పంటకాల్వలోకి దూసుకెళ్లిన ఆటో, ముగ్గురి మృతి
బాపట్ల జిల్లా దోనేపూడి వద్ద విషాదం
By : The Federal
Update: 2025-12-12 09:40 GMT
బాపట్ల జిల్లా కొల్లూరు మండలం దోనేపూడి వద్ద శుక్రవారం ఉదయం ఘోరం జరిగింది. ఆటో పంటకాల్వలోకి దూసుకెళ్లి ముగ్గురు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరిమితికి మించి ప్రయాణీకులు ఎక్కడంతో ఆటోను డ్రైవర్ అదుపు చేయలేకపోయారు. దీంతో ఆటో పంటకాల్వలోకి దూసుకువెళ్లినట్టు కొందరు చెప్పగా ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయి కాల్వలోకి వెళ్లిపోయినట్టు మరికొందరు చెబుతున్నారు.
క్షతగాత్రులను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో వెల్లటూరు వైపు వెళ్తోన్నట్టు సమాచారం. మృతులను చింతమోటు గ్రామానికి చెందిన చాట్రగడ్డ కాంతారావు (48) పెసర్లంక శ్రీనివాసరావు(55), షేక్ ఇస్మాయిల్(55)గా గుర్తించారు. ఘటనపై కొల్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలిని స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పరిశీలించారు.