బంగారుపాలెం: అభిమానులపై విరిగిన లాఠీ.. జగన్ సీరియస్

వైసిపి మాజీ ఎమ్మెల్యేలను కట్టడి చేసిన పోలీసులు. చిత్రాలు చెప్పే కథలు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-09 07:56 GMT

రు జిల్లా బంగారుపాలెం వద్ద వైసిపి చీఫ్ వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో అభిమానులపై పోలీసులు లాఠీలు ఝళిపించారు.

వైసిపి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను పోలీసులు కట్టడి చేశారు. ఓ కార్యకర్త గాయపడ్డాడు.
కొద్దిసేపటి తర్వాత గాయపడిన కార్యకర్త వాహనం వద్దకు రావడంతో జగన్ ప్రమర్శించడమే కాదు. పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమాషాలు చేస్తున్నారా? ఏమిటి దారుణం అంటూ పోలీసులపై కన్నెర్ర చేశారు.


 గిట్టుబాటు ధర లభించక నష్టపోయిన మామిడి రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ బంగారుపాలెం లో పర్యటన సాగుతోంది. హెలిపాడ్ నుంచి మామిడికాయల మండివైపు జగన్ కాన్వాయ్ సాగుతోంది. చిత్తూరు sp మణికంఠ చందోలు స్వయంగా బంగారుపాలెంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు.

వైసిపి అధినేత వైయస్ జగన్ చూడడానికి జిల్లాలోని అనేక ప్రాంతాల నుంచి భారీగా పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. జాతీయ రహదారులే కాకుండా పల్లెలకు వెళ్లే దారులను కూడా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు.

ఏందయ్యా ఇది
బంగారుపాలెంలో వైయస్ జగన్ పర్యటన కోసం డిప్యూటీ మాజీ సీఎం కలెక్టర్ నారాయణస్వామి వచ్చారు. ఆయన వాహనాన్ని రోడ్డు మధ్యలోనే పోలీసులు నిలిపివేశారు. పోలీసులతో ఆయన బతిమిలాడడం కనిపించింది.
ఇది దారుణం..

పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ ను అడ్డగించిన పోలీసులు

పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం జాతీయ రహదారి పైనే ఉంటుంది.. దీనికి సమీపంలోనే పలమనేరు నియోజకవర్గం కూడా ఉంది. ఆ నియోజకవర్గ మాజీ వైసీపీ ఎమ్మెల్యే వెంకట గౌడ కూడా వాహనంలో వచ్చారు.. ఆయనను కూడా పట్టణంలోకి అనుమతించకుండా రోడ్డుపై నిలిపివేశారు. తమ పార్టీ అధినేత వైయస్ జగన్ కలవడానికి అనుమతించాలని పోలీసులను వేడుకొంటూ ఉండడం కనిపించింది. ఆంక్షలు నేపథ్యంలో ఆయనతోపాటు పలమనేరు ప్రాంతం నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను కూడా పోలీసులు నిలువరించారు.
పోలీసులతో వాగ్వివాదం

విజయానందరెడ్డిని అడ్డగించిన పోలీసులు

ద్విచక్ర వాహనంలో వెళుతున్న చిత్తూరు నేత విజయానందరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. ఒక ఉదుటన బైక్ నుంచి దూకేసిన విజయానంద రెడ్డి పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వివాదానికి దిగారు. రోడ్డులో వెళ్లడానికి ఎందుకు అడ్డుకుంటున్నారంటూ విజయానంద రెడ్డి పోలీసులను నిలదీశారు. ఈ సందర్భంలో పార్టీ శ్రేణులు కూడా చుట్టుముట్టడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసిపి నాయకులు పోలీసులకు తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది.
బంగారుపాలెం లో వైఎస్ జగన్ స్వాగతిస్తూ ఏర్పాటుచేసిన బ్యానర్లు, ఇతర సామర్థ్యం పోలీసులు తొలగించారు. దీనిపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం చెప్పాయి.
బంగారుపాళ్యం పట్టణంలోకి వైయస్ జగన్ రాక సందర్భంగా రోడ్ల వెంట బాలుడు తీరిన వైసిపి మద్దతుదారులను పోలీసులు చదరగొట్టారు.
బంగారుపాలెంలోని హెలిపాడ్ నుంచి బయలుదేరిన వైఎస్ జగన్ కాన్వాయ్ ని పోలీసులు అడుగడుగున తనిఖీ చేశారు. వాహనాల సంఖ్యను లెక్కించి మరీ అనుమతించారు.
వైసీపీ మాజీ మంత్రులు కే.నారాయణస్వామి, మాజీ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ తోపాటు జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన నాయకుల వాహనాలను కూడా అనుమతించలేదు.
దీనిపై వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీటుగా స్పందించారు.
"రైతులను పరామర్శించడానికి అధినేత జగన్ వస్తుంటే ప్రభుత్వానికి ఇంత ఉలిక్కిపాటు ఎందుకు" అని ప్రశ్నించారు.
"బంగారుపాలెం మార్కెట్ యార్డులో రైతులను లేకుండా చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నింది" అని వైసిపి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
"ప్రభుత్వం నుంచి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చాం. అందరూ సంతృప్తిగా ఉన్నారు. దీనివల్లే రైతులు మార్కెట్లో లేరని చెప్పించడానికి" కుట్ర పన్నారు అని భువన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు.
భూమన ఇంకా ఏమన్నారంటే..
₹వైయస్ జగన్ పర్యటనను అడ్డుకోవడం, అభిమానులను కట్టడి చేయడానికి సీఎం ఎన్ చంద్రబాబు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో సగం వంతు సమయం రైతుల కోసం వెచ్చించి ఉంటే బాగుండేది" అని కరుణాకర్ రెడ్డి సూచించారు.


" వైసీపీని అణిచివేయడానికి కేటాయిస్తున్న సమయంలో సగం వంతు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఉంటే మేలు జరిగేది" అని కరుణాకర్ రెడ్డి ప్రభుత్వానికి చురకలాంటించారు.

Similar News