తెలుగు రాష్ట్రాలకు రూ.3,300 కోట్లు ప్రకటించిన కేంద్రం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా పడిన వర్షాలు, వరదలతో అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

Update: 2024-09-06 13:04 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగండం కారణంగా పడిన వర్షాలు, వరదలతో అతలాకుతలమయ్యాయి. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఎక్కడిక్కడ జనజీవనం నిలిచిపోయి ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం.. రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ సహాయం ప్రకటించింది. వరద ప్రభావం నుంచి తేరుకోవడం కోసం రెండు రాష్ట్రాలకు రూ.3,300 నిధులను విడుదల చేసింది ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం. వరదల వల్ల కలిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహార్.. రెండు రాష్ట్రాల్లో పర్యటించారు. పలువురు ఉన్నతాధికారులు, మంత్రులతో చర్చలు జరిపారు. అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి, ప్రభుత్వాలు అందించిన వివరాల ప్రకారం కేంద్రం సహాయం అందిస్తుందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాలకు అన్ని విధాలా కేంద్రం సహాయం తప్పకుండా ఇస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. శుక్రవారం తెలంగాణలో పర్యటించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. సెక్రటేరియట్‌లో నిర్వహించిన వరద నష్ట ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో బెజవాడ వరద సహాయంపై కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి కేంద్ర ఏవియేషన్ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు కీలక విషయాలు వెల్లడించారు.

ఆ తర్వాత కేంద్ర సహాయం..

రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ మొత్తంలో వరద సహాయం ప్రకటించింది. ఈ నేపథ్యంలో బెజవాడకు అందించిన సహాయంపై రామ్మోహన్నాయుడు స్పందించారు. వరద నష్టాలపై కేంద్రం ఇంటర్ మినిస్ట్రియల్ సర్వే నిర్వహించిందని, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతే బెజవాడ వరద సహాయంపై ఒక నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. అనంతరం వరదలపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి విపత్కర సమాయాల్లో కూడా వైసీపీకి రాజకీయాలే తప్ప మరేమీ పట్టకపోవడం బాధాకరమన్నారు. ‘‘వరదలు వచ్చి ప్రజలు నానా అవస్థలు పడుతున్న సమయంలో ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయంలో రాజకీయాలు చేయడం గురించే మాజీ సీఎం జగన్ ఆలోచించడం దారుణం. అసబద్దమైన విమర్శలు చేయడం మరీ దారుణం. జగన్‌ను చూస్తే ప్రజలు భయపడే పరిస్థితులు వచ్చాయి’’ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు ఏరియల్ సర్వే

ఇదిలా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే చేపట్టారు. బుడమేరు కట్ట తెగిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. బుడమేరు ప్రవాహాన్ని, బుడమేరు ఆక్రమణలను ఆయన నిశితంగా పరిశీలించారు. బుడమేరు గండ్లు, వాటిని పూడ్చడానికి చేపట్టిన పనులను కూడా ఆయన పరిశీలించారు. గండ్ల పూడ్చివేత పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు అంతా కూడా అంకిత భావంతో పనిచేస్తున్నారని, కుండపోత వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా వాళ్లు వారు పనులు చేయడం హర్షనీయమన్నారు.

Tags:    

Similar News