16 ఏళ్ల తర్వాత కేరళలోకి ఎంట్రీ

నైరుతి రుతుపవనాలు కేరళాలోకి ప్రవేశించాయి. 2009లో కూడా ఇదే మాదిరిగా ముందుగానే ఎంట్రీ ఇచ్చాయి.;

Update: 2025-05-24 12:33 GMT

నైరుతి రుతుపవనాల విషయంలో ఓ అత్భుతం చోటు చేసుకుంది. ప్రతి ఏటా సాధారణం కంటే కాస్త అటు, ఇటుగా ఎంట్రీ ఇచ్చే రుతుపవనాలు 16 ఏళ్ల తర్వాత ఈ సారి ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. శనివారం నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. సాధారణ తేదీ కంటే ఎనిమిది రోజులు ముందే ఈ సారి కేరళ తీరాన్ని తాకాయని వెల్లడించింది.

సాధారణంగా జూన్‌ మొదటి వారంలో కేరళలోకి ఎంట్రీ ఇస్తాయి. కానీ ఈ సారి మాత్రం ముందుగానే ప్రవేశించాయి. ఇది వరకు 2009లో కూడా ఇదే విధంగా సాధారణ తేదీ కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని ఆంధ్రప్రదేశ్‌ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ సారి విస్తారంగా వర్షలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరో వైపు గత ఐదేళ్లల్లో నైరుతి రుతుపవనాలు మే నెలాఖరులోను, జూన్‌ మొదటి వారంలోను కేరళ తీరాన్ని తాకాయి. రెండేళ్ల క్రితం అంటే 2023వ సంవత్సరంలో అయితే రుతుపవనాలు ఎంట్రీనే చాలా ఆలస్యంగా జరిగింది. సాధారణం కంటే వారం రోజుల పాటు జాప్యం నెలకొంది. లేటుగా ఎంట్రీ ఇచ్చాయి. జూన్‌ 8వ తేదీన రుతుపవనాలు లేటుగా ఎంట్రీ ఇచ్చాయి. దీంతో వర్షాల కోసం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు ఎంతగానో ఎదురు చూశారు.
సాధారణం కంటే ముందుగానే ప్రవేశించిన రుతుపవనాల నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. జూన్‌ రెండో వారంలో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వానలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Tags:    

Similar News