బాబాయ్, చిన్న పిల్లని కదా, ఇంత పని చేస్తావా?
కుమార్తె వరసైన బాలికపై అత్యాచారం, గర్భిణీ అని తేలడంతో నిందితుని పరారీ
By : The Federal
Update: 2025-09-30 09:02 GMT
విజయవాడ.. ఆంధ్రప్రదేశ్ వ్యాపారకేంద్రం.. అందులో పాయకాపురం.. ఇదో మురికివాడగా అంటుంటారు. అటువంటి చోట వావివరుసలు మరచిన ఓ పినతండ్రి తన అన్న కుమార్తెను చెరిచాడు. గర్భవతిని చేశాడు. ఇప్పుడీ సంఘటన నాగరిక సమాజాన్ని కలవరపర్చింది. పోలీసు కేసు నమోదైంది.
నగర శివారు పాయకాపురంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఏడో తరగతి చదువుతున్న ఓ అమ్మాయిపై వరుసకు బాబాయ్ అయిన వ్యక్తి అత్యాచారం చేశాడు. ఆరేళ్ల కిందట ఆ అమ్మాయి తల్లిదండ్రులు చనిపోయారు. పిన్ని, బాబాయ్ దగ్గర ఉంటూ చదువుకుంటోంది. ఈ క్రమంలో బాబాయికి దుర్బుద్ధి పుట్టింది. ఆ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇటీవలికాలంలో ఆ అమ్మాయి అనారోగ్యం పాలైంది. తీరా డాక్టర్లు పరీక్ష చేస్తే ఆ అమ్మాయి గర్భవతి అని తేలింది. దీంతో నున్న రూరల్ పోలీసులకు ఆ బాలిక ఫిర్యాదు చేసింది. గర్భం దాల్చిన ఆ బాలికను వైద్య పరీక్షలకు పంపారు. ఫోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. ఈ ఘాతుకానికి పాల్పడిన ఆ నిందితుడు పరారీలో ఉన్నారు.