రెస్టారెంట్‌ లేకపోయినా బార్లు పెట్టుకోవచ్చు..అయితే

2025 సెప్టెంబరు 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు అమలులో ఉంటుందని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు.;

Update: 2025-08-18 14:49 GMT

గతంలో బార్‌ లైసెన్స్‌ పొందాలంటే రెస్టారెంట్‌ లైసెన్స్‌ ముందే ఉండాల్సి ఉండేదని, ఈ సారి ఈ నిబంధనను సడలించడం జరిగిందని, బార్‌ లైసెన్స్‌ పొందిన తర్వాత 15 రోజుల్లో రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకునే సౌలభ్యాన్ని ప్రభుత్వం కల్పించిందనీ, కొన్ని సందర్భాల్లో అదనంగా మరో 15 రోజుల్లోగా రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకునే వెసులుబాటును కూటమి ప్రభుత్వం కల్పించిందని ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ తెలిపారు. నూతన బార్‌ పాలసీ గురించి, దాని విధివిధానాల గురించి ఎక్సైజ్‌ శాఖ డైరెక్టర్‌ నిషాంత్‌ కుమార్‌ సోమవారం వెల్లడించారు. మూడేళ్ల కాలపరిమితో రాష్ట్రంలో నూతన బార్‌ పాలసీని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరి ఐహెచ్‌ సీ భవన్‌ ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ కార్యాలయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ రాహుల్‌ దేవ్‌ శర్మ తో కలిసి నిషాంత్‌ కుమార్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్‌ 275 ద్వారా ఈ నెల 13న నూతన మద్యం పాలసీ విడుదల చేసిందన్నారు. సెప్టెంబర్‌ 1, 2025 నుంచి మద్యం పాలసీపై రాష్ట్రంలో కొత్త విధానం అమల్లోకి వస్తుందన్నారు. సెప్టెంబర్‌ 1, 2025 నుంచి 31 ఆగస్టు, 2028 వరకు ఈ విధానం వచ్చే మూడేళ్ల పాటు రాష్ట్రంలో అమలులో ఉంటుందన్నారు. గతంలో వేలం వేయడం ద్వారా బార్లను కేటాయించగా, ఇప్పుడు లాటరీ పద్ధతిని అమలు చేస్తున్నామన్నారు. దీనికోసం 840 బార్లకు నోటిఫికేషన్‌ ఇవ్వడం జరిగిందన్నారు.

ఈ కొత్త విధానంలో ఉదయం 10 నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లు తెరిచి ఉంటాయన్నారు. ప్రస్తుత పాలసీ ప్రకారం రాత్రి 11 గంటల వరకు మాత్రమే బార్లు తెరిచి ఉండేవన్నారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ. 35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ. 55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ. 75 లక్షల చొప్పున బార్ల లైసెన్స్‌ ఫీజు కట్టాల్సి ఉంటుందన్నారు. ప్రతి ఏడాది 10 శాతం లైసెన్స్‌ ఫీజు అన్ని కేటగిరీలకు పెరుగుతుందన్నారు. గీత కార్మికుల కులాల కోసం 10 శాతం బార్లను రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్‌ చేసిందన్నారు. వీటికి సాధారణ బార్‌ల లైసెన్సు రుసుముల్లో 50 శాతం తక్కువగా ఫీజుగా ఉండనుందన్నారు.
అన్ని బార్లను లాటరీ పద్దతిన జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది 10 శాతం ఫీజు పెంచుతామన్నారు. గతంలో ఒకేసారి ఆగస్ట్‌ లోపు లైసెన్స్‌ ఫీజు కట్టాల్సి ఉండేదన్నారు. ఈసారి 6 సార్లుగా చెల్లింపులు చేయవచ్చన్నారు. ఇవాల్టి నుంచి ఈ నెల 26 వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 28న లాటరీ తీసి బార్లు కేటాయిస్తామన్నారు. ధరఖాస్తుదారులు అప్లికేషన్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, హైబ్రిడ్‌ మోడ్‌లోనూ ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి కొత్త పాలసీ అందుబాటులోకి వస్తుందన్నారు. ఎంతో పారదర్శకంగా బార్‌ పాలసీ తీసుకురావడం జరుగుతుందన్నారు.
కొత్త వారు ఈ బిజినెస్‌లోకి రావడానికి కొన్ని మార్పులు చేశామన్నారు. గతంలో బార్లు ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండేవన్నారు. ఈసారి ఉదయం 10 నుంచి రాత్రి 12 వరకు బార్లకు అనుమతి ఉంటుందన్నారు. అన్ని కేటగిరీలో అప్లికేషన్‌ ఫీజు రూ. 5 లక్షలుగా నిర్ణయించామన్నారు. గతంలో కేటగిరీల బట్టి రూ. 7.5 లక్షలు, రూ. 10 లక్షల వరకు బార్ల అప్లికేషన్‌ ఫీజు ఉండేదన్నారు. అయితే దీని వల్ల కొన్ని చోట్ల మద్యం సిండికేట్లు కొత్త వారిని రాకుండా చేసే అవకాశం ఉందని, వాటిని అరికట్టేందుకు నూతన నిర్ణయాలు తీసుకున్నామన్నారు. గతంలో కంటే లైసెన్స్‌ ఫీజు 70 నుంచి 50 శాతానికి తగ్గాయన్నారు. ఎయిర్‌ పోర్ట్స్‌ లో బార్ల లైసెన్స్‌ కు ప్రభుత్వం నుంచి త్వరలో గైడ్‌ లైన్స్‌ రావాల్సి ఉందన్నారు.
Tags:    

Similar News