వైసీపీ, టీడీపీ శ్రేణులతో డీఎస్‌పీ భేటీ..

ఆంధ్రలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఈసారి ఎన్ని అల్లర్లు జరుగుతాయి. ఎన్ని హింసాత్మక ఘటనలు జరుగుతాయి..

Update: 2024-05-31 14:06 GMT

ఆంధ్రలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. కౌంటింగ్ దగ్గర పడుతున్న సమయంలో ఈసారి ఎన్ని అల్లర్లు జరుగుతాయి. ఎన్ని హింసాత్మక ఘటనలు జరుగుతాయి అన్న ఆందోళన ప్రజల్లో మెదులుతోంది. కానీ కౌంటింగ్ సమయంలో ఏటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అలెర్ట్ అయింది. ఎక్కడిక్కడ పకడ్బందీగా భద్రతా చర్యలు తీసుకుంటుంది. పోలీసు అధికారులకు కూడా కీలక సూచనలు చేసింది. హింసాత్మక ఘటనలు, అల్లర్లను అడ్డుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలంటూ దిశానిదర్దేశం చేసింది.

పార్టీలకు ఈసీ వార్నింగ్

ఇందులో భాగంగానే కౌంటింగ్ సమయం నియోజకవర్గంలో కానీ, కౌంటింగ్ కేంద్రంలో కూడా గొడవలకు దిగితే కఠిన చర్యలు ఉంటాయిన ఎన్నికల అధికారులు పార్టీల నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇందులో భాగంగానే కౌంటింగ్ కేంద్రంలోకి ఎంటర్ అయిన తర్వాత ఎటువంటి వాగ్వాదాలు కూడా పడకూడదని, కౌంటింగ్ ప్రక్రియకు అంతరాయం కలిగించేలా ఎటువంటి చర్యకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఈ హెచ్చరికలు దృష్టిలో పెట్టుకుని మసులుకోవాలని చెప్పారు.

ఇరు పార్టీల శ్రేణులతో భేటీ

కౌంటింగ్ సమయంలో అల్లర్లు జరగకుండా చూసుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై గురజాల డీఎస్‌పీ సీహెచ్ శ్రీనివాస రావు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగానే పిడుగురాళ్ల మండలంలోని వైసీపీ, టీడీపీ శ్రేణులతో ఏకకాలంలో సమావేశం నిర్వహించారు. ఇరు పార్టీల ముఖ్య నాయకులతో పోలీస్ స్టేషన్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీల నేతలకు డీఎస్‌పీ కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కౌంటింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లకు తావు లేదు. కౌంటింగ్ ప్రక్రియ అత్యంత ప్రశాంతంగా జరగాలి. అందుకు పార్టీల పెద్దలందరూ సహకరించాలి’’అని కోరారు.

వారిని కేసులు పక్కా

‘‘అదే విధంగా కౌంటింగ్ సమయంలో ఎవరైనా గొడవలు పడితే.. వారిపైనే కాకుండా వారికి సహకరించిన వారిపై కూడా కేసులు పెడతాం. రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా గ్రామాల్లో విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించకూడదు. బాణాసంచాలు కాల్చడం కూడా నిషేధం. కౌంటింగ్ సమయంలో జూన్ 1 నుంచే పిడుగురాళ్ల పట్టణం, మండలంలో సెక్షన్ 144, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుంది. కాబట్టి ఒకటో తేదీ నుంచే రోడ్లపై నలుగురు మించి తిరగొద్దు’’ అని హెచ్చరించారు.

మూడు రోజులు డ్రైడే

ఈ సందర్భంగానే ఆయన మందుబాబులకు షాకింగ్ న్యూస్ కూడా చెప్పారు. ‘‘మూడో తేదీ నుంచి ఐదో తేదీ వరకు ప్రభుత్వ దేశానుసారం డ్రైడేగా ప్రకటించడం జరిగింది. కావున అన్ని మద్యం షాపులు , బార్ రెస్టారెంట్లు పూర్తిగా మూసి వేయడం జరుగుతుంది. పోలింగ్ సమయం నుంచి జరిగిన అల్లర్లకు సంబంధించి అరెస్ట్‌లు చేయడం జరిగింది. వారిని రిమాండ్‌కు తరలించాం. కౌంటింగ్ రోజున గొడవలకు పాల్పడే వారిపై కూడా ఇదే తరహా చర్యలు ఉంటాయి’’అని హెచ్చరించారు.

Tags:    

Similar News