విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపులు
రెండు సార్లు బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో విజయవాడ ఒక్క సారిగా ఉలిక్కి పడింది.;
ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ రైల్వేస్టేషన్ అయిన విజయవాడ రైల్వేస్టేషన్‌కు బాంబు బెరింపులు వచ్చాయి. విజయవాడ రైల్వేస్టేషన్‌లో బాంబులు పెట్టాము, త్వరలో పేలుతాయని ఆగంతకులు ఫోన్ చేయడంతో రైల్వే అధికారులు ఒక్క సారిగా ఉలక్కి పడ్డారు. ఫోన్ కాల్‌తో అప్రమత్తమైన పోలీసులు రంగంలోకి దిగారు. రైల్వేస్టేషన్‌లోని ప్రతి అణువును తనిఖీలు చేపట్టారు. క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు స్క్వాడ్‌తో స్టేషన్ అంతా గాలింపులు చేపట్టారు.
స్టేషన్‌లోని 10 ప్లాఫామ్‌లలోను, షాపుల్లోను, ప్రయాణికుల బ్యాగులను, అనుమానాస్పద ప్రదేశాలలోను విస్తృత స్థాయిలో జల్లెడ పట్టారు. అయితే ఎక్కడా కూడా బాంబులకు సంబందించిన ఆనవాళ్లు కానీ, పేలుడుకు సంబంధించిన పదార్థాలు కానీ ట్రేస్‌అవుట్ కాలేదు. దీంతో రైల్వే అధికారులు, పోలీసులు, సిబ్బంది, ప్రయాణికులు, వ్యాపారస్తులు, అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఫోన్ కాల్ మీద దృష్టి పెట్టారు. సాంకేతిక సహకారంతో çపరిశీలించిన సిబ్బంది అది ఒట్టి ఫేక్ కాల్‌గా నిర్థారించారు.