విజయసాయిరెడ్డి స్థానానికి ఉప ఎన్నిక

వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయసాయిరెడ్డి రాజీనామాతో ఈ స్థానం ఖాళీ అయ్యింది.;

Update: 2025-04-16 05:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఖాళీయ అయిన రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. దాని ప్రకారం ఏప్రిల్‌ 29 వరకు నామినేషన్లు స్వీరకరణ, 30న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. మే 9వ తేదీనా ఎన్నిక నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఎవరు గెలిచారనే విషయాన్ని ప్రకటిస్తారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. గత జనవరిలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

రాష్ట్రం విడిపోయిన తర్వాత, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాల్లోకి విజయసాయిరెడ్డి ఎంట్రీ ఇచ్చారు. అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీలో ఆయన కీలక నేతగా ఎదిగారు. వైఎస్‌ఆర్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కావడంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయసాయిరెడ్డికి అత్యంత ప్రాధాన్యం కల్పించారు. వైఎస్‌ఆర్‌సీపీలో జగన్‌ తర్వాత అత్యంత కీలక నేతగా మారారు. ఢిల్లీ రాజకీయాలు చూసుకుంటూ పార్టీ పనులు చక్కబెట్టే విధంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయసాయిరెడ్డిని ఢిల్లీ బాధ్యతలు అప్పగించాలని నర్ణయించారు. దానికి తగ్గట్టుగా ఆయనకు పెద్ద పీట వేశారు. 
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత 2016లో మొదటి సారిగా వైఎస్‌ఆర్‌సీపీ నుంచి రాజ్యసభకు పంపారు. 2022 ఏప్రిల్‌ 2న రెండో సారి రాజ్యసభకు ఎంపికయ్యారు. 2024 ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు మారి పోయాయి. కూటమి అధికారంలోకి రావడం, వైఎస్‌ఆర్‌సీపీ ఓటమి పాలు కావడంతో ఊహించని రీతిలో మర్పులు చోటు చేసుకున్నాయి. ఇవి వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ మీద బలమైన ప్రభావం చూపాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డి తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా తెరపైకి వచ్చింది. గత జనవరిలో ఆయన తన రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీకి కూడా రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. రాజకీయ నాయకుడిగా ఆయనకు అంత ప్రజా బలం లేకపోయినా.. పార్టీ పరంగా బలమైన నాయకుడు కావడంతో విజయసాయిరెడ్డి రాజీనామా రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద సంచలనంగానే మారింది.
Tags:    

Similar News