'ఆపరేషన్ సింధూర్' ఫలించాలని కాంగ్రెస్ పార్టీ హోమం
భారత సైనికుల యుద్ధం ఫలించాలని కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షించింది. సీడబ్ల్యూసి సభ్యుడు శత్రు వినాశన హోమం నిర్వహించారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-05-09 09:10 GMT
'ఆపరేషన్ సింధూర్' సఫలం కావాలి. శత్రు వినాశనం జరగాలని కోరుతూ అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత శుక్రవారం హోమం నిర్వహించారు.
అనంతపురం జిల్లా నీలకంఠాపురంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యుడు (CWC) వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్. రఘువీరారెడ్డి భారత జవాన్ల పోరాటం ఫలించాలని ఆకాంక్షిస్తూ, శుక్రవారం శత్రు వినాశన హోమ పూజలు నిర్వహించారు. ఆయన స్వగ్రామంలోని ఆలయ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం శాస్త్రోక్తంగా శుక్రవారం నిర్వహించారు.
కాశ్మీర్ లోని పహల్గావ్ ప్రాంతానికి వేసవి సెలవులు ఆనందంగా గడపాలని దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రకృతిని ఆస్వాదించడానికి వెళ్లారు. అదే సమయంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాగించిన మారణకాండలో 26 మంది భారత పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటన అన్నివర్గాలను దిగ్భాంతికి గురి చేసింది. పాకిస్థాన్ సాగిస్తున్న అరాచకాలపై తీవ్ర స్థాయిలో నిరసన ప్రదర్శనలతో పాటు ఉగ్రవాదుల తూటాలకు ప్రాణాలు వదిలిన వారి ఆత్మశాంతికి నివాళులు అర్పించారు. ఇదే సమయంలో
పాకిస్థాన్ ఉగ్ర శిబిరాలపై వ్యూహాత్మకంగా 'ఆపరేషన్ సింధూర్'లో భారత సైనికులు చేపట్టిన ఆపరేషన్ పౌరుల్లో సంబరాలు నింపింది. సైన్యానికి మద్దతుగా విభిన్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యుద్ధరంగంలోని జవాన్ల కుటుంబాల్లో కూడా ఇవి మరింత స్థైర్యం నింపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాకిస్థాన్ సాగిస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొడుడున్న భారత సైన్యానికి మరింత శక్తి ప్రసాదించాలని, వారి పోరాటం ఫలించాలని ఆలయాల్లో పూజలు, హోమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే
సత్యసాయి జిల్లా నీలకంఠాపురం ఆలయ ప్రాంగణంలో ఉన్న యాగశాలలో ఆపరేషన్ సింధూర్ ద్వారా శత్రు వినాశనం జరగాలి అని CWC సభ్యుడు రఘువీరారెడ్డి హోమ పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం మాజీ ఉపాధ్యక్షుడు సచ్చు బాలకృష్ణతో కలిసి రఘువీరా ఆ హోమంలో పాల్గొన్నారు. నీలకంఠాపురం గ్రామంలోని ఆలయ అర్చకులు ఈ కార్యక్రమాన్ని కొన్ని గంటల పాటు మంత్రోచ్ఛారణలతో సాగించి, చివరగా పూర్ణాహూతి చేశారు.
దేశ రక్షణ, పౌరుల భద్రత, సమగ్రత కాపాడడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నో సేవలు అందించిందని హోమ కార్యక్రమాల తరువాత రఘువీరెడ్డి చెప్పారు. విపత్కకర పరిస్థితలు ఎదురైనప్పుడు దేశ రక్షణలో రాజకీయాలను పక్కన ఉంచి భారత ప్రభుత్వం, సైన్యానికి దన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు మన సైనికులు చేస్తున్న త్యాగాలు నిరుపమానం, వారి కుటుంబాలకు కూడా ధైర్యం నింపేవిధంగా ప్రతిఒక్కరూ ముందుండాలన్నారు.