సీఐడీకి సుగాలి ప్రీతి కేసు.. హోంమంత్రి హామీ

సుగాలి ప్రీతి.. 2017లో దారుణంగా హత్యాచారనికి గురైన బాలిక. ఈ కేసులో మళ్ళీ కదలిక మొదలైంది. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన ఈ కేసు దర్యాప్తు.. ఈరోజు మళ్ళీ కాస్తంత ముందుకు జరిగింది.

Update: 2024-08-27 13:58 GMT

సుగాలి ప్రీతి.. 2017లో దారుణంగా హత్యాచారనికి గురైన బాలిక. ఈ కేసులో మళ్ళీ కదలిక మొదలైంది. ఇన్నాళ్లూ మాటలకే పరిమితమైన ఈ కేసు దర్యాప్తు.. ఈరోజు మళ్ళీ కాస్తంత ముందుకు జరిగింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత.. బాధితురాలి తట్టికి హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూడా తాను అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి ఘటనపై దర్యాప్తు జరిపిస్తానని, ఆ చిన్నారికి న్యాయం జరిగేలా చూస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు. కాగా రాష్ట్రంలో ప్రభుత్వం మారిన రెండు నెలల తర్వాత సుగాలి ప్రీతి కేసులో చలనం మొదలైంది. తన కూతురుకు న్యాయం చేయాలంటూ ఈరోజు సుగాలి ప్రీతి తల్లి.. హోం మంత్రి అనితను కలిసి విన్నవించుకున్నారు.

వీడని మిస్టరీ..

2017 నాటికి కర్నూలులో నగర శివారులోని కట్టమంచి రామలింగా రెడ్డి పాఠశాలలో చదువుతోంది ప్రీతి. ఆ చిన్నారి ఆకస్మికంగా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సుగాలి ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందంటూ స్కూలు యాజమాన్యం పేర్కొంది. కానీ తమ కుమార్తెను స్కూలు కరెస్పాండెంట్ కుమారులు అత్యాచారం చేసి హతమార్చారంటూ ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన 2017లో జరిగగా ఇప్పటికి కూడా అపరిష్కృతంగానే మిగిపోయింది. అప్పటి నుంచి తమ కూతురుకు న్యాయం కోసం ఆ తల్లిదండ్రులు పోరాడుతూనే ఉన్నారు. మధ్యలో ప్రభుత్వాలు మారుతున్నా వారు తమ పోరాటాన్ని ఆపలేదు.

జీవో ఇచ్చిన వైసీపీ సర్కార్..

అయితే సుగాలి ప్రీతి హత్యాచార కేసును పరిష్కరిస్తామని గత వైసీపీ ప్రభుత్వం జీవో కూడా అందించింది. 18 ఫిబ్రవరి 2020న కర్నూలుకు విచ్చేసిన ఆనాటి సీఎం వైఎస్ జగన్.. సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగానే ప్రీతి కేసును సీబీఐకి అప్పగించి.. పరిష్కారమయ్యేలా తమ ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. సీఎం హామీ మేరకు ప్రభుత్వ కార్యదర్శి కుమార్ విశ్వజీత్‌ ద్వారా జీవో 37ను జారీ చేయించి.. కేసును సీబీఐకి అప్పగించారు. సీబీఐ రంగంలోకి రావడంతో తమ కూతురుకు న్యాయం జరుగుతుందని భావించిన తల్లిదండ్రులకు చివరకు మళ్ళీ నిరాశే మిగిలింది. తమ పోరాటంలో మరో ప్రయత్నంగా హోంమంత్రిని కలిశారు. కాగా వారికి తప్పకుండా న్యాయం జరిపిస్తామని హోంమంత్రి అనిత హామీ ఇచ్చారు.

టిష్యూ పేపర్ అయిన జీవో

ఈ సందర్భంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి మాట్లాడుతూ ఆక్రోశానికి లోనయ్యారు. ‘‘మా కూతురుకు న్యాయం అందించడం కోసం ఏడేళ్లుగా పోరాడుతున్నాం. గత ప్రభుత్వం న్యాయం చేస్తామంటూ ఇచ్చిన జీవో.. టిష్యూ పేపర్‌తో సమానమని అధికారులు చెప్పడం మమ్మల్ని ఎంతో డిప్రెషన్‌కు గురి చేసింది. కానీ పవన్ కల్యాణ్ హామీతోనే మాలో కొత్త ఆశ మొదలైంది. మాకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం బలపడింది. గత ప్రభుత్వం అబద్దపు జీవోలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసింది’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఈ కేసును సీఐడీకి అప్పగిస్తామని, సీఐడీ చీఫ్ రవిశంకర్ స్వయంగా ఈ కేసును హ్యాండిల్ చేస్తారని హోం మంత్రి అనిత వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రీతికి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News