ఏపీకి మళ్ళీ వర్ష సూచన.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన..

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు కాస్తా వాయుంగాడులగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది.

Update: 2024-09-17 11:49 GMT

ఆంధ్రప్రదేశ్‌ను ఇటీవల భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. ఒకదాని తర్వాత ఒకటిగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు కాస్తా వాయుంగాడులగా మారుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదైంది. కాగా రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురవనున్నాయని కేంద్ర వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది. వర్షాలతో విసిగెత్తిన ఆంధ్ర ప్రజలకు ఈ వార్నింగ్ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. మళ్ళీ వరదలు తప్పవా అన్న చర్యలకు బీజం వేస్తున్నాయిన ఈ హెచ్చరికలు. ఈ సారైనా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని ప్రజలకు వరదల నుంచి కాపాడుతుందా? సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుందా? అన్న ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాగా ప్రజలు నిశ్చింతగా ఉండాలని, ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినా ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని కూటమి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. ఇదే విషయాన్ని అమరావతి వాతావరణ కేంద్రం కూడా ప్రకటించింది. సముద్ర మట్టం దగ్గర రుతుపవన ధ్రోణి ఉందని, అది డెహ్రాడూన్, ఒరై మీదుగా వాయుగుండం కేంద్రం గుండా ఈశాన్య ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, గోపాల్‌పూర్‌లో పశ్చిమ బంగాళాఖాతానికి ఆగ్రేయ దిశగా కొనసాగుతోందని తెలిపింది.

కోస్తాంధ్రలో భారీ వర్షాలు..

ఈ రుతుపవన ధ్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైతురు, వాయువ్య దిశగా గాలులు వీయనున్నాయని, వీటి ప్రభావంతోనే ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అమరావతి వాతావరణ శాఖ పేర్కొంది. ఈ గాలుల ప్రభావం వల్ల ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మంగళవారం, బుధవారం, గురువారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. రాయలసీమలో కూడా ఈ మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, వరదలు వచ్చేటంత వర్షాలు కురిసే అవకాశాలు అత్యల్పంగా ఉన్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఇంకా కొనసాగుతున్న సహాయక చర్యలు

ఇదిలా ఉంటే సెప్టెంబర్ నెల ప్రారంభంలో భారీ కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదలతో విజయవాడ, ఎన్‌టీఆర్ జిల్లా అతలాకుతలమైంది. లక్షల మంది ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ప్రభుత్వం అన్ని విధాల సహాయక చర్యలు అందిస్తోంది. వాహనాల బీమా, మరమ్మతుల దగ్గర నుంచిచ ఇళ్లు శుభ్రం చేసే పనులను కూడా ప్రభుత్వం చేపట్టింది. వరద బాధితులకు అందిస్తున్న సహాయక చర్యలు విజయవాడ సహా ఎన్‌టీఆర్ జిల్లాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. వరద బాధితులకు అందించే ఆర్థిక సహాయంపై సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంతో చర్చలు చేస్తున్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులకు కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రాథమికంగా ఎకరాకు రూ.10 వేల చొప్పున అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Tags:    

Similar News