జగన్ ను కారు దిగనివ్వని చిత్తూరు ఎస్పీ

బంగారుపాలెంలో పోటెత్తిన అభిమానం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-09 06:43 GMT
చిత్తూరు జిల్లా బంగారుపాళెంకు చేరిన వైఎస్. జగన్

మామిడి రైతులను పరామర్శించడానికి చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు వైసిపి అధినేత వైఎస్ జగన్ బుధవారం ఉదయం 11.45 గంటలకు చేరుకున్నారు. నిర్ణీత సమయానికి ఆయన 45 నిమిషాలు ఆలస్యంగా రావడం కూడా జనం భారీగా హాజరు కావడానికి అవకాశం కల్పించింది.

హెలిపాడ్ నుంచి వైయస్ జగన్ వాహనంలో అభిమాన సందోహం మధ్య బయలుదేరారు. బంగారు పాలెం వద్ద వైసీపీ కార్యకర్త ఒకరు గాయపడ్డారు. గమనించిన వైయస్ జగన్ వెంటనే కారు దిగేందుకు ప్రయత్నించారు.

చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు స్పందించారు.
"సార్ మీరు కారు దిగవద్దు. లోపలే కూర్చోండి" అని వైయస్ జగన్ చిత్తూరు ఎస్పీ మణికంఠ సూచించారు.
"నా కార్యకర్త పై దాడి జరిగితే ఇవ్వకుండా ఉంటానా /" అని జగన్ ఘాటుగా స్పందించారు.
సార్ ఎవరు దాడి చేయలేదు. తోపులాటలో కింద పడినట్టు ఉన్నాడని సరి చెప్పడానికి ఎస్పీ ప్రయత్నించారు.
దీనికి ఏమాత్రం అంగీకరించని వైయస్ జగన్ కార్యకర్తను పరామర్శించాల్సిందేనని పట్టుపట్టారు.
లేదు సార్.
గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి పంపించాము. అతనిపై ఎవరో దాడి చేయలేదని వివరించడంతో జగన్ శాంతించారు.
ఈ చర్చ జరిగే సమయంలో జగన్ కాన్వాయ్ ముందుకు కదలకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పరిస్థితిని చక్కదిద్దారు.
ఆంక్షలు..
చిత్తూరు జిల్లా లో తోతాపురి రకం మామిడికాయలు ధరలు దగా చేయడంతో రైతులు దిగాలు పడ్డారు. వారిని పరామర్శించడం కోసం వైయస్ జగన్ బంగారుపాలెం కు వచ్చారు. వారం క్రితమే నిర్ణయించిన కార్యక్రమం కావడంతో పోలీసులు కూడా అప్రమత్తమై, ఆంక్షలు విధించారు.
బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వైయస్ జగన్ బంగారుపాలెం కు సమీపంలోని కొత్తపల్లి వద్ద హెలిపాడ్ లో దిగారు. ఇక్కడ వైయస్ జగన్కు స్వాగతం పలకడానికి వైసిపి నాయకులు 30 మందికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.
ఇక్కడికి వెళ్ళిపోయాడు వద్దకు వైసిపి జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్, ఎమ్మెల్సీ భరత్, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, వెంకట గౌడ (పలమనేరు), పలమనేరు వైసిపి నేత రాకేష్ రెడ్డి, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి తోపాటు కీలక నాయకులందరూ హాజరయ్యారు. ఆ ప్రాంతాల నుంచి కూడా భారీగానే జన సమీకరణ జరగడం గమనార్హం.
వైసిపి చీఫ్ జగన్ హెలికాప్టర్ నుంచి దిగగానే జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు ఆంక్షలు అధిగమించి దూసుకుపోయారు. జగన్ను పలకరించడం, కరచాలనం చేయాలని, దగ్గరగా చూడాలనే వారి అభిమానం ముందు ఆంక్షలు ఏ మాత్రం పనిచేయలేదు.
జగన్ ప్రయాణించే వాహనం వద్ద సెక్యూరిటీ పటిష్టంగా ఏర్పాటు చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా వైసిపి ఏర్పాటు చేసుకొని వారిని కూడా మోహరించింది. ఈ పరిస్థితుల్లో జాతీయ రహదారి పక్కన హెలికాప్టర్ దిగగానే అభిమానం కట్టలు తెంచుకుంది. మూ కుమ్మడిగా జగన్ వాహనం వద్దకు భారీగా దూసుకుపోయారు.
మార్కెట్ యార్డు వద్ద కూడా..
బంగారు పాలెం లోని మామిడికాయల ప్రైవేటు మార్కెట్ యార్డు వద్ద కూడా భారీగా జన సందోహం కనిపిస్తోంది. ఆ రైతులు లోపలికి వెళ్లడానికి పోలీసులు అభ్యంతరం చెబుతుంటే, మామిడికాయలను విక్రయించడానికి వచ్చామని కొంతమంది పత్రాలు చూపించిన తర్వాత కానీ లోపలికి అనుమతించలేదు.
ఇదిలా ఉంటే..
వైయస్ జగన్ రైతులతో మాట్లాడే సందర్భంగా చూడాలని  వైసీపీ శ్రేణులు మామిడికాయల మార్కెట్ యార్డ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నాయి. ఇక్కడ కూడా పోలీసుల ఆంక్షలు ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అభ్యంతరం చెబుతున్న పోలీసులను కూడా ధిక్కరించి వైయస్ జగన్ కు దగ్గరగా ఉండాలని మార్కెట్ యార్డ్ లోకి దూసుకుపోయారు. బంగారుపాలెం మార్కెట్ యార్డ్ వద్ద దాదాపు 600 మందికి పైగానే పోలీసులను మోహరించారు.
నీ సంగతేంది..
ఆంక్షలు మధ్య చిత్తూరు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విజయానంద రెడ్డి బైక్ లో బంగారుపాలెం కు బైక్ లో వెళ్లారు. రోడ్డుపై వెళ్తున్న ఆయనను పోలీసులు చెక్పోస్ట్ వద్ద ఆపడంతో విజయానంద రెడ్డి వాగ్వాదానికి. దీంతో పోలీసులు విజయనగంద్ రెడ్డి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంతో పార్టీ శ్రేణులు భారీగా అక్కడ చుట్టుముంటాయి. దానికి అధికారుల వారికి నచ్చచెప్పి అక్కడి నుంచి పంపించారు.

Similar News