విజయరాయ్ లో మొక్క జొన్న నూనె

ఆంధ్రప్రదేశ్ లో మొదటి సారిగా మొక్కజొన్న పంట నుంచి ఆయిల్ తీసే కార్యక్రమాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలోని విజయరాయ్ లో ప్రారంభించారు.;

Update: 2025-08-13 12:54 GMT
మొక్కజొన్న కండెలు

ఆంధ్రప్రదేశ్ లో మొక్కజొన్న (మేజ్ లేదా కార్న్) సాగు విస్తరిస్తున్న నేపథ్యంలో... మొక్కజొన్న నుంచి ఆయిల్ తీయడం ఒక కొత్త అంశం. ఏలూరు కేంద్రంగా ఉన్న మొక్కజొన్న పరిశోధనా కేంద్రం (రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్, మార్టేరు సమీపంలో) ఈ ప్రక్రియకు నాంది పలికింది. మొక్కజొన్న ఆయిల్ (కార్న్ ఆయిల్)లో పాలీఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ 59 శాతం, మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్స్ 24 శాతం, సాచురేటెడ్ ఫ్యాట్స్ 13 శాతం ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి, రక్తప్రసరణకు మేలు చేస్తుంది. వంటలు, సలాడ్స్, స్నాక్స్, సబ్బులు, కాస్మోటిక్స్, రంగుల తయారీలో ఉపయోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో ఏపీలో మొక్కజొన్న సాగు 8 లక్షల ఎకరాలకు చేరింది. ఉత్పత్తి 22.13 లక్షల టన్నులు.

డాక్టర్ పీవీ రమణరావు అభిప్రాయం

మార్టేరు రీజినల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ స్టేషన్‌లో ప్లాంట్ బ్రీడింగ్ సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ పీవీ రమణరావు మొక్కజొన్న సాగు విస్తరణపై సానుకూల అభిప్రాయంతో ఉన్నారు. గోదావరి జోన్ జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌టెన్షన్ అడ్వైజరీ కౌన్సిల్ (ZREAC) మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. అక్కడ మొక్కజొన్నకు సిఫారసు చేసిన ఎరువుల డోసేజ్‌లను పునరాలోచించాలని చర్చించారు. ఇది మొక్కజొన్న సాగును మరింత సమర్థవంతంగా పండించడానికి ఆయన చేసిన మంచి సూచన. మొక్కజొన్న ఆయిల్ వినియోగం పెరగడం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, పారిశ్రామిక, ఆహార, పౌల్ట్రీ రంగాల్లో డిమాండ్ పెరుగుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

ఏ పంటలను రీప్లేస్ చేస్తుంది?

ఏపీలో మొక్కజొన్న సాగు వాతావరణ మార్పులకు అనుగుణంగా పండుతోంది. నీటి కొరత కారణంగా వరి (ప్యాడీ), వేరుశనగ (గ్రౌండ్‌నట్), పత్తి వంటి పంటలను రీప్లేస్ చేస్తోంది. అనంతపురం, ప్రకాశం, నెల్లూరు వంటి డ్రాట్ ప్రోన్ జిల్లాల్లో వరి రైతులు మొక్కజొన్న వైపు మొగ్గు చూపుతున్నారు. వరి కంటే 90 శాతం తక్కువ నీరు, 70 శాతం తక్కువ విద్యుత్ అవసరమవడం వల్ల ఇది వాతావరణ పరిస్థితులకు అనుకూలంలగా ఉంటుంది. వేరుశనగ, పత్తి రైతులు కూడా వర్షాధార ప్రాంతాల్లోకి మారుతున్నారు. ఎందుకంటే మొక్కజొన్న రోగ నిరోధకత, ఎక్కువ రాబడి ఇస్తుంది. 1998 నుంచి అనంతపురంలో ఈ మార్పు మొదలైంది. ప్రకాశంలో టొబాకో, రెడ్‌గ్రామ్, చిల్లీస్ నుంచి మారుతున్నారు.


ఎకరానికి రాబడి

2025లో ఏపీలో మొక్కజొన్న సగటు ధర రూ. 2,300 నుంచి రూ. 2,400 వరకు క్వింటాల్ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ రూ. 2,400) ఉంది. ఎకరానికి రాబడి 25 నుంచి 40 క్వింటాళ్లు (వెరైటీపై ఆధారపడి) వస్తుంది. అంటే రూ. 57,500 నుంచి రూ. 96,000 గ్రాస్ ఆదాయం వస్తుంది. ఖర్చులు (రూ. 30,000 నుంచి రూ. 40,000) తీసేస్తే నెట్ ప్రాఫిట్ రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు ఎకరాకు ఉంటోంది.


మాన్యువల్ సీడర్

మాన్యువల్ సీడర్ తో విత్తడం...

మొక్కజొన్న మాన్యువల్ సీడర్‌తో విత్తడం చేస్తున్నారు. అంటే మొక్కజొన్న విత్తనాలను చేతితో నడిపే ఒక సాధారణ యంత్రం (మాన్యువల్ సీడర్) ఉపయోగించి, సమాన దూరంలో, ఖచ్చితమైన లోతులో నాటడం చేస్తున్నారు. ఈ పద్ధతి సాంప్రదాయకంగా చేతితో విత్తనాలు చల్లడం కంటే సమర్థవంతంగా, తక్కువ కష్టంతో ఎక్కువ ఖచ్చితత్వంతో విత్తనాలను నాటడానికి సహాయపడుతుంది.

రైతు నువ్వుల రంగారావు ఏమంటున్నారంటే...

ఏలూరు జిల్లా పెడపాడు మండలం అప్పనవీడు గ్రామానికి చెందిన రైతు నువ్వుల రంగారావు కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొంగూరులో కౌలుకు భూమి తీసుకుని మొక్కజొన్న పంట పండిస్తున్నారు. ఈయన మొక్కజొన్న విత్తనాలను పండిస్తారు. సాధారంగా వాడుకునేవి కాకుండా విత్తనాలుగా తిరిగి భూమిలో నాటుకునే మొక్కజొన్న పంట పండిస్తున్నారు. ఈ పంట ఎకరాకు నాలుగు నుంచి ఐదు టన్నులు (40 నుంచి 50 క్వింటాళ్లు) దిగుబడి వస్తున్నట్లు చెప్పారు. టన్ను ధర రూ. 25వేలు ఉందన్నారు. ఎరువులు, పురుగు మందులు, దున్నకం ఖర్చుల కోసం ఎకరానికి రూ. 25వేలు పెట్టుబడి ఖర్చు ఉంటుందని, లక్ష రూపాయలు పైన వస్తే ఖర్చులు పోను ఎకరాకు రూ. 60వేల వరకు మిగులుతున్నట్లు చెప్పారు. ఆయన కుమారుడు నువ్వుల మునేష్ మాట్లాడుతూ మా ఊరికి సమీపంలోనే విజయరాయ్ ఉందని, అక్కడ మాకు పొలాలు లేక ఇక్కడికి వచ్చి కౌలుకు భూమిని తీసుకుని పంట పండిస్తున్నామన్నారు. నీటి వాడకం చాలా తక్కువగా సరిపోతుందని, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ప్రస్తతం సాగు చేస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల కలుపు పెరగకుండా ఉంటుందన్నారు.


రైతు నువ్వుల రంగారావు

ఎకరానికి రాబడి

2025లో ఏపీలో మొక్కజొన్న సగటు ధర రూ. 2,300 నుంచి రూ. 2,400 వరకు క్వింటాల్ (మినిమమ్ సపోర్ట్ ప్రైస్ రూ. 2,400) ఉంది. ఎకరానికి రాబడి 25 నుంచి 40 క్వింటాళ్లు (వెరైటీపై ఆధారపడి) వస్తుంది. అంటే రూ. 57,500 నుంచి రూ. 96,000 గ్రాస్ ఆదాయం వస్తుంది. ఖర్చులు (రూ. 30,000 నుంచి రూ. 40,000) తీసేస్తే నెట్ ప్రాఫిట్ రూ. 20,000 నుంచి రూ. 50,000 వరకు ఎకరాకు ఉంటోంది.

ఇతర పంటలతో పోలిక

మొక్కజొన్న పంట ఎకరాకు 25-40 క్వింటాళ్ల మధ్య దిగుబడి ఉంటోంది. సగటు ధర రూ. 2,300-2,400 మధ్య ఉంటోంది. నికరాదాయం ఎకరాకు రూ. 20,000-50,000 మధ్య ఉంటోంది. ఇదే వరి పంటను తీసుకుంటే ఎకరాకు 20-30 క్వింటాళ్ల మధ్య దిగుబడి ఉంటోంది. రూ. 2,000-2,500 వరకు క్వింటా ధర ఉంటోంది. అంటే నెట్ ప్రాఫిట్ ఎకరాకు రూ. 15,000-30,000 ఉండే అవకాశం ఉంది. మొక్కజొన్నకు తక్కువ నీరు, తక్కువ ఖర్చు, వరికి ఎక్కువ నీరు అవసరం.

వేరుశనగ పంట ఎకరాకు 10-15 క్వింటాళ్ల మధ్య దిగుబడి ఉంటుంది. క్వింటాల్ సగటు ధర రూ. 5,000-6,000 మధ్య ఉంటుంది. అంటే ఎకరాకు రూ. 20,000-30,000 వరకు ఆదాయం ఉంటుంది. మొక్కజొన్న ఎక్కువ రాబడి, తక్కువ రిస్క్. పత్తి పంట ఎకరాకు 8-12 క్వింటాల్స్ వస్తుంది. క్వింటా ధర రూ. 6,000-7,000 మించడం లేదు. అంటే ఎకరాకు రూ. 20,000-40,000 ఆదాయం వస్తుంది. మొక్కజొన్న తక్కువ ఇన్‌పుట్స్, వేగవంతమైన సైకిల్, పత్తికి పెస్ట్ సమస్యలు ఎక్కువ. మొక్కజొన్నకు ఉండవు.


మొక్కజొన్న మేలు

తక్కువ నీరు (వరితో పోలిస్తే 90 శాతం తక్కువ). వాతావరణ మార్పులకు తట్టుకోవడం, పౌల్ట్రీ ఫీడ్‌గా డిమాండ్ ఉంది. ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్‌తో అదనపు వాల్యూ వచ్చింది. భూమిని దున్నకుండానే విత్తనాలు నాటే పద్ధతి (జీరో టిల్లేజ్) వంటి టెక్నాలజీలతో 26 శాతం ఎక్కువ రాబడి. ఇతర పంటల కంటే ప్రాఫిటబుల్, ముఖ్యంగా డ్రై ఏరియాల్లో అనుకూలం. అయితే మార్కెట్ ఫ్లక్చుయేషన్స్, స్టోరేజ్ సమస్యలు ఉంటాయి.


మొక్కజొన్న పరిశోధనా కేంద్రం హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె మోహన్ రావు

మొక్కజొన్న పరిశోధన కేంద్రం (Maize Research Centre)

పశ్చిమ గోదావరి జిల్లా పెడపాడు మండలంలో విజయరాయ్‌ గ్రామం ఉంది. ఈ గ్రామంలో ఆచార్య ఎన్‌జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ (ANGRAU) కింద మొక్కజొన్న పరిశోధన కేంద్రం (Maize Research Centre, Agricultural Research Station) ఉంది. ఇది 2017-18లో స్థాపించారు. మొక్కజొన్న, మొక్కజొన్న ఆధారిత పంటల వ్యవస్థలు, తేనె తుట్టెల పెంపకం (apiculture) పై పరిశోధనలు జరుగుతున్నాయి. మొక్కజొన్న పరిశోధనా కేంద్రం హెడ్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె మోహన్ రావు నేతృత్వంలో కార్యకలాపాలు సాగుతున్నాయి.

విజయరాయ్ గ్రామంలో ప్రైవేట్ వ్యక్తులు మొక్కజొన్న ఆయిల్ తీస్తున్నారు. పరిశోధనా కేంద్రం వారి సహకారంతో కావాల్సిన మిషనరీ ఇక్కడి వారు కొనుగోలు చేసి ఆయిల్ తీసే కార్యక్రమాన్ని చేపట్టినట్ల ప్రిన్స్ పల్ సైంటిస్ట్ డాక్టర్ కే మోహన్ రావు ‘ది ఫెడరల్’ కు తెలిపారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల ఆధారంగా రైస్ మిల్లులు, సాల్వెంట్ ఆయిల్ ఎక్స్‌ట్రాక్షన్ యూనిట్లు (solvent oil extraction units), పామ్ కెర్నల్ ఆయిల్ వంటి పరిశ్రమలు ఉన్నాయి. సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్షన్ పద్ధతి ద్వారా మొక్కజొన్న గింజల నుంచి నూనే తీసే పద్ధతిని చేపట్టారు.

సాధారణంగా 25 కిలోల మొక్కజొన్న నుంచి 14 కిలోల స్టార్చ్ (మొక్కలు నిల్వ చేసుకునే ఆహారం), 6.6 కిలోల ఫీడ్, ఫీడ్ ఉత్పత్తులు. ఒక కిలో నూనె లభిస్తాయి.

విజయరాయ్‌లో ఎడిబుల్ ఆయిల్ (తినే నూనె) తయారీదారులు ఉన్నారు. 26 కంటే ఎక్కువ ఎడిబుల్ ఆయిల్ మాన్యుఫాక్చరర్లు విజయరాయ్ లో ఉన్నారు. వీరిలో కొందరు మస్టర్డ్ ఆయిల్ (ఆవ నూనె), కొబ్బరి నూనె వంటివి తయారు చేస్తారు. మరికొందరు మొక్కజొన్న ఆయిల్ కూడా తయారు చేస్తున్నారు.

జిల్లాలో మొక్కజొన్న ఉత్పత్తి ఎక్కువగా ఉంది (సుమారు 5.24 లక్షల మెట్రిక్ టన్నులు). ఇది నూనే తీయడానికి ఎక్కువగా సహాయపడుతుంది. విజయరాయ్‌లో ఆయిల్ పామ్ (oil palm) పరిశోధన కేంద్రం కూడా ఉంది. ఇది 1989 నుంచి పామ్ ఆయిల్ పరిశోధన చేస్తోంది.

మొత్తంగా మొక్కజొన్న ఆయిల్ విస్తరణ రైతులకు కొత్త అవకాశాలు తెరుస్తుంది. కానీ పరిశోధన, మార్కెట్ సపోర్ట్ అవసరం.

Tags:    

Similar News