దువ్వాడ మాధురి.. మందు పార్టీకి వెళ్లి బుక్ అయిన దంపతులు

వివాదాలకు మారుపేరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి లవ్‌బర్డ్స్‌ మరోసారి చిక్కుల్లో పడ్డారు..

Update: 2025-12-12 05:00 GMT
Duvvada Madhuri and Srinivas
దువ్వాడ మాధురి.. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదూ.. కరెక్టే. ఆమధ్య బిగ్ బాస్ లో వైల్డ్ ఎంటీ ఇచ్చి అంతే తొందరగా బయటకు వచ్చిన ఈమె ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఏపీ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ ను రెండో పెళ్లి చేసుకుని కలకలం రేపిన ఈమె ఏది చేసినా సంచలనమే. ఇప్పుడు కూడా సరిగ్గా అలాంటి వివాదంలో చిక్కి దంపతులు (Duvvada Madhuri) ఇద్దరూ అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు.

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ఉన్న ది పెండెంట్‌ ఫామ్‌ హౌస్‌పై రాజేంద్రనగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
ఫామ్‌ హౌస్‌లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ (Duvvada Srinivas) ప్రధాన అనుచరుడు పార్థసారథి పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆయనది అమలాపురం. బర్త్‌డే పార్టీలో దువ్వాడ శ్రీనివాస్‌, ఆయన భార్య మాధురి కూడా పాల్గొన్నారు. శుక్రవారం మాధురి పుట్టిన రోజు కూడా కావడంతో పార్థసారథి పేరుపై ఫామ్‌హౌస్‌ను బుక్‌ చేసినట్లు తెలుస్తున్నది. ఈ కార్యక్రమానికి 29 మంది వచ్చినట్లు సమాచారం. అయితే అనుమతి లేకుండా మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంలో స్థానిక పోలీసులతో కలిసి రాజేంద్ర నగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 10 స్కాచ్‌ బాటిళ్లు, ఐదు హుక్కా బాటిళ్లు, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదుచేసిన పోలీసులు, వారిని అదుపులోకి తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి జంట గురించి తెలియని వారుండరు. ఇక తాజాగా దివ్వెల మాధురి బిగ్‌బాస్ షోలో పాల్గొని, తన పాపులారిటీని మరింత పెంచుకుంది. ఈ లవ్‌బర్డ్స్‌ గురించి నిత్యం ఏదో వార్త వస్తూనే ఉంటుంది. ఈక్రమంలో తాజాగా దువ్వాడ శ్రీనివాస్ , మాధురిలు ఈ వివాదంలో చిక్కుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్ రాష్ట్రం అమలాపురంకి చెందిన పార్థసారథి అనే వ్యక్తి హైదరాబాద్‌లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి పుట్టిన రోజు సందర్భంగా గురువారం మొయినబాద్ మండలంలోని పెండెంట్ ఫార్మ్ హౌస్‌లో పార్టీ నిర్వహించాడు. దీనికి అతని స్నేహితులతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ దువ్వడ శ్రీనివాస్, మాధురిలని ఆహ్వానించాడు. అనుమతి లేకుండా మద్యంతో నిర్వహిస్తున్న బర్త్ డే పార్టీ పై రాత్రి రాజేంద్రనగర్ SOT పోలీసులకు సమాచారం అందింది. వారు ఫామ్‌హౌస్‌పై దాడి చేశారు.
Tags:    

Similar News