జగన్ పోలీసు ఉద్యోగాలు తీసేస్తే... బాబు మళ్లీ ఆదుకున్నారు..

అనంతపురం డీపీఓ వద్ద యూనిఫాంతో కానిస్టేబుల్ సందడి..

Update: 2025-12-01 11:42 GMT
2022లో అనంతపురం డీపీఓ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ (ఫైల్)

పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని నిరసన తెలిపినందుకు వైసీపీ ప్రభుత్వంలో దళితుడైన ఆర్ముడ్ రిజర్వు పోలీస్ ( Armud Reserve Police AR ) కానిస్టేబుల్ ప్రకాష్ విధుల నుంచి డిస్మిస్ అయ్యారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనకు సోమవారం మళ్లీ ఉద్యోగం వచ్చింది. అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ఒక్కరే కాదు. రాష్ట్రంలో డిస్మిస్ అయిన 278 మంది పోలీసులను దశలవారీగా మళ్లీ ఉద్యోగాల్లోకి తీసుకున్నారు.

అనంతపురం జిల్లాలో ప్రకాష్ తోసహా ముగ్గురిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు.

2022లో అనంతపురం జిల్లాలో ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను డిస్మిస్ చేసిన సంఘటన పోలీసు శాఖలో అలజడి రేపింది. దీనిపై అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న నారా చంద్రబాబునాయుడు కూడా నిరసన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని కూడా అప్పట్లో ప్రకాష్ కు మాట ఇచ్చారు.

డీపీఓ వద్ద సందడి

అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ( District Police Office) వద్దకు ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ ఆర్డర్ కాపీ, పూల బొకేతో రావడం అక్కడి కానిస్టేబుల్ లో ఆశ్చర్యంగా చూశారు. మీడియా హడావిడి కూడా ఎక్కువగానే కనిపించింది. డిపిఓ వెలుపల మాట్లాడమని చెబుతూ ఏఆర్ కానిస్టేబుల్ మోహన్ బయటికి పంపించారు.
ఎందుకు డిస్మిస్ అయ్యారు..

అనంతపురం ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో ప్రకాష్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. 2022 జూన్ 14వ తేదీ సత్యసాయి జిల్లాలోని చెన్నై కొత్తపల్లి లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ వచ్చారు. అదే సమయంలో ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలోని అమరవీరుల స్థూపం వద్ద నిరసనకు దిగారు. పోలీసులకు రావాల్సిన టి ఏ టి ఏ అరియర్స్  చెల్లించాలని ఏఆర్ కానిస్టేబుల్ నినదించారు.

"ఏపీ సీఎం జగన్ సార్.. సేవ్ ఏపీ పోలీస్.. గ్రాంట్ ఎస్ ఎల్ ఎస్, ఏ ఎస్ ఎల్ ఎస్, అరియర్స్ చెల్లించి సామాజిక న్యాయం చేయండి ప్లీజ్" అని నినాదాలు రాసిన ప్లకార్డును ఏఆర్ కానిస్టేబుల్ ప్రదర్శించారు. దీంతో స్పందించిన రాష్ట్ర పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఎస్ ఎల్ ఎస్ లు, టీఏ, బకాయలను కూడా మరుసటి రోజే పోలీసులు ఖాతాలకు జమ చేసింది. రాష్ట్రంలో పోలీసులు ప్రకాష్ కు మద్దతుగా నిలవడంతో ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి సాహసించలేదు. కానీ ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ బయటకు రాకుండా కొన్ని రోజులపాటు ఆయన ఇంటి వద్ద సెక్యూరిటీ ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా ప్రకాష్ ఫోన్ కాల్స్ పైన కూడా నిఘా ఉంచడం, ఆయన బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింప చేశారనేది బాధిత ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఆరోపణ. ఆ తర్వాత కూడా తనను జిల్లా కేంద్రానికి దూరంగా డ్యూటీలు వేశారు అని కూడా ఆయన ఆరోపించారు.
అకారణంగా డిస్మిస్
రాష్ట్రంలోని పోలీసుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే లక్ష్యంగా నిరసన చేసిన తనకు 2019లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఒకేరోజు మూడు నోటీసులు కూడా ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
2019 జూన్ 22వ తేదీ అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ సెల్ కు గార్లదిన్నెకు చెందిన బి.వి లక్ష్మి అని వివహిత వచ్చారు.. డిపి బోలో పనిచేస్తున్న ప్రకాష్ తో ఆమెకు పరిచయం ఉన్నట్లు తెలిసింది. ఆమె నుంచి పది లక్షల రూపాయల నగదు 30 తులాల బంగారు ఆభరణాలు తీసుకోవడంతో పాటు ఆమెను చంపడానికి ప్రయత్నించారు అనేది విఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పై ఉన్న అభియోగంపై విచారణ జరపడంతో రుజువైందని నిర్ధారిస్తూ అప్పటి అనంతపురం జిల్లా ఎస్పీ పకీరప్ప కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ పర్యటన సందర్భంగా నిరసన తెలిపిన తనకు సంబంధం లేని విషయాలను ఆపాదించి, ఉద్యోగం నుంచి తొలగించారని ప్రకాష్ అప్పట్లో తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయినా, యూనిఫాంలోనే పోలీసు శాఖలో హోంగార్డు నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిందేనని ఆయన దీక్షకు కూడా దిగారు. ఆయనను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కూడా తరలించారు. ఆ విధంగా, మూడేళ్లు కాలగర్భంలో కలిసిపోయాయి.
2022లో చెన్నై కొత్తపల్లి మండలంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్ పర్యటనకు వచ్చిన సందర్భంలో నిరసన తెలిపారు అనే కారణంతోనే తనను మరో కేసుల్లో సర్వీస్ నుంచి తొలగించారని ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ చెప్పారు.
"డిస్మిస్ చేసిన తర్వాత కూడా తనను జైలుకు పంపించారు. ఐదు కేసులు బనాయించారు " అనే ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ గుర్తు చేశారు.
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగానే ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తో పాటు, మంత్రి నారా లోకేష్, హోం మంత్రి వంగలపూడి అనిత తన కుటుంబానికి భరోసా ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతపురం పర్యటనలో మంత్రి నారా లోకేష్, హోంమంత్రి వంగలపూడి అనిత కూడా తన నివాసానికి వచ్చి పరామర్శించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
"టిడిపి అధికారంలోకి రాగానే న్యాయం చేస్తామని వారు ముగ్గురు హామీ ఇచ్చారు" అని ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ గుర్తు చేశారు.
ప్రభుత్వం మారడంతో..

రాష్ట్రంలో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోయిన 20074 మంది పోలీసులకు మళ్లీ ఉద్యోగాలు దక్కాయి. దసలవారీగా 10 రోజులకు 20 మంది చొప్పున డిస్మిస్డ్ కానిస్టేబుల్ లను రాష్ట్ర ప్రభుత్వం విధుల్లోకి తీసుకునే విధంగా ఆదేశాలు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు అంటే పుట్టపర్తి పర్యటనకు వచ్చిన సందర్భంలో కూడా ఆరుగురు పోలీసులను మళ్లీ విధుల్లోకి తీసుకుంటూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాలను ప్రస్తావిస్తూ మళ్ళీ ఉద్యోగం సాధించిన యార్ కానిస్టేబుల్ ప్రకాష్ ఏమంటున్నారంటే.
ఉండవల్లి నివాసం వద్ద నవంబర్ 11వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశాను. నా కుటుంబ సమస్యలతో పాటు ఎందరో పోలీసులు తన మాదిరే నష్టపోయిన విషయాన్ని కూడా గుర్తు చేశానని ప్రకాష వివరించారు.

"నాతోపాటు మరో ముగ్గురికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో ఉద్యోగాలు కోల్పోయిన మాకు న్యాయం చేస్తామని ప్రతిపక్షంలో ఉండగా హామీ ఇచ్చారు.. ఆ మాటను నిలుపుకున్నారు" అని ప్రభుత్వం జారీచేసిన ఆదేశాల ఉత్తరాలతో పాటు పూల బొకే ను ప్రదర్శిస్తూ ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ధైర్యంగా విశ్వాసంగా పనిచేస్తాం..
రాష్ట్ర విభజన తర్వాత టిడిపి ప్రభుత్వ కాలంలో 2014 నుంచి 19వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 2500 మంది పోలీసులకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి కల్పించారనీ ఏ ఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ చెప్పారు. 1,500 మందికి ఏఐఎస్ఐ పోస్టులు ఇవ్వడంతో పాటు బకాయిలు కూడా సకాలంలో చెల్లిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలీసు శాఖకు అండగా నిలిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. 33 శాతం ఉన్న పీఆర్సీని 43 శాతానికి పెంచడంతోపాటు పోలీసు శాఖలో అన్ని క్యాడర్ల ఉద్యోగాలకు న్యాయం జరిగిందని గుర్తు చేశారు.
వైసీపీలో రివర్స్
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసు శాఖలో సిబ్బందికిస్తున్న 43% పి.ఆర్.సిని రివర్స్ చేశారు. సైకిల్, యూనిఫామ్ అలవెన్స్ మంజూరు చేయలేదు. డి ఎ డి ఎ లు చెల్లించకపోవడమే కాకుండా ఇంటి అద్దె కూడా ఎగవేత వేశారు. ఇలాంటి చర్యలతో నిద్రాహారాలు మాని పని చేసే కానిస్టేబుల్ లకు కడుపుకోత మిగిల్చారని వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయంపై ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ మరోసారి గుర్తు చేశారు.
"అనంతపురం జిల్లాలో నేను ఒక్కడినే కాదు. చాలామందికి అన్యాయం జరిగింది. రాష్ట్రంలో పోలీసులకు రావాల్సిన బకాయిలు చెల్లించండి" అని కోరినందుకే ఉద్యోగాల నుంచి తొలగించారు అని ప్రకాష్ ఆవేదన చెందారు. ఆనాటి పరిస్థితిని అర్థం చేసుకున్న తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు, నారా లోకేష్, వంగలపూడి అనిత ప్రభుత్వంలోకి రాగానే న్యాయం చేశారు అని కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
వారిచ్చిన మాట నిలుపుకున్నారు. మా కుటుంబాలకు అండగా నిలుపు నిలబడిన ప్రభుత్వానికి, పోలీసు ఉన్నతాధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా విశ్వాసంగా, ధైర్యంగా విధులు నిర్వహిస్తామని ప్రకాష్ భావోద్వేగానికి లోనయ్యారు.
Tags:    

Similar News