సిరిమానోత్సవంలో అపశృతి..కూలిన స్టేజి

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స ,ఇతరులు కూర్చొన్న స్టేజి కూలడంతో గందరగోళం,తప్పిన ప్రమాదం

Update: 2025-10-07 11:59 GMT

విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఉత్సవాల్లో కీలక ఘట్టమైన సిరిమానోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. ఉత్సవాన్ని తిలకించేందుకు ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ,మరికొందరు నేతలు ఆ స్టేజీపైనే కూర్చుని ఉత్సవాన్ని తిలకిస్తున్న సమయం లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో భక్తులు గందరగోళానికి గురయ్యారు.ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటి తరువాత పరిస్థితిని చక్కదిద్దడంతో బొత్సతో సహా మిగిలిన వారు కుటుంబసమేతంగా తిరిగి వచ్చి ఉత్సవాన్ని తిలకించారు.

అన్నిరకాల జాగ్రత్తలు తీసుకున్నామని స్టేజి కూలిన ఘటనలో ఎవరికీ ఏమీ కాలేదని పోలీసులు వెల్లడించారు. సిరిమానోత్సవం ప్రారంభానికి ముందే భారీ వర్షం కురవడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం కారణంగా సిరిమాను ఊరేగింపుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.
Tags:    

Similar News