ఢిల్లీ వెళ్లిన సిఎం చంద్రబాబు నాయుడు
రేపు ఉప రాష్ట్రపతి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు.;
By : The Federal
Update: 2025-09-11 16:21 GMT
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ వెళ్లారు. శుక్రవారం ఢిల్లీలో ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతికి తిరుగు ప్రయాణం అవుతారు.
ఇటీవల భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి. ఈ నెల 9న జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్‌రెడ్డిపై గెలుపొందారు. రాధాకృష్ణన్‌కి 452 ఓట్లు రాగా, సుదర్శన్‌రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. పోలింగ్‌కు 14 మంది ఎంపీలు గైర్హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో పోలైన మొత్తం 767 ఓట్లలో 15 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. 152 ఓట్ల మెజారిటీతో రాధాకృష్ణన్ గెలుపొందినట్లు రాజ్యసభ సెక్రటరీ ప్రకటించారు. శుక్రవారం 17వ భాతర ఉప రాష్ట్రపతిగా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.