నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
ఈ నెల 15 వరకు భవానీదీక్షల విరమణకు ఏర్పాట్లు..
Byline : G.P Venkateswarlu
Update: 2025-12-11 01:17 GMT
ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్నిప్రతిష్టాపన.
ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన.. గురువారం ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి.
ఈనెల 12 నుంచి తెల్లవారు జామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు.. భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలు రద్దు.
అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలు రద్దు చేసిన దేవస్థానం.. ఐదు క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతి.
భక్తుల భద్రత పర్యవేక్షణకు 320 సీసీ కెమెరాలతో నిఘా.. కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు.
సుమారు 7 లక్షల మంది భక్తులు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. భవానీల రాక దృష్ట్యా 28 వైద్య శిబిరాలు ఏర్పాటు.