తిరుపతి || భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదు..!
టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు భూమనపై కేసు నమోదు;
By : Dinesh Gunakala
Update: 2025-04-18 04:44 GMT
టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిపై (Booman Karunakar Reddy) తిరుపతి ఎస్వీయూ పోలీసులు కేసు నమోదు చేశారు.
టీటీడీ గోశాలపై అసత్య ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి (Bhanu Prakash Reddy) ఎస్పీ హర్ష వర్ధన్ రాజుకు ఫిర్యాదు చేశారు. ఎస్వీ గోశాలలో (TTD Gosala) 100 ఆవులు మృతిచెందాయని. పవిత్రమైన గోశాలను గోవధ శాలగా మార్చారంటూ భూమన తప్పుడు ఆరోపణలు చేశారని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి (Bhanu Prakash Reddy) మంగళవారం నాడు చేసిన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు భూమనపై బీఎన్ఎస్ యాక్ట్ 353(1), 299, 74 వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది