సీఎం చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత

మంత్రి నారా లోకేష్‌ అమరావతి నుంచి హుటాహుటిన బయలుదేరి హైదరాబాద్‌ వెళ్లారు. మధ్యాహ్నం హైదరాబాద్‌ చేరుకోనున్న సీఎం చంద్రబాబు.

By :  Admin
Update: 2024-11-16 07:42 GMT

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు నారా రామ్మూర్తినాయుడు కొద్ది క్షణాల క్రితం కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితులు విషమించడంతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించారు. అయినా పరిస్థితులు మరింత విషమించడంతో ఆయన కన్నుమూశారు.

చిన్నాన్న నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమంగా ఉందని సమాచారం అందిన వెంటనే మంత్రి నారా లోకేష్‌ అసెంబ్లీ సమావేశాల నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. రామ్మూర్తి నాయుడు అన్న, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. గురువారం ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ రోజు ఢిల్లీలో ప్రముఖ దిన పత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌ లీడరషిప్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్నారు. దీనికి హాజరైన తర్వాత ఎన్డీఏ అభ్యర్థుల కోసం మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానిక వెళ్లాల్సి ఉంది. ఆ మేరకు ఇది వరకే సీఎం ప్రోగ్రామ్‌ ఫిక్స్‌ అయింది. అయితే తమ్ముడు రామ్మూర్తి నాయుడు కన్నుమూయడంతో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకొని హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. మంత్రి నారా లోకేష్‌ ఇప్పటికే ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నందమూరి రామకృష్ణ, నందమూరి కుటుంభ సభ్యులు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి దంపతులు ఆసుపత్రికి చేరుకున్నారు.
నారా చంద్రబాబు నాయుడు కుంటుంబంలో సీఎం చంద్రబాబు పెద్ద కుమారుడు కాగా రామ్మూర్తినాయుడు రెండో కుమారు. నారా కర్జూరనాయుడు, అమ్మణమ్మ దంపతులకు 1952లో రామ్మూర్తినాయుడు జన్మించారు. రామ్మూర్తినాయుడుకి ఇద్దరు కుమారులు. నారా రోహిత్, నారా గిరీష్‌. 1994లో చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత అనారోగ్య కారణాల వల్ల రాజకీయల నుంచి తప్పుకున్నారు.
Tags:    

Similar News