‘రాయలసీమకు ప్రతి నీటి చుక్కా విలువైనదే’.. బొజ్జా దశరథరామిరెడ్డి

రాయలసీమ నీటి కష్టాలపై రాయలసీమ సాగునీటి సమితి బొజ్జా దశరథ రామిరెడ్డి స్పందించారు. నీటి కష్టాల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

Update: 2024-07-27 10:52 GMT

రాయలసీమ నీటి కష్టాల పరిష్కారం కోసం రాయలసీమ సాగునీటి సమితి ఎంతో కృషి చేస్తోంది. రాయలసీమ వాసుల నీటి కష్టాలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, అధికారులకు చేరవేస్తోంది. వారు ఎంత శ్రమిస్తున్నా నీటి కష్టాలు మాత్రం తీరడం లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న క్రమంలో శ్రీశైలం రిజర్వాయర్ కళకళాడుతోంది. కానీ ప్రాజెక్ట్ నిండకుండానే నీటిని కిందకు వదిలేస్తున్న పరిస్థితి. ఈ రిజర్వాయర్‌కు ఇంకా ఎంత కాలం వరద వస్తుందో.. మళ్ళీ ఎప్పుడు రిజర్వాయర్ నిండుతుందో ఎవరూ చెప్పలేని స్థితి. ఈ నేపథ్యంలో రాయలసీమ నీటి కష్టాలు మారాలంటే పద్ధతులూ మారాలని, ప్రతి నీటిబొట్టు ముఖ్యమేనని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘శ్రీశైలం రిజర్వాయర్ ప్రస్తుతం వరద వస్తోంది. అది ఎంత కాలం వస్తుందో ఎవరూ చెప్పలేని పరిస్తితి. రిజర్వాయర్ నిండక ముందే గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. మరోవైపు విద్యుత్ ఉత్పత్తి పేరు చెప్తూ నీటిని అడుగంటా తోడేస్తున్నారు. దీని వల్ల రాయలసీమకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. రాయలసీమకు నీరు అందాలంటే ప్రాజెక్ట్‌లో నీటి మట్టం 854 అడుగుల వరకు ఉండాలి. కానీ కొన్నేళ్లుగా ఈ విషయాన్ని అందరూ మరిచారు. రాయలసీమను విస్మరిస్తూ ప్రతి ఏడాది కూడా రిజర్వాయర్‌లోని నీరు అడుగంటేలా తోడేస్తున్నారు. దిగువకు వదిలేస్తూనే ఉన్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయ. ఈ పరిస్థితి మారాలని పిలుపునిచ్చారు.

‘‘రాయలసీమ దాహార్తిని తీర్చడానికి, వ్యవసాయ అవసరాలకు శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 854 అడుగుల మేర నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పద్దతులు మారాలి. రాయలసీమ మరువకుండా బాధ్యతగా రిజర్వయర్‌లో నీటి మట్టాన్ని మెయింటెన్ చేయాలి. రాయలసీమ మారుమూల ప్రాంతాలకు కూడా నీరందేలా చెరువులు, రిజర్వయార్లను నింపేలా ప్రభుత్వం నిర్ణయాత్మకైన ప్రణాళికలు సిద్ధం చేయాలి’’ అని కోరారు.

హుక్కులున్నా లాభం లేదు

‘‘నీటి హక్కులు ఉన్నప్పటికీ కావాల్సినన్ని రిజర్వేయర్లు లేకపోవడమే రాయలసీమకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఆ కారణంగానే ఏనాడు పూర్తిగా నీటిని వినియోగించుకోలేక తీవ్ర అవస్థలు పడుతోంది. ఈ అంశంపైనే రాయలసీమ సాగునీటి సమితి 12 ఏళ్లుగా ఉద్యమిస్తోంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్న నీటిని ఒడిసిపట్టేలా చర్యలు తీసుకోవాలి. అందుకు తగినన్ని రిజర్వాయర్లు, చెరువులను నిర్మించాలి. రాయలసీమ సాగునీటి సమితి కోరుకుంటున్నది ఇదే’’ అని ఆయన పేర్కొన్నారు.

‘‘ఎగువ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర, కష్ణా నదీజలాలు శ్రీశైలం రిజర్వాయర్‌కు భారీగా వస్తాయని ముందస్తు సమాచారం ఉంది. కానీ రాయలసీమ నీటి విడుదలకు సంబంధించి జలవనరుల శాక సరైన అనుమతులు తీసుకోవడంలో నిర్లిప్తంగా వ్యవహరించింది. అందువల్లే రాయలసీమకు నీటి కష్టాలు తప్పేలా లేవు. సాటు నీటికే కాకుండా తాగునీటి విడుదలకు కూడా ఎగువ నుంచి వచ్చే ప్రతి నీటిబొట్టు ముఖ్యమైనది, విలువైనదే’’ అని వివరించారు.

‘‘ఇప్పటికైనా జలవనరుల శాఖ నిద్రావస్త నుంచి బయటకొచ్చి తగిన అనుమతులు తీసుకొని, రాయలసీమలోని రిజర్వాయర్లు, చెరువులను నింపేలా చర్యలు చేపట్టాలి. అదే విధంగా జాతీయ రహదారి నిర్మాణం కారణంగా దుద్యాల దగ్గర కేసీ కెనాల్ కాలువ లైనింగ్ దెబ్బతిన్నది. దానికి తాత్కాలిక మరమ్మతులు కూడా సకాలానికి జరగలేదు. ఇది కూడా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమే. దీని కారణంగా నీటి లభ్యత ఉన్నా.. కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేయలేని పరిస్తితి ఏర్పడింది. దాంతో రైతులకు ాగు నీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో జలవనరుల శాఖ యుద్ధప్రాతిపదిక చర్యలు చేపట్టి రైతన్నల కష్టాలను తీర్చాలి’’ అని కోరారు. అదే విధంగా భవిష్యత్తులో మళ్ళీ సమస్యలు రాకుండా కేసీ కెనాల్‌కు శాశ్వత మరమ్మతులు చేసే చర్యలు తీసుకోవాలని కూడా కోరారు.

Tags:    

Similar News