భూములివ్వకపోతే, ఆమరావతిని అకాశంలో కట్టాల్నా...

రైతులకు చంద్రబాబు సూచన

Update: 2025-10-13 09:37 GMT

భూములు ఇవ్వకపోతే, ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్కడ కట్టాలి, ఆకాశంలో కట్టలేము, ఏ ప్రాజెక్ట్‌కైనా భూమి అవసరం” ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

చాలామంది నాకు 50 లేదా 100 ఎకరాల భూమిలో రాజధాని కట్టమని సలహా ఇచ్చారని చెబుతూ అమరావతి ఇక్కడే ఆగిపోతే అది ఒక చిన్న పట్టణంగా మిగిలిపోతుందని అమరావతి ఒకచిన్న మునిసిపాలిటీగా మిగిలిపోకూడదంటే అందుకు తగ్గ మౌలిక సదుపాయాలు అవసరం అని ఆయన పేర్కొన్నారు. దానికి భూములు కావాలని అన్నారు. అమరావతి ఇస్తున్న  అవకాశాన్ని అందిపుచ్చుకుంటే రైతులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారని సలహా ఇచ్చారు.

‘త్వరలో అమరావతి రైతులతో ప్రత్యేకంగా సమావేశం అవుతా...అమరావతి రైతులను మరిచేదే లేదు... ఎలాంటి అనుమానం అక్కర్లేదు.ఒకసారి జరిగిన తప్పుకు రైతులు, నేను, రాష్ట్రం ఎంత నష్టపోయిందో అందరికీ తెలుసు.మళ్లీ అలాంటి తప్పులు జరగకూడదు,’ అని ముఖ్యమంత్రి అన్నారు.


ఈ రోజు ఆయన అమరావతిలో రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) భవనాన్ని ప్రారంభించారు.  అనంతరం అక్కడికి వచ్చిన రైతులతో  చంద్రబాబు నాయుడు ప్రసంగించారు.

ఈ భవనంలో CRDA, అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL), మున్సిపల్ శాఖకు చెందిన అన్ని విభాగాలు కలసి ఉంటాయి. 2024 జూన్‌లో టిడిపి ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి పనులు పునఃప్రారంభమయ్యాయి. ఈ వరవడిలో మొదట తయారయిన భవనం ఇదే. ‘సీఆర్డీఏ భవనం ప్రారంభం మన అభివృద్ధి యాత్రకు ఆరంభం,’ అని చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడి సమ ావేశమయిన రైతులనుద్దేశించి మాట్లాడుతూ సైబరాబాద్ నగరాన్ని తాను ఎలా అభివృద్ధి చేసింది ముఖ్యమంత్రి చెప్పారు. ‘సైబరాబాద్ ను నిజాం కట్టలేదు, నేను కట్టాను,’ అని ఆయన అన్నారు.

సీఆర్డీఏ అడ్మినిస్టేటివ్ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఉంటుంది. రాజధాని నిర్మాణ పనుల సీసీ కెమెరాల ద్వారా ఇక్కడి నుంచి కూడా పర్యవేక్షించ్చవచ్చు. వీటితో పాటు డ్రోన్ల ద్వారా సాయంతో కూడా నిర్మాణాలుజరుగుతున్న ప్రాంతాల మీద నిఘా వేస్తారు. భవిష్యత్తులో అమరావతి నగరంలో పారిశుద్ధ్యం, వరదలు, ట్రాఫిక్, భద్రత, వాతావరణం, తదితరా అంశాలను కూడా కంట్రోల్‌ రూమ్‌ నుంచే పర్యవేక్షిస్తారు. దీని కోసం ఒక కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశారు. 


అనాడు హైటెక్ సిటిని తాను ప్లాన్ చేస్తున్నపుడు హైదరాబాద్ పరిస్థితులు వేరుగా ఉన్నాయని భూములు సమృద్ధిగా ఉన్నాయని ఆయన వివరించారు.

“అమరావతితో పోలిస్తే, అప్పట్లో హైదరాబాద్‌లో ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి.  హైటెక్ సిటి ప్రాంతమంతా నిజాం ఆ గుర్రాల మేతభూమిగా ఉండిడి. నైజాం భారత్ లో విలీనం అయ్యాక చాలా మంది హైదరాబాద్‌ను వదిలి పాకిస్తాన్‌కి వెళ్లిపోయారు, వారి భూములు ఖాళీగా మిగిలాయి.దానికి తోడు ఆ ప్రాంతంలో ఎంతో ప్రభుత్వ భూమి ఉండేది.  నేను ఆ భూములన్నీ సేకరించి ఇటుక ఇటుక పేర్చి సైబరాాబాద్ ను నిర్మించాను. రాజధాని నిర్మాణంలో  నాకు ఆ అనుభవం ఉంది,” అని ఆయన చెప్పారు.

అమరావతిని “స్వయంసమృద్ధ ఆర్దిక వ్యవస్థగా  ”గా పేర్కొంటూ “నేను అమరావతి కట్టేందుకు ఖజానా నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయడం లేదు,” అని స్పష్టం చేశారు. 



“నన్ను విమర్శించే వారందరికి ఒక విషయం చెబుతున్నాను. — మీరు ఎప్పుడూఅలా  విమర్శిస్తూనే ఉంటారు. నేను ఇలా ముందుకు పోతూనే ఉంటాను. ఆరోజు కూడా ఉమ్మడి రాష్ట్రం లో ఉంటూ ఆధునికి హైదరాబాద్‌ ను నిర్మిస్తున్నపుడు   ప్రభుత్వ డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. నా సొంత తెలివితో భవనం మీద భవనం కట్టాను, దాంతో పన్నులు స్వయంగా పెరిగాయి,” అని అన్నారు. 


ఎన్‌డీఏ ప్రభుత్వం భవిష్యత్తులో  అధికారంలో కొనసాగడం చాలా ముఖ్యమని చెబుతూ  భారతదే

వంలో 2047 నాటికి ప్రపంచంలో నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థ అవుతుంది, ఆ ప్రగతికి ఆంధ్రప్రదేశే ఇంజిన్ అవుతుంది  అని అన్నారు.

గ్రీన్  అమరావతి  రాజధాని నిర్మాణం కోసం భూమి సమీకరణ పథకంలో పాల్గొన్న రైతులు కూడా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Tags:    

Similar News