విజయనగరం జిల్లాలో తీవ్ర విషాదం

కారులో చిక్కుకొని నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు అక్కా చెల్లిళ్లు ఉన్నారు.;

Update: 2025-05-18 16:45 GMT

విజయనగరం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కంటోన్మెంట్‌ పరిధిలోని ద్వారపూడి గ్రామంలో కారులో చిక్కుకొని నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం ఉదయం ఏనిమిదేళ్ల ఉదయ్, చారుమతి, ఆరేళ్ల చర్మిషా, మనస్విక అనే నలుగురు పిల్లలు ఆడుకునేందుకు బయటకు వెళ్లారు. ఎంతసేపైనా వారు ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో చిన్నారుల తల్లిదండ్రులు వారి కోసం వెతికినా కనిపించలేదు.

చివరికి స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో ఉదయ్, చారుమతి, చర్మిషా, మనస్విక అనే నలుగురు చిన్నారుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సరదాగా ఆడుకునేందుకు చిన్నారులు కారు లోపలికి వెళ్లారు. తర్వాత కారు లాక్‌ పడిపోయింది. డోర్‌లు తెరిచేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఊపిరి ఆడక ఆ నలుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో చారుమతి, చరిష్మా అక్కాచెల్లెళ్లు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.
Tags:    

Similar News