సచివాలయంలో అగ్ని ప్రమాదం.. ఉలిక్కిపడిన సీఎం
సచివాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై సీఎం చంద్రబాబు స్పందించారు. ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.;
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాం చోటు చేసుకున్న ఘటనా స్థలాన్ని ముఖ్యంత్రి చంద్రబాబు పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా, హోం మంత్రి వంగలపూడి అనిత, జీఏడీ పోలిటికల్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా ఇతర అధికారులతో కలిసి అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశాన్ని పరిశీలించారు. ఎప్పుడు అగ్ని ప్రమాదం జరిగింది, ఎలా జరిగింది అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని, రెండో బ్లాక్‌లోని యూపీఎస్ బ్యాటరీ రూమ్ వద్ద ఘటన జరిగిందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అయితే ఎందుకు అగ్ని ప్రమాదం జరిగింది, దానికి దారితీసిన కారణాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే దర్యాప్తు ప్రారంభమైందని, విచారణ కొనసాగుతున్నట్లు సీఎం చంద్రబాబుకు తెలిపారు.