 శాతం తగ్గించి, ప్రాజెక్టులు త్వరగా గ్రౌండ్‌కు చేర్చుతుంది. ఫలితంగా, GSDPలో పారిశ్రామిక వాటా 44 వాతం నుంచి 50 శాతంకు పెరిగి, 5-10 లక్షల ఉద్యోగాలు సృష్టించగలదు. అయితే జిల్లా కలెక్టర్లు వ్యక్తిగతంగా కలవడం, నోడల్ అధికారుల నియామకం, ఇవి కేవలం పేపర్‌పై మాత్రమే మిగిలిపోకూడదు.
రూ.10.06 లక్షల కోట్లు, లక్ష ఎకరాల భూమి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే 122 ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చి, రూ.10.06 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది. ఇందులో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-30) ప్రధానం. ఇది 1 లక్ష కోట్ల పెట్టుబడులు, 25,000 కోట్ల స్పేస్ ఇన్వెస్ట్‌మెంట్‌లు లక్ష్యంగా పెట్టుకుంది. ఐదు డిఫెన్స్ క్లస్టర్లు ఏర్పాటుతో, రాష్ట్రం గ్లోబల్ హబ్‌గా మారనుంది.
క్లస్టర్ | స్థలం | విస్తీర్ణం | ఫోకస్ |
నావల్ క్లస్టర్ | విశాఖ-శ్రీకాకుళం మధ్య | 3,000+ ఎకరాలు | షిప్ బిల్డింగ్, మెరైన్ ఇక్విప్‌మెంట్ |
మిస్సైల్ & అమ్యునిషన్ | జగ్గయ్యపేట (ఎన్‌టీఆర్ జిల్లా) | 3,000+ ఎకరాలు | క్షిపణులు, మందుగుండాలు |
అన్‌మాన్నెడ్ సిస్టమ్స్ | ఓర్వకల్ (కర్నూలు) | 3,000+ ఎకరాలు | డ్రోన్స్, రోబోటిక్స్ |
ఏరోస్పేస్ & ఎలక్ట్రానిక్స్ | మడకశిర-లేపాక్షి (అనంతపురం) | 4,000-5,000 ఎకరాలు | సాటిలైట్ కాంపోనెంట్స్, ఎలక్ట్రానిక్స్ |
ఏరోప్లేన్ పార్ట్స్ | దొనకొండ (ప్రకాశం) | 4,000+ ఎకరాలు | విమాన భాగాల తయారీ |
ఈ క్లస్టర్లు 5,000 డైరెక్ట్, 30,000 ఇన్‌డైరెక్ట్ ఉద్యోగాలు సృష్టిస్తాయని ప్రభుత్వం చెబుతోంది. డిఫెన్స్ సెక్టార్‌లో భారత్ 1 లక్ష కోట్ల ఎగుమతులు లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు, ఏపీ ఈ క్లస్టర్లతో 10-15 శాతం మార్కెట్ షేర్ సాధించగలదు. భూసరళీకరణ, 100 శాతం స్టాంప్ డ్యూటీ ఎగ్జెంప్షన్ వంటి సాప్స్ పెట్టుబడిదారులను ఆకర్షిస్తాయి. కానీ రోడ్, పవర్ ఇన్‌ఫ్రా లోపాలు ఆటంకాలుగా ఉంటాయి.
కలెక్టర్లు 'పర్సనల్ టచ్', డిలేలకు 'నోడల్' వాచ్
డాక్టర్ యువరాజ్ జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పెట్టుబడిదారుడిని వ్యక్తిగతంగా కలవడం, భూసేకరణ విధానాలు సరళీకరణ, ప్రాజెక్టులకు కఠిన టైమ్ లైన్‌లు, ఆర్థిక కేంద్రాలకు నోడల్ అధికారుల నియామకం. MSMEలకు ప్రత్యేక సపోర్ట్‌తో, డిస్ట్రిక్ట్ లెవల్ గ్రోత్‌ను బూస్ట్ చేయాలని ఆదేశించారు. కేంద్రం ఆమోదించిన 50 ప్లస్ ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయాలని కూడా పేర్కొన్నారు.
ఈ చర్యలు 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' ర్యాంకింగ్‌లో ఏపీని టాప్ 5కి చేర్చగలవు. గతంలో డిలేలు 6-12 నెలలు ఉండేవి, ఇప్పుడు నోడల్ సిస్టమ్‌తో 2-3 నెలలకు తగ్గుతాయి. ప్రైవేట్ పెట్టుబడిదారులకు ప్రభుత్వం చెబుతున్నది స్పష్టం. "మా రాష్ట్రం సమస్యలు కాదు సొల్యూషన్స్, భూమి, అనుమతులు, ఇన్ఫ్రా, అన్నీ రెడీ. మీరు పెట్టుబడి పెట్టండి. మేము సపోర్ట్ చేస్తాం." ఇది FDIలను (విశాఖ SEZలు, అమరావతి క్యాపిటల్ ప్రాజెక్టులు) ఊపందుకుంటుంది.
పారిశ్రామిక రంగానికి 'ఫాస్ట్-ట్రాక్'
'పరిశ్రమ దినోత్సవం'తో ఏపీ పారిశ్రామిక రంగం ముందుకు అడుగులు వేస్తుంది. ముఖ్యంగా డిఫెన్స్ క్లస్టర్లు ద్వారా ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు ఇస్తాయి. 10.06 లక్షల కోట్ల పెట్టుబడులు GSDPను 15-20 శాతం పెంచి, రాష్ట్రాన్ని 'మాన్యుఫాక్చరింగ్ హబ్'గా మార్చగలవు. అయితే విజయం అమలు, మానిటరింగ్‌పై ఆధారపడి ఉంటుంది. లేకపోతే ఇది మరో 'పేపర్ ప్లాన్'గా మిగిలిపోతుంది.