మహానాడులో జగన్‌పై కామెడీ స్కిట్
రాయలసీమ అభివృద్ధి, రోడ్లు వేయడం వంటి పలు అంశాల మీద సెటైర్లతో టీడీపీ శ్రేణులను నవ్వించారు.;
By : The Federal
Update: 2025-05-27 10:44 GMT
కడపలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ప్రదర్శించిన వ్యంగ్యాస్త్రాలతో కూడిన ఒక కామెడీ స్కిట్ మహానాడులో హైలైట్‌గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రదర్శించిన ఈ స్కిట్‌కు మంచి ఆదరణ లభించింది. ఈ స్కిట్‌ను ప్రదర్శిస్తున్న సయమంలో జై తెలుగుదేశం అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. నెల్లూరుకు చెందిన కమెడియన్, టీడీపీ నేత హరి, మరో టీడీపీ నాయకుడు కలసి దీనిని ప్లే చేశారు. కడపలో జరుగుతున్న మహానాడు విశిష్టతలు, రాయలసీమ డెవలప్‌మెంట్, ఆంధ్రప్రదేశ్‌లో రహదారుల అభివృద్ధి గురించి వివరిస్తూ ఈ స్కిట్‌ను ప్రదర్శించారు.
రే అబ్బిగా ఎక్కడకి వెళ్తున్నావురా అంటూ నెల్లూరు కమిడియన్ హరిని మరో నాయకుడు అడుగుతాడు. అందుకు తాను కడపకు వెళ్తున్నాను అంటూ బదులిస్తారు. కడపకు ఎందుకు వెళ్తున్నావు.. అక్కడ ఏమి జరుగుతోంది అంటూ మళ్లీ అడుగుతాడు. కడపలో పండుగ జరుగుతోంది..తెలుగుదేశం పండుగ.. తెలుగుదేశం కార్యకర్తల పండుగ జరుగుతోంది.. మహానాడు పండుగ జరుగుతోంది అందుకే కడపకు వెళ్తున్నా అని బదులిస్తాడు. అందుకు నా కడప.. నాదే కడప అంటూ రెండో వ్యక్తి అంటాడు. సరేగానీ కడపలో చీనీ పంట ఎలా ఉందని మొదటి వ్యక్తి రెండో వ్యక్తిని అడుగుతాడు. చాలా బాగా పంట వచ్చింది. పది లక్షల వరకు ఆదాయం వచ్చిందంటాడు. సరే మీ తాత ఎలా ఉన్నాడని మళ్లీ అడుగుతాడు రెండో వ్యక్తిని. ఊర్లో రెండు వర్గాలు కొట్లాడుకుంటుంటే.. మధ్యలో దూరి ఇద్దరికీ సర్థిచెప్ప చేయబోయాడు.. ఇద్దరు కలిసి మా తాతను వేశారని బదులిస్తాడు. దీనికి మొదటి వ్యక్తి గతంలో మీరు నెత్తురు పారిస్తే తెలుగుదేశం ప్రభుత్వం నీరు పారించి అభివృద్ధి చేసింది. ఎన్టీఆర్ తెలుగు గంగ ద్వారా రాయలసీమకు నీళ్లిచ్చారు. ఇప్పుడు నగరి గాలేరు ద్వారా చంద్రబాబు నగరి వరకు నీళ్లిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అపర భగీరధుడు నారా చంద్రబాబు నాయుడు. అంటూ డైలాగుల మీద డైలాలుగులు పేల్చాడు రెండో వ్యక్తి.
ఇంకా స్కిట్‌ను కొనసాగిస్తూ.. జిల్లాలో రోడ్లు ఎలా ఉన్నాయని అంటాడు. రోడ్లు మీద వెళ్తుంటే విమానంలో వెళ్లినట్లుంది. ఎలాంటి బ్రేకులు కానీ, షేకులు కానీ లేవని బదులిస్తాడు రెండో వ్యక్తి. అంతకు ముందు ఐదేళ్లు ఎలా ఉన్నాయని మళ్లీ అడుగుతాడు.. దీనికి రెండో వ్యక్తి బదులిస్తూ.. మా ఆవిడను డెలివరీ కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుంటే అక్కడున్న గుంతవల్ల ఆ అదుర్లకు రోడ్డుపైనే డెలివరీ అయిపోయిందని జగన్ ప్రభుత్వం మీద సెటైర్లు వేశారు. ప్లే చేసింది రెండు, మూడు నిముషాలే అయినా.. జగన్ మీద విమర్శలు, చంద్రబాబుపై పొగడ్తలు టీడీపీ శ్రేణులను ఆకట్టుకున్నాయి.