108లకు చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది

కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు.

Update: 2025-09-22 16:37 GMT

ప్రజల ప్రాణలకు భరోసా ఇచ్చే 108 అంబులెన్స్‌ సర్వీసులకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోందని మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. 108 అంబులెన్స్‌ సకాలంలో రాక శిశువు మృతి చెందడంపై ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన సోమవారం సోషల్‌ మీడియా వేదికగా స్పందించారు. వీడియోను కూడా ఎక్స్‌ వేదికగా షేర్‌ చేశారు.

కుయ్‌.. కుయ్‌.. మూగబోతోంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ప్రజల ప్రాణాలకు భరోసా ఇచ్చే 108 సర్వీసులకు కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఉరివేస్తోంది. పాడేరు సమీపంలోని ముల్లుమెట్టకు చెందిన నిండు గర్భిణీని ఆస్పత్రికి తరలించేందుకు 108 రాకపోవడంతో ఆటోను ఆశ్రయించాల్సి వచ్చింది. చివరకు ఆటోలోనే ప్రసవం జరిగింది. వైద్యం అందక ఆటోలోనే శిశువు మరణించింది.
తమ వైసీపీ ప్రభుత్వ హయాంలో అంబులెన్స్‌లు, పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌చేసిన 15 నిమిషాల్లోగా 108 రావాలన్న నిబంధన ఉంటే, దాన్ని అధిగమిస్తూ 12–14 నిమిషాల్లోనే చేరుకునేవి. గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, 16–17 నిమిషాల్లోనూ, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో చేరుకోవాలని నిబంధన ఉంటే, దీన్నికూడా అధిగమిస్తూ 22.12 నిమిషాల్లోనే చేరుకుని 108లు సేవలందించాయి. మరి ఎందుకు ఇప్పుడు చేరుకోవడంలేదు? ఫోన్‌ చేసినా ఎందుకు రావడంలేదు? ప్రభుత్వం అన్నది పనిచేస్తేనేకదా! కలెక్షన్ల మీద తప్ప ప్రజలమీద ధ్యాస ఉంటేకదా! అంటూ సీఎం చంద్రబాబును, కూటమి ప్రభుత్వంపైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.

Tags:    

Similar News