దేశంలో సీనియర్‌ మోస్ట్‌ సీఎం చంద్రబాబే.. అయినా సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్ట లేదు.. ఎందుకని?

ఎన్నికలో గెలిచి అధికారంలోకి వచ్చిన ఏ ప్రభుత్వమైన సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం సర్వసాధారణం. దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఇదే ఇంత వరకు జరుగుతూ వచ్చింది. సీఎం చంద్రబాబు దీనిని తిరగ రాశారు.

Update: 2024-07-27 13:25 GMT

నాది 45 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం. 1978లో తొలి సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను. 1980లో మంత్రిని అయ్యాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఇప్పుడు దేశంలో నేనే సీనియర్‌ నాయకుడిని. నా తర్వాత వచ్చిన నాయకులే ఇప్పుడున్న వాళ్ళంతా. దేశంలోని ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులందరూ నా తర్వాత వచ్చిన వాళ్ళే. అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాల్లో స్వయంగా ప్రకటించుకున్నారు. అంత సుదీర్ఘ రాజకీయ అనుభం, పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సాధారణ బడ్జెట్‌ను ఎందుకు ప్రవేశ పెట్టలేదనేది సర్వత్ర చర్చనీయాంశంగా మారింది.

అవును ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కంటే రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నర్శిపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు సీనియర్‌ నేతలు. చింతయాల అయ్యన్నపాత్రుడు ప్రస్తుతం అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నారు. ఆయన ఎన్టీఆర్‌తో పాటు 1983లో రాజకీయాల్లో ఆరంగేట్రం చేశారు. ప్రోటెం స్పీకర్‌గా వ్యవహరించిన గోరంట్ల బుచ్యయ్య చౌదరి కూడా ఎన్టీఆర్‌ పిలుపు మేరకు 1983లో రాజకీయాల్లోకి వచ్చిన నేత. వీరిద్దరి కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీనియర్‌ నాయకుడు. యువజన కాంగ్రెస్‌ నేతగా రాజకీయాల్లోకి ప్రవేశించిన చంద్రబాబు నాయుడు 1978లోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండేళ్ళ తర్వాత 1980లో మంత్రి అయ్యారు. నాటి నుంచి నేటి వరకు ఎమ్మెల్యేగా గెలుస్తూనే ఉన్నారు. పలు మార్లు మంత్రిగా పని చేశారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రస్తుతం నాలుగో సారి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన అనుభవం ఉంది. ముఖ్యమంత్రిగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టించిన అనుభవం చంద్రబాబుకు ఉంది.
ఎన్నికల అనంతరం ఏర్పడిన ఏ ప్రభుత్వమైనా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ కాలం పూర్తి అయిన తర్వాత సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెట్టాలనే విషయం చంద్రబాబుకు తెలియకుండా ఏమీ ఉండదు. ఏళ్ళ తరబడి చంద్రబాబు చేస్తూ వస్తున్నదే. ఇదేమీ కొత్త ప్రక్రియేమీ కాదు. పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం అనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మకతకు, రాష్ట్ర గౌరవానికి సంబంధించిన విషయం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారి 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వంలో కూడా ఇదే చేశారు. తర్వాత 2019లో వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కూడా ఇదే సంప్రదాయాన్ని కొనసాగించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే విధానాన్ని పాటించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే అనుసరిస్తుంది. దేశ చరిత్రలో కానీ, ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కానీ సాధారణ బడ్జెట్‌కు బదులుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన దాఖలాలు లేవు. దీనికి భిన్నంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరించారు. ఎన్నడూ లేని విధంగా వ్యవహరించారు. ఇంత రాజకీయా, పాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టకుండా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ వైపు మొగ్గు చూశారనే అప్రతిష్టలు మూటగట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు ఎక్కువ కావాలి. దాదాపు రూ. 1.25లక్షల కోట్లు అవసరం. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి బాగ లేదు. సాధారణ బడ్జెట్‌ ప్రవేశ పెడితే హామీల పథకాలకు నిధులు చూపించాలి. ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌కైతే నిధులు, పథకాల సమస్యలు తలెత్తవు. ఈ నేపథ్యంలో ఐదు రోజుల పాటు జరిగిన అసంబ్లీ సమావేశాల్లో దీని ప్రస్తావన తేలేదు. దీంతో సాధారణ బడ్జెట్‌కు బదులుగా ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదింప చేసుకున్నారనే విమర్శలు మేధావి వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ తతంగం నుంచి బయట పడేందుకు, ప్రజల దృష్టిని మళ్ళించేందుకు శ్వేత పత్రాలు అంశాన్ని తెరపైకి తెచ్చారని, తమ ప్రభుత్వ పాలనపై విమర్శలు ఎక్కు పెట్టారని మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం విమర్శించారు. సాధారణ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టేది చంద్రబాబు నాయుడుకు చేత కాకనే తమపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.
Tags:    

Similar News