ప్రజలను ఆకట్టుకోలేక పోయిన ప్రచారాలు

ఎపిలో జరిగిన ఎన్నికల ప్రచారాలు ఓటర్లను ఆకట్టుకోలేక పోయాయి. అన్ని పార్టీలు ఉచితంగా డబ్బులు ఇచ్చే పథకాలను ప్రకటిస్తూ అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Update: 2024-05-11 16:02 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆయా పార్టీల ప్రసంగాలు, మ్యానిఫెస్టోలు ఓటర్లను పెద్దగా ఆకట్టుకోలేదు. వైఎస్సార్సీపీ కొత్తగా మ్యానిఫెస్టోను తీసుకు రాలేదు. గతంలో పథకాలు కొనసాగిస్తామని చెబుతూ ఐదేళ్లలో ఎవరికి ఎంత డబ్బు సాయం చేశారో చెప్పారు. ఐదేళ్లుగా ప్రజలను మోసం చేస్తూ అభివ్రుద్ధి లేకుండా జగన్ చేశాడని ప్రచారం చేసిన తెలుగుదేశం మిత్రపక్షాలు సైతం వారు ఇచ్చిన మ్యానిపెస్టోలో అభివ్రుద్ధి గురించిన ప్రస్తావన లేకపోవడం విశేషం. ఇక బిజెపి, కాంగ్రెస్ లు కూడా ఇదే విధమైన ఉచిత వాగ్దానాలే చేసింది. రాష్ట్రం అప్పుల పాలవుతుందనే విషయాన్ని ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలిగారు. ఎవరు అధికారంలోకి వచ్చినా పెద్దగా ఒరిగేది ఏదీలేదనే భావనకు వచ్చారు. గుడ్డిలో మెళ్ల మేలనే సామెత ఉంది. దీనిని పాటించాలనే నిర్ణయానికి జనం వచ్చారు. సోమవారం జరిగే ఎన్నికల్లో ఒకే పార్టీకి పూర్తి ఆధిక్యత ఇచ్చేవైపుగానే ఓటర్లు అడుగులు వేస్తున్నారు. తమ అభిప్రాయాలు బయటకు చెప్పేందుకు అంగీకరించడం లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా అమరావతి రాజధానిని నిర్మించే అవకాశం లేదని, లక్షల కోట్లలో అప్పులు చేసిన ప్రభుత్వాలు ఎలా రాజధాని కడతాయని విశాఖపట్నం టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి మతుకుమిల్లి శ్రీభరత్ వ్యాఖ్యానించడం విశేషం. అందుకే అన్ని వనరులు ఉన్న విశాఖను రాజధాని చేయడమే మంచిదన్నారు. అక్కడి ప్రజల మనసులు గెలుచుకోవడానికి చెప్పాడా? లేక మనస్ఫూర్తిగా చెప్పారా? అనేది కూడా చర్చకు దారి తీసింది.

కేవలం ఉచితాలను ప్రజలందరూ పూర్తిగా స్వాగతించడం లేదు. నిరుపేదలకు మాత్రం ఈ పథకాలు బాగా ఉపయోగపడ్డయి. ఈ విషయాన్ని చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. అయితే కేవలం సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని అనుకోవడం కూడా పొరపాటేనని పలువురు రాజకీయ నాయకులు, స్వపార్టీ వారే వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మొత్తం మీద ఎన్నికల ప్రచారంలో రాష్ట్రాన్ని చుట్టేశారని చెప్పొచ్చు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో నాలుగు సిద్ధం సభలు నిర్వహించారు. లక్షల సంఖ్యలో జనం పాల్గొనేలా చేశారు. 86 నియోజకవర్గాల్లో బస్ యాత్ర నిర్వహించారు. 34 చోట్ల మేము సిద్దం అంటూ సభలు నిర్వహించారు. ప్రచారం ముగిసే రోజుల్లో సుడిగాలి పర్యటనలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నిర్వహించిన సభతో జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని ముగించారు.

Delete Edit

తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబునాయుడు 90 ప్రజాగళం సభలు నిర్వహించారు. ఆయన తనయుడు నారా లోకేష్ దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ యువగళం సభలు నిర్వహించారు. చంద్రబాబు భార్య భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో అన్ని జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహించి చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు ఆ బాధను తట్టుకోలేక మతిచెందిన వారి కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థికసాయం అందించారు.

బిజెపి నాయకులు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్ షా వంటి ప్రముఖులు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఎ కూటమి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి మోదీ రాజంపేట, రాజమండ్రి, విజయవాడ, నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో జరిగిన సభలు, రోడ్డు షోల్లో పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నందున అక్కడ ఎక్కువ సమయం తీసుకుని ప్రచారం చేశారు. 21 మంది జనసేన తరపున అసెంబ్లీకి పోటీస్తున్న అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విస్త్రుత ప్రచారం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ వంటి వారు వచ్చి ప్రచారం చేశారు. పదేళ్లుగా ఆంధ్ర ప్రజలు కాంగ్రెస్ వారి ముఖం చూసేందుకు కూడా ఇష్టపడలేదు. అందుకే వారు సమావేశాలు పెట్టినా హాజరు కాలేదు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. ఆమె ఎపిసిసి అధ్యక్షురాలైన తరువాత పార్టీని బలోపేతం చేసే దిశగానే పావులు కదిపారు. ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేశారు. సోదరుడైన వైఎస్ జగన్ ను గుక్కతిప్పుకోకుండా ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. కడప నుంచి ఆమె పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ తరపున అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులను పెట్టి విస్త్రుతంగానే ప్రచారం నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత పథకాలకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News