అప్పులు తీసుకోవడాన్ని ఆపడంలోనూ కుట్ర కోణాలు ఉన్నాయా?
అప్పులు తీసుకోకుండా అడ్డుపడితే దేశద్రోహ నేరం అవుతుందా?;
అప్పులు తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కుట్ర కోణం ద్వారా ఆపేందుకు వైఎస్సార్సీపీ ప్రయత్నం చేసిందని ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అప్పులు ఇవ్వకుండా అడ్డుకోవడంలో కుట్ర కోణాలు ఉన్నాయనే విమర్శ రాష్ట్ర వ్యప్తంగా చర్చకు దారి తీసింది.
మేము చేస్తే అడ్డుకుంటారా...
వైఎస్సార్సీపీ హయాంలో రూ. 7,000 కోట్ల రుణం కోసం జీవో జారీ చేసినప్పటికీ, ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం తీసుకుంటున్న రూ. 9,000 కోట్ల రుణాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ ఆరోపించింది. అయినప్పటికీ ఆర్‌బీఐ, సెబీ క్లియరెన్స్‌లతో రుణాలు ఓవర్-సబ్‌స్క్రైబ్ అయినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అయినా వైఎస్సార్సీపీ విమర్శలు కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌లు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నాయకత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తప్పుగా చిత్రీకరిస్తూ, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.
ఆరోపణల సారాంశం
జర్మనీలోని విప్రో ఉద్యోగి ఉదయ భాస్కర్ ద్వారా బాంబే స్టాక్ మార్కెట్‌లో 200 ఈ-మెయిల్స్ పంపి, పెట్టుబడిదారులను రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయవద్దని భయపెట్టినట్లు ఆరోపణ.
ఏపీఎండీసీ ద్వారా రూ. 9,000 కోట్ల రుణం కోసం జారీ చేసిన జీవో నెం. 32ను అడ్డుకునేందుకు ఆర్‌బీఐ, సెబీ, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు, హైకోర్టులో పిల్ వేయించినట్లు ఆరోపణ.
2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత, వైఎస్సార్సీపీ ప్రజల సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపణ.
ఈ చర్యలను దేశద్రోహంగా పరిగణించి, వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేయాలని మంత్రి డిమాండ్.
వైఎస్సార్సీపీ రాష్ట్ర బ్రాండ్‌ను దెబ్బతీసే కుట్రలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ వివాదం రాష్ట్ర ఆర్థిక, రాజకీయ వాతావరణంపై ప్రభావం చూపవచ్చు. అభివృద్ధి కోసం రాజకీయ సమన్వయం అవసరమని, అయితే ప్రస్తుతం రాజకీయ ఘర్షణలు అడ్డంకిగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.