దేవి నవరాత్రులు: మూడో రోజు శ్రీ అన్నపూర్ణదేవి అలంకణలో అమ్మవారు

దసరా నవరాత్రుల మహోత్సవాల్లో ఒక్కో రోజు ఒక్కో రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. మూడో రోజు విశేషాలు.

Update: 2024-10-05 02:42 GMT

దేవి నవరాత్రులు ముచ్చటగా మూడోరోజుకు చేరుకున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేలాదిగా భక్తులు తరలి వచ్చి మొక్కులు తీర్చుకొని అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు.

శనివారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజైన శనివారం అమ్మవారు శ్రీ అన్నపూర్ణదేశి అలంకణలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. సృష్టి, స్థితి, లయకు కారణభూతమైన దుర్గమ్మను, సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు కొలుస్తారు. ఆ రూపంలో కొలువైన అమ్మవారిని దర్శించుకోవడం భక్తులు ఎంతో శ్రేష్టంగా భావిస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి కనక దుర్గమ్మ వారి దసరా ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. దేశవ్యాప్తంగా కూడా ఇవి కొనసాగుతున్నాయి. తొలి రోజైన గురువారం శ్రీబాలా త్రిపుర సుందరి దేవి అవతారంలోను, రెండో రోజైన శుక్రవారం వేద మాత శ్రీ గాయత్రీ దేవి అవతారంలోను భక్త లోకానికి దర్శనమిచ్చారు.
సమస్త జీవకోటికి ప్రాణాధారమైన ఆహారాన్ని అందించే దేవతగా శ్రీ అన్నపూర్ణదేవిని భక్తులు ఆరాధిస్తారు. జీవుల మనుగడకు ఆహారమే ప్రధాన ఆధారం. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే దేవి మూర్తిగా అన్నపూర్ణదేవి అవతారంలో ఉండే అమ్మవారిని ఆరాధిస్తారు. అన్నపూర్ణా దేవిని ఆరాధించడంతో పాటు దర్శనం చేసుకుంటే ఆకలి దప్పులుండవుని విశ్వసిస్తారు. పరమేశ్వరునికే భిక్షం పెట్టిన అన్నపూర్ణదేవిని పూజిస్తే ధన ధాన్యాలు సిద్ధిస్తాయని ధన దాన్యాభివృద్ధి జరుగుతుందని, ఐశర్య సిద్ధి ప్రాప్తిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ రూపంలో అమ్మవారిని పూజిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, కుశలత, వాక్‌సిద్ధి సిద్ధిస్తాయని భావిస్తారు.
అన్నపూర్ణ దేవికి గంధం లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అలంకరణ చేస్తారు. ఇది రంగులకు ప్రతీక. మూడో రోజు అమ్మవారికి గారెలు, క్షీరాన్నం, దద్దోజనం నివేదిస్తారు. అమ్మ ధరించిన రస పాత్ర అక్షయ శుభాలను అందిస్తుందని భావిస్తారు. అన్నపూర్ణ దేవిని తెల్లటి పుష్పాలతో పూజించేందుకు ఇష్టపడుతారు. అలాగే అన్నపూర్ణదేవి అలంకారంలో భక్తులను అనుగ్రహించే దుర్గమ్మకు ఈ రోజు మినప గారెలు, మొక్కజొన్న వడలు నైవేద్యంగా పెడుతారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే శుభ ఫలితాలుంటాయని భక్తులు భావిస్తారు.
Tags:    

Similar News