బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆర్థిక, రాజకీయ వైరుధ్యం

ఆర్థిక, రాజకీయ పాలసీల విషయంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల మధ్య పెద్ద తేడాలేమీ లేవు. అందుకు ఇవే ఉదాహరణలు..

Update: 2024-05-06 06:23 GMT

మూలం: టికె అరుణ్ (thefederal.com )

అనువాదం: రాఘవ  శర్మ

బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఆర్థిక వైరుధ్యంతో కూడిన సందేహాస్పదమైన పోలికలున్నప్పటికీ రాజకీయాల్లో, ఆర్థిక విధానాలు నడపడంలో అవసరమైన సామాజిక పొందికలో కూడా విభేదాలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉన్న ఆర్థిక కార్యక్రమాల తేడాల గురించి అవాస్తవాలతో సామాజిక మాధ్యమాలు కొట్టుకుపోతున్నాయి. బీజేపి అభివృద్ధికి అనుకూలంగా ఉంటే, కాంగ్రెస్ పునఃపంపిణీ, సంక్షేమానికి అనుకూలంగా ఉంది. బీజేపీ మార్కెట్ కు అనుకూలమైతే, కాంగ్రెస్ సోషలిస్టు ఆలోచనలకు అనుకూలంగా ఉంది. బీజేపీ.. కుబేరులకు అనుకూలమైతే, కాంగ్రెస్ పేదలకు అనుకూలంగా ఉంది. బీజేపీ భారత శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలనుకున్నప్పటికీ, భారత శాస్త్రీయాభివృద్ధిని పెద్దగా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పెద్ద పన్నుల కోసం నిలబడితే, బీజేపీ తక్కువ పన్నులను వేయాలనుకుంది.

ఒక్కొక్క దాని మధ్య ధ్రువీకరణలు పొరలుపొరలుగా ఉంటే, రెండు పార్టీల మధ్య వైరుధ్యాలతో కూడిన పోలికలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఒక సముద్రంలా వేరు వేరు ఆర్థిక వ్యూహాలుంటే, నిజానికి ఆ రెండిటి మధ్య కాగితం పట్టేంతటి తేడా కూడా లేదు. రాజకీయాల్లోను, ఆర్థిక వ్యవస్థను నిర్వహించడంలోనూ, సామాజిక వ్యవస్థను నిర్వహించడానికి అవసరమైన రూపురేఖలను ఏర్పాటు చేయడంలోనూ కాంగ్రెస్, బీజేపీ మధ్య తేడా ఉంది. బీజేపీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) విధానాలతో ప్రభావితమైంది. జనాభాలో ఉన్న 14 శాతం మందిని వారి దుస్తుల ద్వారా గుర్తు పట్టి, వారి పట్ల ఒక క్రమపద్ధతిలో శతృత్వం పెంచుకుని, ప్రజాస్వామిక వ్యతిరేక వాదనతో నిరంకుశత్వాన్ని సాగిస్తుంది.

విశ్వాసాలతో సంబంధంలేని పౌరసత్వానికి, పౌరుల సమానత్వానికి హిందూ రాష్ట్ర ఏర్పాటు, సంఘపరివార్ ఆలోచనలు అననుకూలమైనవి కావు. ప్రజాస్వామ్యాన్ని పాతరేయడం ద్వారా మాత్రమే భారత దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చగలుగుతారు. మైనారిటీల కోసం మాత్రమే కాకుండా అందరి కోసం ఇలా చేయాలన్నది వారి ఉద్దేశ్యం. రెండు రాజకీయ పార్టీల ఆర్థిక విధానాలను పరిశీలిద్దాం..

కాంగ్రెస్ సోషలిస్టా?

కాంగ్రెస్ నిజంగా సోషలిస్టా? నెహ్రూ సామ్యవాద తరహా సమాజమని చెపుతూ ఆర్థిక విషయాల్లో ప్రభుత్వ రంగానికి పై చేయి సాధించారు. బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరా గాంధీ రాజ్యాంగ ఉపోద్గాతంలో ‘సోషలిజం’ అన్న పదాన్ని చేర్చింది.

కాబట్టి కాంగ్రెస్ కచ్ఛితంగా సోషలిస్టేనా ?

ప్రజలకు ఏం చెపుతున్నారన్నది కాదు, వారికి ఏం చేస్తున్నారన్నది ముఖ్యం. కొలంబస్ అమెరికాను కనుగొన్నందుకు కాదు, భారతదేశాన్ని కనుగొన్నందుకు అభినందించాలి. స్పెయిన్ రాజు, రాణి ఆదేశించడం వల్ల కొలంబస్ పశ్చిమం నుంచి ఓడలో ప్రయాణిస్తూ తూర్పున ఉన్న భారత దేశానికి చేరాలనుకున్నాడు. బహమాస్‌లో దిగి అదే భారత దేశం అనుకుని, అక్కడి స్థానికులను భారతీయులనుకున్నాడు. ఇది అసలైన భారతీయులకు గందరగోళంగా అనిపించింది. కాంగ్రెస్‌కు ఆ గొప్పతనాన్ని ఆపాదించదలుచుకున్నట్టయితే, సోషలస్టు వ్యవస్థను నిర్మించకుండా, భారత పెట్టుబడిదారులను నిర్మించింది.

నెహ్రూ విధానాలు

విదేశాలలో ఉండే వారు పెట్టే దేశీయ పరిశ్రమలకు నెహ్రూ రక్షణ కల్పించి, ఎక్కువ సుంకంతో దిగుమతులపైన ఆంక్షలు విధించారు. ప్రైవేటు రంగ పరిశ్రమల ఉత్పత్తుల అవసరాల కోసం ప్రభుత్వ రంగ వ్యయాన్ని సృష్టించారు. భారత పెట్టుబడిదారులు ఉత్పత్తి చేసుకోలేని స్టీల్, యంత్రపరికరాల వంటి అవసరమైన మౌలిక సదుపాయాలను నిర్మించారు. వాటికి పారిశ్రామిక ఉత్పత్తుల అవసరానికి మించిన రక్షణను కల్పించారు. ఇది వ్యవసాయానికి వ్యతిరేకమైన వాణిజ్యంగా తయారైంది. ఒక బస్తా రసాయనిక ఎరువులు కొనడానికి, రెండు బస్తాల ధాన్యం అమ్ముకోవడానికి బదులు అయిదు బస్తాల ధాన్యాన్ని అమ్ముకోవలసి వచ్చింది.

పరిశ్రమలకు పెట్టుబడిని కల్పించడానికి వ్యవసాయ మిగులును పరిశ్రమలకు బదిలీ చేయాల్సి వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం ఐఎఫ్‌సీఐ, ఐసిఐసి, ఐడిబై వంటి సంస్థలను ఏర్పాటు చేసింది. ప్రజలు దాచుకున్న సొమ్మును కొంత కాలపరిమితి వరకు తమ దగ్గర డిపాజిట్ చేసేలా సేకరించడానికి బ్యాంకులను ప్రోత్సహించింది. వాటికి సేవింగ్ బ్యాంక్ అని పేరు పెట్టి ఆ డబ్బుకు బాండ్లను జారీ చేసింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి బదిలీ చేసింది.

‘టాటా బిర్లా ప్రభుత్వం’

బందీ అయిన మార్కెట్‌ను ఇవ్వడం ద్వారా పెట్టుబడిదారి వర్గాన్ని బాగా ఎదిగేటట్టు చేయడం, పెట్టుబడిని కుమ్మరించడం, సరుకు కోసం ఒత్తిడి చేయడం, ప్రభుత్వ నిర్వహణలోని సంస్థల్లో మనుషులకు సాంకేతికంగా, యాజమాన్య వ్యవహారానికి శిక్షణ ఇవ్వడం సోషలిష్టు విధానం! బహుశా ఇది కాంగ్రెస్ తరహా సోషలిజం అయి ఉండవచ్చు. కాంగ్రెస్ చెప్పే సోషలిజం మాటలను ఏ మాత్రం నమ్మని ఆనాడున్న ముఖ్యమైన ప్రతిపక్షం ‘టాటా బిర్లాల ప్రభుత్వం’ అని కుండబద్దలు కొట్టింది. టాటా, బిర్లా, ఇతర పారిశ్రామిక సంస్థలు ఎంతో ఎత్తుకు ఎదిగిపోయాయి. అంబాని లాంటి కొత్త వారు ఎదిగొచ్చారు. రాజీవ్ గాంధీ పాలనా కాలంలో శరద్ పవార్ గురువుగా గౌతం అదానీ బాగా ఎదిగొచ్చాడు.

సరళీకరణ ప్రారంభం

క్రమబద్దీకరణ విధానంలో అన్నీ ఉపయోగించుకుని భారత వాణిజ్య వర్గం ఒకటి ఎదిగింది. సరళీకరణ విధానం తొలుత రాజీవ్ గాంధీ పాలనా కాలోంలోనే మొదలై, తరువాత పి.వి. నరసింహారావు పాలనా కాలంలో పాతుకుపోయింది. భారతదేశం ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యుటీఓ)లో చేరిపోయి, విదేశీ సంస్థల కోసం తలుపులు తెరిచింది. టెలికాం రంగంలో అద్భుతమైన విజయాలతో ప్రైవేటు రంగంలో మౌలిక సదుపాయాలు ప్రారంభమయ్యాయి. తక్కువ ధరలకు రీచార్జి అవకాశాలను చూపుతూ ప్రైవేటు యజమానులు పోటీకి వచ్చారు. తొలి రోజుల్లో బాంబే క్లబ్బును నిలబెట్టిన బీజేపీ ఆర్థిక సంస్కరణలను వ్యతిరేకించింది. ప్రధానిగా అటల్ బిహారీ వాజ్ పాయ్ ఆధ్వర్యంలోనే సంస్కరణలను వేగవంతం చేశారు.

ఆధార్, జీఎస్‌టీని వ్యతిరేకించిన బీజేపీ

కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయన్స్(యూపీఏ) ప్రభుత్వం సామాజిక ప్రాతిపదికగా అభివృద్ధిని విస్తరింప చేసింది. ఉపాధి హామీ, అటవీ హక్కులు, సమాచార హక్కు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఢిల్లీ, ముంబయి ఎయిర్ పోర్టుల విస్తరణ, అత్యాధునిక మెగా పవర్ ప్లాంట్ల ఏర్పాటు వంటివి వాటిని ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటుచేయడం వంటివి గతంలో కంటే పెంచింది. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2009 నుంచి పనిచేయడం మొదలు పెట్టింది. ఆధార్ కార్డులను ప్రవేశపెట్టింది. ఆధార్‌ను, జీఎస్‌టీలను ప్రవేశ పెట్టినప్పుడు బీజేపీ వాటిని వ్యతిరేకించింది.

భారత్‌కు ప్రపంచ స్థాయి

భారతదేశం ప్రపంచ స్థాయికి చేరుకోవడానికి తానే కారణమని బీజేపీ చెపుతోంది. వాస్తవం ఏమిటంటే, అలీన దేశాల నాయకత్వం వహించడం ద్వారా ప్రపంచ వేదికపైన భారతదేశం తన బలాన్ని ప్రదర్శించింది. బంగ్లాదేశ్ విముక్తి సమయంలో, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో ముప్ఫై లక్షల మంది పౌరులను చంపాలని పాకిస్థాన్‌కు అండగా అమెరికా తన నౌకలతో బంగాళాఖాతంలో విన్యాసాలు చేసింది. సోవియట్ యూనియన్ సహకారంతో ఇందిరా గాంధీ.. అమెరికా నౌకాదళ బలగాలు బంగాళాఖాతం నుంచి వెనుదిరిగేలా చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా వియత్నాం, క్యూబా దేశాలు రంగంలోకి దిగాయి.

సోవియట్ యూనియన్ పతనం, చైనా నూతన శక్తిగా ఆవిర్భవించడం వంటి పరిణామాల మధ్య విదేశీ విధానంలో కొత్త అవకాశాలు ఏర్పడ్డాయి. తూర్పు వైపు చూడాలనే విధానాన్ని పి.వి. నరసింహారావు ఏర్పాటు చేశారు. (నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక అప్పటి పరిస్థతులకు అనుకూలంగా మలుచుకోవడానికి ‘తూర్పుననుసరించి వ్యవహరించడం’ అనే విధానాన్ని ప్రవేశ పెట్టారు) చైనా శాంతియుతంగా ఎలా ఎదుగుతోందో గమనించడానికి రెండు బలమైన దేశాల మధ్య భారతదేశం శక్తివంతంగా ఏర్పడింది.

అణు ఒప్పందం

భారతదేశంతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవాలనే ప్రతిపాదనను అమెరికాలోని జార్జిబుష్ పాలనా యంత్రాంగం ఆమోదించింది. ప్రపంచ దేశాల మధ్య భారత దేశానికి ఈ అణు ఒప్పందం అనేది ఒక కీలకమైన మలుపు. అణు పరీక్ష తరువాత భారతదేశం సాంకేతిక పరిజ్ఞానం కొరత లేని దేశంగా తయారైంది. ఆయుధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అదుపు చేసే కూటమిలో భారత దేశానికి సభ్యత్వానికి తలుపులు తెరుచుకున్నాయి. ఖ్వాద్‌లో అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో పాటు భారతదేశానికి కూడా సభ్యత్వం లభించింది. ఏ పార్టీ అయితే అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించిందో, ఇప్పుడు అదే పార్టీ అణు ఒప్పందాన్ని బలంగా సమర్థించేదిగా తయారైంది. బీజేపీ ఈ అణు ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్న దానిపైనా మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది.

ప్రపంచ ఆర్థిక మాంద్యం తరువాత ఆర్థిక సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలను సమన్వయం చేయడంలో భాగంగా జీ20 సదస్సును బుష్ ఏర్పాటు చేశారు. భారతదేశం సహజంగానే అందులో చేరింది. తన వంతు వచ్చే సరికి భారతదేశం అధ్యక్ష బాధ్యతలను కూడా స్వీకరించి, అధ్యక్ష దేశంగా జీ20 సదస్సుకు ఆతిథ్యమిచ్చింది. మార్కెట్ వేగంగా పెరుగుతున్న బ్రెజిల్, రష్యా, చైనా, భారత దేశంతో బ్రిక్స్ దేశాల కూటమి ఏర్పడితే, భారత దేశం 2009లో బ్రిక్స్ దేశాల తొలి సదస్సును నిర్వహించింది. ఆ తరువాత అందులో ఆస్ట్రేలియా కూడా చేరింది. ఇవన్నీ మోడీతోనే మొదలవ్వలేదన్న వాస్తవాన్ని ఆయన అభిమానులు తెలుసుకోవాలి.

శాస్త్ర విజ్ఞానం, పన్నులు

శాస్త్ర విజ్ఞానానికి బీజేపీ అనుకూలంగా ఉందా? భారత అంతరిక్ష సంస్థ(ఇస్రో) రూపాన్ని బీజేపీ మౌలికంగా పునర్నిర్మించాలని భావిస్తోంది. హోమియో బాబా సలహా మేరకు భారత అంతరిక్ష పరిశోధనా కమిషన్ (ఐఎన్ సీ ఓ ఎస్ పీ ఏ ఆర్)ను 1962లో నెహ్రూ స్థాపించారు. భారత అంతరిక్ష పరిశోధనకు నెహ్రూకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. పన్నుల విషయంలో బీజేపీ చాలా ఉదారంగా ఉందా? పి.చిదంబరం 1997లో నిర్ణయించిన వ్యక్తిగత ఆదాయ పన్నును పదిహేనేళ్ళ జోక్యం తర్వాత కూడా బీజేపీ అలాగే కొనసాగిస్తోందా?

పన్ను వర్గీకరణలో కార్పొరేట్ పన్ను ప్రభావం సాధారణ స్థాయిలోనే ఉంటోంది. కానీ మోడీ పాలనలో 21 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. కోవిడ్‌కు ముందు లెక్కింపులో పన్ను తగ్గించారు. పన్ను వారసత్వం ఏమిటి? ఎస్టేట్ వ్యక్తి మరణించాక ఎస్టేట్ పన్ను విధించారు. పన్ను కట్టాక వారసులకు ఏం వదిలినట్టు లేదు. వారసత్వపు పన్ను వారసులు కడతారు. ఇది తప్పు కాదు. దీనిలో సోషలిజం ఏమీ లేదు. బీజేపీ మంత్రి జయంత్ సిన్హా, బీజేపీ కూటమిలో ఉన్న మోహన్ దాస్ పాయ్ భారతదేశంలో ఈ పన్ను విధించడానికి ముఖ్యులు.

పశ్చిమ దేశాలు ఏం చేశాయో

పశ్చిమ పెట్టుబడిదారీ దేశాలు కూడా పన్ను విధించాయి. కానీ అది ఆచరణాత్మకంగా లేదు. ధనికులు తమ సంపదను పెంచుకోడానికి పన్నులను కనీస స్థాయిలో ఉంచారు. అమెరికాలో వీటి కింద చేసే వసూళ్లు స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 0.6 శాతం మాత్రమే. రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1985లో పన్నులను రద్దు చేసింది. భవిష్యత్తులో దాని ప్రభావంతో ఇందిరాగాంధీ ఎస్టేట్ కు పన్ను కట్టకుండా తప్పించుకోవడానికే అని ప్రధాని ఆరోపించడం సరి కాదు. ఇందిరా గాంధీ 1984లోనే హత్యకు గురయ్యారు. భారతదేశంలో అతి తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేశారు.

స్థూల జాతీయోత్పత్తిలో కేవలం 17 శాతం మాత్రమే. ఇది ధనిక దేశాల పన్నులతో పోల్చుకుంటే సగం మాత్రమే. దేశాలు అభివృద్ధి వాటి ఆర్థికాభివృద్ధి చాలా క్లిష్టంగా ఉంటుంది. వ్యక్తిగత జీవితాలు క్లిష్టతరమైన దారితో మరింత చిక్కబడతాయి. ఆర్థిక సహకారం, అభివృద్ధి సంస్థ కోసం స్థూల జాతీయోత్పత్తిలో 46 శాతం కంటే ఎక్కువ. ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్ లలో సాధారణ ప్రభుత్వ వ్యయం స్థూల జాతీయోత్పత్తిలో 57 శాతం కంటే ఎక్కువ. ఐరోపా యూనియన్ సభ్య దేశాల్లో స్థూల జాతీయోత్పత్తిలో 50 శాతం కంటే ఎక్కువ.

పన్నుల అవసరం

భారతదేశం అభివృద్ధి చెందుతుంటే, దేశంతో పాటు స్థూల జాతీయోత్పత్తి కూడా పెరుగుతుంది. పన్ను వసూళ్లు కూడా పెరుగుతాయి. ఉభయులూ దీనిని అంగీకరించాలి. పన్ను వసూళ్లు పెరుగుతుంటే అప్పుడప్పుడు పన్ను తగ్గించాల్సిన అవసరం ఏర్పడుతుంది. పరిపాలనా అభివృద్ధి చెందాలి. పన్ను వసూలు చేయడానికి దానంతట అది ప్రత్యక్ష పరోక్ష పన్నులు వసూలు చేసే జీఎస్‌టీ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం అనుసరించడం లేదు. సరైన కారణం లేకుండానే ఇన్ పుట్ పన్ను వసూలు చేసే విధానం రూపకల్పనలో మోసం ఉంది.

సబ్సిడీల కోసం ఎర

సబ్సిడీల విషయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు సబ్సిడీలను బదిలీ చేయడంలో బీజేపీ దూకుడుగా ముందుకు పోతోంది. అలాంటి సబ్సిడీల కోసమే చాలా మంది బీజేపీకి ఓట్లు వేస్తున్నారు. ఈ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య కొంత తేడా ఉంది. అనేక కార్యక్రమాలను గుమ్మరించడం కంటే మోడీ ప్రభుత్వం విధానాలపైన, ఊరట పైన నమ్మకం పెంచుకుంది. ఈ విధానాలు పతనం చెంది, నోట్ల రద్దు వంటి అస్తవ్యస్తతకుదారి తీసింది. సబ్సిడీలతో సమాంతరంగా పోటీ ఏర్పడి, కొన్ని ఎంపిక చేసిన వాటికోసం తయారీ రంగం విస్తరించింది. భద్రతను క్షీణింప చేస్తోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆర్థిక రంగంలోనే కాదు, రాజకీయ విషయాలలో కూడా తేడా ఉంది.

Tags:    

Similar News