చంద్రబాబు ’కాఫీ కబుర్లు‘
తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సరికొత్త రీతిలో ఉల్లాసం, ఉత్సాహం నింపేందుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలకు ఆయన తగిన సమయం వెచ్చిస్తూ రెండింటిని సమతుల్యం చేస్తూ వస్తున్నారు. ఎన్నడు లేని విధంగా 2024 ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చారు. అందులో భాంగా ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలనికి వెళ్లి టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతూ, వారి వినతులను స్వీకరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ’కాఫీ కబుర్లు‘ పేరుతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో గురువారం తెలుగు తమ్ముళ్లతో కాఫీ తాగుతూ ఉల్లాసంగా గడిపారు. అక్కడ ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.