ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రత్యేకతలేంటో తెలుసా?

గత ఎన్నికలతో పోల్చితే 2024 సార్వత్రిక ఎన్నికలకు చాలా ప్రత్యేకతలున్నాయి.

Update: 2024-05-14 13:59 GMT

ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల నిర్వహణ చేపట్టారు. రీ పోలింగ్‌కు తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. అన్నింటికి మించి భారీ స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. వర్షాలను సైతం లెక్క చేయ లేదు. దూరాన్ని భారంగా కూడా ఫీల్‌ కాలేదు.

ఓట్లేసేందుకు విదేశాల నుంచి తరలి వచ్చిన ఆంధ్రులు
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లేసేందుకు దేశ, విదేశాల నుంచి ప్రవాసాంధ్రులు తరలి వచ్చారు. 2024 ఎన్నికల్లో తమకు నచ్చిన పార్టీ, నచ్చిన అభ్యర్థికి ఓట్లేసి జన్మభూమి రుణం తీర్చుకునేందుకు నడుం బిగించారు. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లాకు చెందిన వారు ప్రథమ వరుసలో నిలచారు. బాపట్ల జిల్లాలోని పిట్టలవానిపాలెం, కర్లపాలెం తదితర మండలాలకు చెందిన వందలాది మంది ప్రవాసాంధ్రులు సోమవారం జరిగిన పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకే పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చి క్యూలైన్‌లో బారులు తీరారు. దాదాపు రెండు గంటల పాటు వెయిట్‌ చేసి, ఓపిగ్గా క్యూలో నిల్చుని తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. వెంటనే అక్కడ నుంచి బయలు దేరి వారి ప్రాంతాలకు వెళ్లి పోయారు.
క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టిన తెనాలి వీడియో
Delete Edit
తెనాలి ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ అకారణంగా ఓటరు సుధాకర్‌పై దాడికి పాల్పడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. సుధాకర్‌ చేసిన తప్పల్లా తెనాలి ఎమ్మెల్యేను క్యూలో వచ్చి నిల్చొమనడమే. పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద అందరికీ ఒక రకమైన నిబంధనలు. అందరూ వీటిని తూచా తప్పకుండా పాటించాల్సిందే. అంతేకానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు లోపలికి ఎళ్తామంటే ఎన్నికల నిబంధనలు ఒప్పుకోవు. కానీ తెనాలి ఎమ్మెల్యేకి ఇవేమీ పట్టవు అన్నట్లుగా వ్యవహరించి, సామాన్య ఓటర్‌పై దాడికి పాల్పడ్డారు. ఆ ఘటనకు సంబంధిన వీడీయో క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేసింది.
మంజుల మనో ధైర్యానికి ఫిదా
Delete Edit
పల్నాడు జిల్లా మాచర్ల నియోజక వర్గంలో అల్లరిమూకల దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఒక మహిళా ఏజెంటు వెరవకుండా ఏజెంటుగా విధులు నిర్వహిస్తానని చెప్పడం కూడ ఈ ఎన్నికల్లో ప్రత్యేకత కూడా చెప్పుకోవచ్చు. పల్నాడు జిల్లా మాచ్చర్ల అసెంబ్లీ నియోజక వర్గంలో రెంటాల గ్రామంలో టీడీపీ అభ్యర్థి బ్రహ్మారెడ్డి తరపున మంజుల అనే మహిళ ఏజెంటుగా ఉండేందుకు ముందుకు వచ్చారు. అయితే పోలింగ్‌ ప్రారంభమైన తర్వాత బ్రహ్మారెడ్డి ప్రత్యర్థుల అల్లరి మూకలు కత్తులు, గొడ్డళ్లతో చేసిన దాడుల్లో ఏజెంటు మంజులకు నుదిటి మీద తీవ్ర గాయమైంది. అయిన వెరవకుండా పోలింగ్‌ కేంద్రంలోనే కూర్చుని విధులు నిర్వహిస్తానని, ఎక్కడకు వెళ్లనని చెప్పడంతో అక్కడున్న సిబ్బంది అంతా ఆశ్చర్యానికి గురి చేసింది.
భారీగా తరలి వచ్చిన ఓటర్లు
ఎప్పుడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ఆంధ్రప్రదేశ్‌కు తరలి వచ్చారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమళినాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓటర్లు లక్షల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాదాపు 12లక్షల 70వేల మంది వరకు ఓటర్లు హైదరాబాద్‌తో పాటు ఇతర తెలంగాణలోని ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సోమవారం ఉదయం ఆంధ్రప్రదేశ్‌లోని తమ సొంత ప్రాంతాలకు చేరుకుని ఓట్లు వినియోగించుకున్నారు. కొంత మంది రెండు రోజుల ముందుగానే సొంత ప్రాంతాలకు చేరుకున్నారు. బస్సులు, కార్లు, ఇతర అద్దె వాహనాల్లో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. తిరిగి అదే రోజు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో బస్సులు, కార్లు, టూ వీలర్లలో బయలు దేరడంతో హైదరాబాద్‌–విజయవాడ జాతీయ రహదారి సోమవారం రాత్రి భారీగా ట్రాక్‌ జామ్‌ అయింది. ఈ నేపథ్యంలో పంతంగి టోల్‌గేట్‌ వద్ద భారీగానే ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వేల సంఖ్యలో వాహనాలు ఒకే సారి తరలి రావడంతో హైదరాబాద్, తెలంగాణ వైపు వెళ్లే లేన్ల సంఖ్యను పెంచి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా రద్దీని తగ్గించేందుకు జీఎంఆర్‌ సంస్థ చర్యలు తీసుకుంది. ఓటింగ్‌ రోజు సెలవు ప్రకటించడం తర్వాత రోజు వర్కింగ్‌ డే కావడంతో అదే రోజు తిరుగు ప్రయాణం చేపట్టారు. గతంలో కంటే ఈ సారి భిన్నంగా ఓటింగ్‌ శాతం పెరిగింది.
అర్థరాత్రి వరకు పోలింగ్‌
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో అర్థ రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. కృష్ణా జిల్లాలో పెడన, గన్నవరం, గొల్లనపలి కొండపావులూరు, పెద్దఅవుటపల్లి, ఎనికేపాడు, ప్రసాదంపాడుతో పాటు మరికొన్ని చోట్ల అర్థ రాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది. తిరువూరు చింతల కాలనీ, విజయవాడ శివారు ప్రాంతాలైన పాయకాపురం, కండ్రిక, బీవీ సుబ్బారెడ్డి హైస్కూల్, నెల్లూరు జిల్లాలో ఆర్‌ఎస్‌ఆర్‌ పాఠశాల, సుబేదారుపేట, సర్వేపల్లి, వెంకటాచలం, నిడిగుంటపాలెం, అనకాపల్లి గవరపాలెం వంటి పలు చోట్లు అర్థరాత్రి వరకు పోలింగ్‌ కొనసాగింది.
జోరు వర్షంలో కూడా ఓటింగ్‌
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీ జీకేవీధి మండంలోని పలు ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూనే ఓటు హక్కును వినియోగంచుకున్నారు. రింతాడ, ఏబులం, చింతపల్లి, కిన్నర్ల వంటి ప్రాంతాల్లో వర్షంలో తడుస్తూనే క్యూలో నిలబడ్డారు.
అక్కడ 4 గంటలకే క్లోజ్‌
తీవ్రవాద ప్రభావం ఉంటుందనే నేపథ్యంలో అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైన అరకు, పాడేరు, రంపచోడవరం వంటి ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే పోలింగ్‌ ముగిసింది. పాలకొండ, కురుపాం, సాలూరు వంటి ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించారు.
దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంలో కినుకు వహించారనే విమర్శలు ఉన్నాయి. పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ర్యాంపులు లేక పోవడంతో వారు వచ్చి ఓట్లేసేందుకు ఇబ్బందులు పడ్డారనే విమర్శలు ఉన్నాయి.
అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలు తప్పితే ఎలాంటి హింసాత్మక సంఘటనలకు తావు లేకుండా, రీ పోలింగ్‌కు కూడా అవకాశం లేకుండా ప్రశాంతంగానే 2024 ఎన్నికలను నిర్వహించడం విశేషం. 
Tags:    

Similar News